తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పెట్రోలు డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ వినుకొండలో ఆ పార్టీ శ్రేణులు సోమవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. నరసరావుపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది.
ఆంజనేయులు ఇంటివద్ద నుండి పెద్దఎత్తున టిడిపి కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్ పై టాక్స్ తగ్గించి ధరలు తగ్గించాలని కోరినా ఏపీ ప్రభుత్వం తగ్గించక పోవడాన్ని నిరసిస్తూ ఈ ర్యాలీ చేపట్టారు.
బ్యానర్లు, ప్లే కార్డ్స్ చేత బూని ర్యాలీగా శివయ్య స్థూపం సెంటర్లో ఉన్న పెట్రోల్ బంకు వద్ద కొద్దిసేపు నిరసన వ్యక్తం చేసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టిడిపి నేత జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ
నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటు తూ సామాన్యుడి కొనుగోలు శక్తి పడిపోయిన ఈ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్ పై టాక్స్ తగ్గించి రాష్ట్ర ప్రభుత్వాలను కూడా తగ్గించమని కోరడం జరిగిందన్నారు.
అయితే ఇతర రాష్ట్రాల్లో పెట్రోలు డీజిల్ ధరలు తక్కువగానే ఉన్నాయని జగన్ రెడ్డి మొండి వైఖరితో మన రాష్ట్రంలో ధరలు తగ్గించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. నేడు ఆర్థిక మంత్రి ప్రజల గోడు పట్టకుండా ధరలు తగ్గించేది లేదని నిస్సిగ్గుగా ప్రకటన చేయడం ప్రజాగ్రహానికి గురికాక తప్పదని అన్నారు. జగన్మోహన రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ ఎక్కుతున్నారా అని వారి ఆగ్రహావేశాలకు ప్రభుత్వం పతనం కాక తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జీవి తో పాటు టిడిపి నేతలు షమీం ఖాన్, సౌదాగర్ జానీ భాష, పీవీ సురేష్ బాబు, వంకాయలపాటి పేరయ్య, దాసరి కోటేశ్వరరావు మహిళా కార్యదర్శి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా నరసరావుపేట లో టిడిపి ఇన్చార్జి చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు