Suryaa.co.in

Andhra Pradesh

జగన్ జమానాలో సామాజిక ద్రోహమే తప్ప,సామాజిక న్యాయానికి తావులేదు

– తమఅధికారం, పదవులకోసం మంత్రులంతా 4కోట్ల దళిత, బీసీ, మైనారిటీలను జగన్ కాళ్లకింద చెప్పుల్లా మార్చారు
– రాష్ట్రంపై పెత్తనాన్ని ముగ్గురురెడ్లకు అప్పగించిన జగన్ రెడ్డి, మంత్రుల్ని వారిబానిసల్ని చేసింది నిజంకాదా? దళిత, బీసీ, మైనారిటీ యువత వాలంటీర్ ఉద్యోగాల్లోనే మగ్గిపోవాలా… వారి జీవితాలు బాగుపడనివ్వరా?
• ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ వర్గాలపై రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దాడులు, వేధింపుల్ని ఆపలేని మంత్రులు నోరులేని గొర్రెల్లా మారారు
• సొంతనిర్ణయాలు, స్వయంఅధికారం తో దళితులు, బీసీలు, మైనారిటీలకు న్యాయంచేయగలమని ఏమంత్రైనా గుండెలపైచేయి వేసుకొని చెప్పగలడా?
• దగాపడిన బడుగుబిడ్డలు, దళితులు, మైనారిటీలకు న్యాయంచేసేవరకు ముఖ్యమంత్రిని వదిలిపెట్టం
-మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ,మాజీ మంత్రి పీతలసుజాత ,టీడీపీ జాతీయ అధికారప్రతినిధి మొహమ్మద్ నసీర్ అహ్మద్ 

సామాజికద్రోహానికి పాల్పడుతున్న వైసీపీప్రభుత్వం సామాజికన్యాయం చేస్తున్నట్టు చెప్పుకో వడం సిగ్గుచేటని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను అణచివేస్తూ, వారిపై దాడులకు పాల్పడుతూ, వారినేదోఉద్ధరిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఆయావర్గాలను మోసగించాలని చూ స్తున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి కొల్లురవీంద్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో, మాజీమంత్రి శ్రీమతి పీతలసుజాత, టీడీపీ జాతీయ అధికారప్రతినిధి మొహమ్మద్ నసీర్ అహ్మద్ లతో కలిసి విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు క్లుప్తంగా వారి మాటల్లోనే …

కొల్లురవీంద్ర : “దళితులకు ఈ ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఈ మూడేళ్లలో ఏం న్యాయం చేసింది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటినుంచీ దళితులు, బీసీలు, మైనారిటీలపై నిత్యందాడులు జరుగుతున్నది నిజంకాదా? ఆయావర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అణగదొక్కి దెబ్బతీసింది నిజంకాదా? 17మందికి మంత్రిపదవులిస్తే ఆయా వర్గాలకు సామాజికన్యాయంచేసినట్టా? దళితమంత్రులు ఎవరైనాసరే స్వేచ్ఛగా, సొంతంగా నిర్ణయాలు తీసుకోగలరా? వారికి ఆస్వేచ్ఛఉందా? సజ్జలరామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వై.వీ. సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల ఆదేశాలప్రకారం నడుచుకోవడంతప్ప కేబినెట్ లోని ఏమంత్రైనా తననిర్ణయాధికారం ప్రకటించగలడా?

సొంతనిర్ణయాలు, స్వయంఅధికారం తో దళితులు, బీసీలు, మైనారిటీలకు న్యాయంచేయగలమని ఏమంత్రైనా గుండెలపైచేయి వేసుకొనిచెప్పగలడా? కనీసం వారిశాఖలకు సంబంధించివారు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకో గలరా? రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు 4కోట్లమందిఉంటే, ఎవరో పదిమందికి మంత్రిపదవులు ఇచ్చి, ఆయావర్గాలను ఆదుకుంటున్నానని ముఖ్యమంత్రి కలరింగ్ ఇస్తే ప్రజలునమ్ముతారా? మంత్రుల బస్సుయాత్రకు బలవంతంగా ఉపాధికూలీలు, డ్వాక్రా మహిళల్నితరలిస్తే, వారంతా ఛీకొట్టి పారిపోయారు. బస్సుయాత్ర జనంలేక వెలవెలబోతే, అక్కడేదో గుంపులు గుంపులు ప్రజలున్నారని ఫోటోలు మార్ఫింగ్ చేసి ప్రజల్ని నమ్మిం చాలని చూస్తేతెలుసుకోలేరనుకున్నారా?

