– నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపిన పాకాలవారిపల్లె మోహనరావు దంపతులు
చెట్టంత కొడుకు దూరమైతే, కొడుకులా తెలుగుదేశం పార్టీ అండగా నిలిచిందని, నారా లోకేష్‌ని కలిసి కృతజ్ఞతలు తెలిపింది ఓ కుటుంబం. చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలం, పనపాకం పంచాయతీ, పాకాలవారిపల్లెలో కె. మోహన్ రావు కుటుంబం నివాసం ఉంటోంది. వీరి అబ్బాయి జయకృష్ణ తిరుపతిలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.
23/5/2019న బైక్ మీద వెళుతుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. కుటుంబానికి పెద్ద దిక్కులా నిలిచిన కొడుకు కన్నుమూయడంతో ఆ దంపతులు విషాదంలో మునిగిపోయారు. టిడిపి సభ్యత్వం ద్వారా చేసిన ప్రమాదబీమా నుంచి రూ.2లక్షలు, చంద్రన్నబీమా ద్వారా మరో రూ.2లక్షలు బీమా పరిహారం మంజూరైంది. ఆధారమైన కొడుకు పోయిన కొండంత కష్టంలో ఉన్న వృద్ధదంపతులకు తెలుగుదేశం పార్టీ బీమా, టిడిపి ప్రభుత్వం అమలు చేసిన చంద్రన్న బీమా ఆసరా అయ్యింది.
చంద్రగిరి నియోజకవర్గం గాదంకి టోల్ గేట్ వద్ద విడిది కేంద్రం వద్దకి వచ్చి నారా లోకేష్‌ని కలిసి మోహనరావు దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పార్టీ మద్దతు ఉంటుందని లోకేష్ వారికి భరోసా ఇచ్చారు.