– చైర్మన్ గా నారప్పశెట్టి పిచ్చయ్య పేరు ఖరారు
మొత్తం 20 వార్డులుండగా, 8వ వార్డు వైసిపికి ఏకగ్రీవం అయింది. టిడిపి 13 వార్డుల్లో గెలుపొందగా.. 6వార్డుల్లో వైసిపి విజయం సాధించింది. దీంతో టీడీపీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. ప్రకాశం జిల్లా దర్శి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. నగర పంచాయతీలో గెలుపొందిన వార్డు కౌన్సిలర్లు టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు. గెలుపొందిన వార్డు కౌన్సిలర్లను టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్, దర్శి ఇంచార్జ్ పమిడి రమేష్ అభినందించారు. దర్శి నగర చైర్మన్గా నారపుశెట్టి పిచ్చయ్య పేరును టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది చైర్మన్ అభ్యర్థి నారపుశెట్టి పిచ్చయ్య ఓట్లు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.