(బస్సుయాత్ర బ్రహ్మండంగా విజయవంతం అంటూ ప్రచురించిన ఫోటోను ఈ సందర్భంగా రవీంద్ర విలేకరులకు చూపుతూ, మార్ఫింగ్ చేసినట్టు నిరూపించారు) ఇలాంటి చీప్ ట్రిక్స్ తో ప్రజల్ని ఎన్నాళ్లునమ్మిస్తారు? మంత్రులంతా యాత్రపేరుతో ఖాళీకుర్చీలకే తమప్రసంగాలు వినిపించారు.
జగన్ తాత రాజారెడ్డి చేనేత వర్గానికి చెందిన జింకానర్సయ్య అనేవ్యక్తిని దారుణంగాచంపి, అతనిగనులను లాక్కున్నమాట నిజంకాదా? కాదని జగన్మోహన్ రెడ్డి చెప్పగలడా? పొద్దుటూరులో నందంసుబ్బయ్యను, మాచర్లలో చంద్రయ్యను వైసీపీఎమ్మెల్యేలు శివప్రసాద రెడ్డి, రామకృష్ణారెడ్డిలు బలితీసుకోలేదా? ప్రభుత్వఅరాచకాలను, స్థానికఎమ్మెల్యేల దోపిడీని ఎదిరించడమే ఆఇద్దరు బీసీనేతలనేరమా? కరోనాసమయంలో మాస్క్ లు అడిగడమే నేరమంటూ డాక్టర్ సుధాకర్ పెడరెక్కలు విరిచి, అతన్ని జగన్ ప్రభుత్వం చంపేయలేదా?

నిన్నటికి నిన్న డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని వైసీపీఎమ్మెల్సీ అనంతఉదయ్ భాస్కర్ బలితీసుకున్నది నిజంకాదా? సొంతపార్టీ ఎమ్మెల్సీ దళితయువకుడిని హత్యచేస్తే జగన్మోహన్ రెడ్డి నోరువిప్పాడా? టీడీపీసహా, దళిత,ప్రజాసంఘాలు ధర్నాలుచేస్తే తప్ప వైసీపీఎమ్మెల్సీపై కేసుపెట్టలేదు. ఇసుకధరలపై నిలదీసిన వరప్రసాద్, మద్యం ధరలపై నిరసించిన ఓంప్రతాప్, విక్రమ్, ఇతరదళితబిడ్డలు ఏమయ్యారు? గుంటూరుజిల్లా నకరికల్లులో వైసీపీనేత శ్రీనివాసరెడ్డి, గిరిజనమహిళను ట్రాక్టర్ తో తొక్కించిచంపింది వాస్తవం కాదా? వైసీపీనేతల వేధింపులకు భయపడి, అబ్డుల్ సలాం అనేవ్యక్తి కుటుంబంతో సహా రైలుపట్టాలపై పడి ప్రాణాలుతీసుకున్నది నిజంకాదా?

మొన్నటికి మొన్న వెంకాయమ్మ అనే దళితమహిళ ప్రభుత్వనిర్వాకాలపై ప్రశ్నిస్తే, ఆమెను మీపార్టీవారితోకొట్టిస్తారా.. అదేనా మీరు చెబుతున్న సామాజికన్యాయం? జీవోనెం-217తో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15లక్షలమంది మత్స్యకారుల్ని రోడ్డున పడేయడమేనా జగన్ రెడ్డి ఆవర్గానికి చేసిన సామాజికన్యాయం? జగన్ ముఖ్యమంత్రి అయ్యాక స్థానికసంస్థల్లో బీసీలకు ఉన్న రిజర్వేషన్లను 34శాతంనుంచి 24శాతానికి తగ్గించలేదా? దానివల్ల బీసీలు 16,800లకు పైగా స్థానికపదవుల్నికోల్పోలేదా? ఇంతజరిగితే బీసీమంత్రులు ఏనాడైనా ముఖ్యమంత్రిని ప్రశ్నించారా?

ఈ ప్రభుత్వం రూ.18,226కోట్ల బీసీకార్పొరేషన్ నిధుల్ని, రూ.6,320కోట్ల ఎస్సీ కార్పొరేషన్నిధుల్ని, రూ.1473కోట్ల మైనారిటీకార్పొరేషన్ నిధుల్ని దారిమళ్లించింది వాస్తవం కాదా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధికి ఉపయోగించాల్సిన కార్పొరేషన్ నిధుల్ని ముఖ్యమంత్రి తనసొంత అవసరాలకు వాడుకుంటుంటే ఆయావర్గాల మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎందుకు ప్రశ్నించలేదు? దళిత, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 18వేల ఎకరాలను వైసీపీప్రభుత్వం ఇళ్లపట్టాలపేరుతో బలవంతంగా వారి నుంచి లాక్కున్నది నిజం కాదా?

