Suryaa.co.in

Andhra Pradesh

అంచనాలు ఎవరెస్టులా –ఖర్చులు కుప్పదిబ్బలా వైసీపీ బడ్జట్ లెక్కలు

– పిట్టకథల మంత్రి బుగ్గన లెక్కలు ప్రజలు నమ్మె పరిస్థితిలో లేరు.
– ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, శాసనమండలి సభ్యులు బిటి నాయుడు

వైసీపీ ప్రభుత్వ బడ్జట్ అంచనాలు ఎవరెస్టు శిఖరంలా ఉంటే ఖర్చులు మాత్రం కుప్పదిబ్బలా ఉన్నాయి. 2022-23 వైసీపీ బడ్జట్ అంకెల గారడీ తప్పా అందులో బలం లేదు. పిట్టకథల మంత్రి బుగ్గన లెక్కలు ప్రజలు నమ్మే పరిస్తితి లేదు. 2019-20 బడ్జట్ అంచనాలు 2.27 లక్షల కోట్లు కాగా ఖర్చులు మాత్రం కేవలం 1.73 లక్షల కోట్లు మాత్రమే. 2020-21 లో అంచనాలు 2.24 లక్షల కోట్లు కాగా ఖర్చులు మాత్రం కేవలం రూ. 1.87 లక్షల కోట్లు మాత్రమే.

2021-22 లో అంచనాలు 2.56 లక్షల కోట్లు కాగా ఖర్చులు సవరించిన అంచనాల ప్రకారం 2.08 లక్షల కోట్లు. 2022-23 అంచనాలు 2.56 లక్షల కోట్లు, ఇందులో ఎంత వరకు ఖర్చుపెడుతారో తెలియదు. మొత్తం మీద ఖర్చులు ఏ ఏడాది కూడా 2 లక్షల కోట్లు దాటని పరిస్థితి. అంటే అంచనాలకు ఖర్చులకు ఎక్కడా పొంతనలేకుండా లెక్కలు కడుతోంది వైసీపీ ప్రభుత్వం. రెవెన్యూ లోటు అంచనా వేయడంలో వైసీపీ ప్రభుత్వం అట్టర్ ప్లాఫ్ అయినట్లు లెక్కలు చెబుతున్నాయి.

2018-19 సవరించిన అంచనాలతో 2021-22 లెక్కలు పోల్చితో తెలుగుదేశం కన్నా వైసీపీ ప్రభుత్వం ఖర్చు తక్కువే చేసింది. వ్యవసాయం రంగంలో టిడిపి కన్నా 4.89 శాతం, నీటిపారుదల రంగంలో 4.05 శాతం, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధిలో 6.17 శాతం, గృహనిర్మాణంలో 1.82 శాతం, ఐటీ-ఎలక్ట్రానిక్స్, పరిశ్రమలరంగం, యువజన క్రీడలు లాంటి శాఖల ఖర్చులలో కూడా వైసీపీ కంటే కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఘణనీయంగా ఖర్చు చేసింది.

వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో కేటాయింపులు ఘనంగా ఉండగా.. ఖర్చు మాత్రం పాతాళానికి పడిపోయింది. జగన్ రెడ్డి 33 నెలల పాలనలో వ్యవసాయరంగానికి రూ.లక్షా 10 వేల కోట్లు ఖర్చు చేశామంటూ అన్నదాతలను, ప్రజలను పక్కదారి పట్టించారు. ఇంత ఖర్చు చేస్తే.. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఎందుకు ఉంటుంది? రైతులు ఎందుకు క్రాప్ హాలిడేలు ప్రకటిస్తారు?

కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానం, రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానంలో రాష్ట్రం ఎందుకుంటుంది? ఎక్కువ రైతు కుటుంబాలపై అప్పులున్న రాష్ట్రాల్లో ఏపీ ప్రథమ స్థానంలో ఎందుకు ఉంటుంది? రూ.లక్షా 10 వేల కోట్లలో ధాన్యం కొనుగోలుకు రూ.39,782 కోట్లు, ఇతర పంటల కొనుగోలుకు రూ.6,465 కోట్లు, విద్యుత్ సబ్సీడీ కింద రూ.36,630 కోట్లు కూడా కలిపి రూ.82,877 కోట్లు చూపడం వంచన కాదా? రైతులను, ప్రజలను మభ్యపెట్టడానికి వ్యవసాయ బడ్జెట్ లో అంకెల గారఢీ చేశారు.

వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు 14.5 శాతం ఉందని చెప్పడం జగన్ రెడ్డి మోసానికి నిదర్శనం. తాడేపల్లి ప్యాలెస్ లో అభివృద్ధి తప్ప.. రైతులు ఎక్కడ అభివృద్ధి చెందారో చెప్పాలి. ధాన్యం కొనే నాథుడు లేక, ధాన్యం బకాయిలు రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో సూక్ష్మసేద్యం పరికరాలు ఎక్కడా అందించడం లేదు. బడ్జెట్ లో మాత్రం కేటాయింపులు ఘనంగా చూపారు. రైతులకు యంత్ర పరికారల పంపిణీ నిలిపివేశారు.

జలకళ పథకం కింద దరఖాస్తులు లక్షల్లో ఉండగా… కేవలం 6 వేల బోర్లు మాత్రమే తవ్వారు. ఐదేళ్లలో ఈ పథకానికి 2,340 కోట్లు ఖర్చు చేస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించి చేతులెత్తేశారు. రైతు భరోసా కింద ప్రకటించిన రూ.7,020 కోట్లలో రాష్ట్ర వాటా కేవలం రూ.3,900 కోట్లు మాత్రమే. కేంద్ర నిధులను కూడా రాష్ట్ర బడ్జెట్ లో కలిపిన చరిత్ర జగన్ రెడ్డికే దక్కుతుంది. అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో కేంద్రం ఇచ్చే నిధులను కూడా వ్యవసాయ బడ్జెట్ కింద చూపడం రైతులను మోసం చేయడమే

LEAVE A RESPONSE