Suryaa.co.in

Telangana

ఫిబ్రవరిలో నిజామాబాద్‌లో టీడీపీ భారీ బహిరంగసభ

-కేసీఆర్ కు వణుకు పుట్టి డిల్లి నుండి సభను ఖమ్మంకు మార్చుకున్నాడు
-ఎన్టీఆర్ స్పూర్తితో బిసి లే అభివృద్దే ఎజెండా
-రాష్ర్టంలోని అన్ని సీట్లకూ పోటీ చేస్తాం
-టిటిడిపి అధ్యక్షులు కాసాని జ్జానేశ్వర్ ముదిరాజ్

తెలంగాణలో టీడీపీకి పెరుగుతున్న బలం,చంద్రబాబు ఖమ్మం సభ విజయవంతం కావడంతో సీఎం కేసీఆర్‌ వణికిపోతున్నారని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ వ్యాఖ్యానించారు. టీడీపీకి భయపడిన కేసీఆర్‌ తన సభను, డిల్లీ నుంచి ఖమ్మంకు మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మం సభకు మించి ఫిబ్రవరి రెండవ వారంలో టీడీపీ భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌ లోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలోని అన్ని స్థానాలకు పోటీ చేస్తామని స్పష్టం చేశారు. కాసాని ఇంకా ఏమన్నారంటే.. రానున్న ఏన్నికల్లో పార్టీలో బిసిలకే పెద్దపీట. ప్రతి బిసి కూలానికి ఒక ఎమ్మెల్యే సీటు ఇస్తాం.నాయి బ్రాహ్మణ వర్గానికి ఇస్తాం. కుల సంఘాలు ఏకగ్రీవంగా ప్రతిపాదించిన వారికి పార్టీ టికెట్ ఇస్తాం.

రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. త్వరలో పార్టీ కమిటీలు రద్దు చేసి పార్టీ నిర్మాణం చేస్తాను. ఫిబ్రవరి రెండవ వారంలో నిజామాబాద్ లో బారీ బహిరంగ సభ. అనంతరం రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర, ఇంటింటికి టిడిపి కార్యక్రమాలు. టిడిపి బలాన్ని చూసి సి ఎం కేసీ ఆర్ కు వణుకు పుట్టి ఢిల్లీ నుంచి, తన సభను ఖమ్మంకు మార్చుకున్నాడు.

LEAVE A RESPONSE