స్వాతంత్ర్యభారతదేశ చరిత్రలో దళితులు, బీసీలు, మైనారిటీలపై జగన్ ప్రభుత్వంలో జరిగినన్ని దాడులు, వేధింపులు ఎక్కడైనాజరిగాయా? సామాజికవిద్రోహాలకు పాల్పడు తూ, మంత్రులంతా బస్సులెక్కి సామాజికన్యాయమని అరిస్తే సరిపోతుందా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వఉద్యోగాలపై పెద్దపెద్ద మాటలు మాట్లాడిన జగన్, ముఖ్యమంత్రి అయ్యాక యువతకు ఎన్ని ఉద్యోగాలిచ్చాడు? ఏటా విడుదలచేస్తానన్న జాబ్ క్యాలెండర్ ఏమైంది. డీఎస్సీ, ఏపీపీఎస్సీ, పోలీస్ నోటిఫికేషన్లు, ఇతర ఖాళీలు భర్తీచేయకుండా దళిత, బీసీ, మైనారిటీవర్గాల యువత జీవితాలతో ముఖ్యమంత్రి ఆటలాడుతున్నది వాస్తవంకాదా?

చంద్రబాబుఐటీ ఉద్యోగాలిచ్చి యువతను విదేశాలకు పంపితే, జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ ఉద్యోగాలతో వారిజీవితాల్లో చీకట్లునింపాడు. గ్రామాలలో నాటుసారా, కల్తీమద్యం ఏరులైపారుతూ, యువతజీవితాలు నిర్వీర్యమ వుతున్నా ముఖ్యమంత్రి స్పందిస్తున్నాడా? జగన్ రెడ్డి ధనదాహానికి ఇంకా ఎందరు అణగారినవర్గాల వారు బలికావాలి… ఎందరుఆడబిడ్డల మంగళసూత్రాలు తెగాలి? పోలవరం ముంపుప్రాంతాల్లోని గిరిజనులకు ఇస్తామన్న పరిహారమంతా వైసీపీఎమ్మెల్యేలు పంది కొక్కుల్లా బొక్కేస్తున్నా ముఖ్యమంత్రి ఏనాడైనా స్పందించాడా?

టీడీపీప్రభుత్వంకంటే ఎక్కువ పరిహారంఇస్తానని చెప్పిన జగన్ ఏనాడైనా వారికి రూపాయి ఇచ్చాడా? గతంలో టీడీపీ హాయాంలో నిరుద్యోగభృతి 6లక్షలమందికి ఇచ్చాము. అదిఏమైంది? అలానే దళిత, బీసీ, మైనారిటీ యువతకోసం చంద్రబాబుగారు అమలుచేసిన విదేశీవిద్య, (రూ.10లక్షలఆర్థికసాయం) విద్యోన్నతి, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాలు ఏమయ్యాయో ఈప్రభుత్వంలోని మంత్రులకు తెలియదా? టీడీపీప్రభుత్వంలో విదేశీవిద్య పథకంద్వారా విదేశాలకు వెళ్లినవారంతా, ఈప్రభుత్వం వచ్చాక వారికిఅందాల్సిన సాయంఅందక, దేశంకాని దేశంలో బాత్రూమ్ లు కడుగుతూ, నానా అవస్థలు పడుతున్నది నిజంకాదా?

ఏపీ యువత వాలంటీర్ ఉద్యోగాల్లోనే మగ్గిపో వాలా? సాఫ్ట్ వేర్, ఇతరత్రా రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోవాల్సిన యువతను జగన్ రెడ్డి ఎందుకూ పనిరానివారిగా మార్చింది వాస్తవంకాదా? టీడీపీప్రభుత్వంలో అమలైన స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ కేంద్రాలను జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే మూసేయలేదా? ఇంటర్ విద్యార్థలకు మధ్యాహ్నభోజనం పథకాన్ని ఎందుకు తొలగించారు? ఉచితంగా ఐఏఎస్, ఐపీఎస్, ఇతరపోటీపరీక్షలకు శిక్షణపొందే దళిత, బీసీ, మైనారిటీ విద్యార్థులను రోడ్డునపడేయలేదా? టీడీపీప్రభుత్వం 16లక్షలమంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ అందిస్తే, జగన్మోహన్ రెడ్డి ఆసంఖ్యను 10లక్షలకుకుదించాడు. దానికి కోతపెట్టడానికి అమ్మఒడి ఇస్తున్నామని, విద్యుత్ బిల్లులు ఎక్కువవస్తున్నాయని, ఇంటిస్థలం 100గజాలకుపైన ఉందని పిచ్చిపిచ్చి కారణాలు పెట్టడంలేదా?

నాడు-నేడు పేరుతో రాష్ట్రవిద్యారంగాన్ని భ్రష్టుపట్టించి, దళిత, బీసీ, మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైనవిద్యను దూరంచేయడమేనా మీరుచెబుతున్న సామాజికన్యాయం? ఇలాంటి దుర్మార్గపుపనులతో దళిత, బీసీ, మైనారిటీ యువతను అటువిద్యకు, ఇటుఉపాధికి దూరంచేయడమేనా జగన్ రెడ్డి సాధించిన సామాజికన్యాయం? రాష్ట్రంలో ఉన్న యూనివర్శిటీల్లో దాదాపు 10యూనివర్శిటీలకు వైస్ ఛాన్స్ లర్లుగా జగన్ సామాజిక వర్గంవారే ఉన్నారు. ఇతరవర్గాలవారు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్స్ లర్లుగా పనికిరారా?

ఏపీఐఐసీ ఛైర్మన్ పదవిని టీడీపీలో బీసీకిఇచ్చాము. ఇప్పుడు అలాంటి ముఖ్యమైన పదవులున్నీ రెడ్లకిందలేవా? ప్రభుత్వసలహాదారుల్లో ఎంతమంది బీసీలు, ఎస్సీ,ఎస్టీలు, మైనారిటీలు ఉన్నారు? మొత్తం42మంది సలహాదారులుంటే, వారిలో 35మంది రెడ్డివర్గం వారే. ప్రభుత్వానికి సలహాలివ్వడానికి బీసీలు, దళితులు పనికిరారా? టీడీపీహాయాంలో టీటీడీ ఛైర్మన్ పదవి బీసీలకు ఇచ్చాము.. ఈ ముఖ్యమంత్రి టీటీడీబోర్డ్ మొత్తాన్ని తనవర్గంతో నింపేశాడు. కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లలో ఎంతమంది బీసీలు, దళితులు, మైనారిటీలుఉన్నారు. ఉన్నవారికి ఏంఅధికారంఉంది? జగన్ ప్రభుత్వం పెట్టిన కార్పొరేషన్లద్వారా ఎంతమంది యువకులకు స్వయంఉపాధిరుణాలిచ్చారో మంత్రులు చెప్పగలరా?

రాజధాని అమరావతిలో 70శాతంవరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీల భూములుంటే, అవేవీ అభివృద్ధికాకూడదని, ఆయావర్గాలు బాగుపడకూడదని, జగన్మోహన్ రెడ్డి ఆప్రాంతాన్నే నాశనంచేసింది వాస్తవంకాదా? చంద్రబాబుగారు అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ కు అవకాశమిస్తే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికాగానే దాన్నెందుకు రద్దుచే శాడు? ఈవిధంగా ఈ ముఖ్యమంత్రి తనవర్గానికి ఏంన్యాయంచేశాడో, ఇతరవర్గాలకు ఏం వెలగబెట్టాడో ఆధారాలతో సహానిరూపించడానికి తాముసిద్ధంగాఉన్నాము. ముఖ్యమంత్రి ముమ్మాటికీ బీసీలు, దళితులు, మైనారిటీలకు తీరనిద్రోహం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి మెప్పుకోసమే మంత్రులంతా గత్యంతరంలేక బస్సుయాత్రలో పాల్గొన్నారు.

తమ వర్గాలవారు నాశనమైపోతున్నా కూడా నోరుమెదపలేని మంత్రులు ఆపదవుల్లో ఉంటేఎంతా… లేకపోతే ఎంతా? ముఖ్యమంత్రికి భయపడి నోరెత్తలేని మంత్రులంతా చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోవడం ఖాయం. అసత్యాలతో, మోసాలతో బస్సుయాత్రలపేరుతో దళిత, బీసీ, మైనారిటీ వర్గాలను అణచివేయాలని చూస్తే తెలుగుదేశంపార్టీ ఊరుకోదని హెచ్చరిస్తున్నాం. దగాపడ్డ బడుగుబిడ్డలకు న్యాయంజరిగేవరకు టీడీపీ వారికి అండగాఉంటుంది. సామాజిక న్యాయం అనేమాటకు న్యాయంచేసింది..దానికి ఎప్పుడూ కట్టుబడిఉంది తెలుగుదేశం ప్రభుత్వమే. మరలా చంద్రబాబుగారు ముఖ్యమంత్రి అయితేనే దళిత, బీసీ, మైనారిటీ వర్గాలకు న్యాయం జరుగుతుందని ఘంటాపథంగా చెప్పగలం.”

బస్సుయాత్ర తుస్సు యాత్రయితే, మంత్రులు నోరులేని గొర్రెలయ్యారు : మాజీమంత్రి పీతలసుజాత
“వైసీపీప్రభుత్వ సామాజికన్యాయభేరి బస్సుయాత్ర తుస్సుయాత్రైంది. మంత్రులంతా నోరులేని గొర్రెల్లా ప్రవర్తిస్తున్నారు. వాస్తవంగా వైసీపీప్రభుత్వం సామాజికదోపిడీ చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీ వర్గాల విషయంలో ఈప్రభుత్వం సామాజిక విద్రోహశక్తిగా వ్యవహ రిస్తోంది. ఈప్రభుత్వం ఏర్పాటుచేసిన కార్పొరేషన్లలో కుర్చీలుకూడా లేవు. కుర్చీలేఇవ్వని ప్రభుత్వం కార్పొరేషన్లకు నిధులిస్తుందా? కార్పొరేషన్ ఛైర్మన్లను అధికారులు గౌరవిస్తున్నా రా? ఒక్కఛాన్స్ అన్న జగన్మోహన్ రెడ్డిమాటనమ్మి, ఆయన్ని ముఖ్యమంత్రిచేయడంలో దళితులు కీలకపాత్ర పోషించారు. అలాంటి దళితులపైనే జగన్ ప్రభుత్వంలో దాడులు, వేధింపులు, అత్యాచారాలు, హత్యలు ఎక్కువయ్యాయి. రాష్ట్రాన్ని మూడుభాగాలుచేసి, ముగ్గురురెడ్లకు అప్పగించడమేనా మంత్రులు చెప్పిన సామాజిక న్యాయం? జగన్ ని ముఖ్యమంత్రి చేసినదళితులకే రాష్ట్రంలో రక్షణలేదు. దళితమహిళలపై జరిగే అఘాయిత్యాల గురించి తెలియని దుస్థితిలో హోంమంత్రి ఉన్నారు. మంత్రుల కుటుంబా ల్లోనో, లేక వారికి సంబంధించిన వారెవరైనా అత్యాచారానికో, హత్యకో గురైతే వాటితాలూకా బాధేంటో అప్పుడు వారికి తెలిసి వస్తుంది? దళిత, బీసీ, మైనారిటీ యువతకు ఈప్రభుత్వం రూపాయి ఆర్థికసాయంచేసిందా? మహానాడు జరక్కుండా ఎంతచేయాలో అంతచేశారు. అన్న ఎన్టీఆర్ ఆశీస్సులతో, చంద్రబాబుపై ఉన్ననమ్మకంతోనే రాష్ట్రచరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మహానాడు విజయవంతమైంది.”

మంత్రులంతా జగన్ పాలేర్లలా ప్రవర్తిస్తున్నారు – మొహమ్మద్ నసీర్ అహ్మద్ :
“సామాజికన్యాయం పేరుతో వైసీపీప్రభుత్వం డ్రామాలాడుతోంది. మంత్రులబస్సుయాత్ర పచ్చి బూటకం. ముస్లిం మైనారిటీలను నమ్మించి, వారిఓట్లతో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి, వారినే భక్షిస్తున్నాడు. జగన్ ప్రభుత్వంలో ముస్లింలపై జరుగుతున్న దారుణాలు, ఆకృత్యాలు మంత్రి అంజాద్ బాషాకు కనిపించడంలేదా? అంజాద్ బాషా మంత్రిపదవికోసం రాష్ట్రంలోని మైనారిటీలు తమసర్వస్వం కోల్పోవాలా? మైనారిటీయువత ఇతరవర్గాలతో సమానంగా, గౌరవంగా బతకాలనిభావించిన చంద్రబాబుగారు 1800మంది యువకుల్ని ఉన్నతవిద్యకోసం విదేశాలకుపంపారు. ఈప్రభుత్వం వచ్చాక ఉన్నతవిద్యకోసం విదేశాలకు వెళ్లిన మైనారిటీయువత పరిస్థితి దారుణంగా తయారైంది.

LEAVE A RESPONSE