– అక్కడ జరిగే తప్పొప్పులను నిర్ణయించేది మంత్రా.. లేక వ్యవస్థలా?
– బూతులమంత్రితో అంటకాగి, ఆయనకోసం 2014ఎన్నికల్లో పనిచేసి, అప్పులపాలై రైలుకిందపడి చనిపోయిన వంకావిజయ్ మరణంపై, అతని బావైన అడపాబాబ్జీ మృతిపై సమగ్రమైన దర్యాప్తుజరిపించాలని డీజీపీని కోరుతున్నాం
• గుడివాడ నియోజకవర్గానికిచెందిన ఇద్దరు వైసీపీనేతలు , బావబావమరుదులైన వంకా విజయ్..అడపా బాబ్జీ మరణాలకు మంత్రికి ఉన్న సంబంధమేంటి?
• అడపాబాబ్జీ శవయాత్రలో మంత్రినిఅడ్డగించి, ఆయన చొక్కాపట్టుకొని ఒకయువకుడు బాబ్జీచావుకు నువ్వేకారణమని మంత్రిని నిలదీసింది నిజమా..కాదా?
• 2014 ఎన్నికల ప్రచార సమయంలో వంకావిజయ్ మంత్రి కోసం ఖర్చుపెట్టిన డబ్బంతా తిరిగిస్తానని మంత్రి ఒప్పుకున్నది నిజమా..కాదా?
• 2015లో వంకా విజయ్ ఎందుకు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.. ఆ ఘటన ప్రమాదవశాత్తూజరిగిందని రైల్వేపోలీసులను మభ్యపెట్టింది కొడాలినానీయేనా?
• వంకావిజయ్ మరణించినప్పుడు అతని జేబు లోని సూసైడ్ నోట్ ఏమైంది..? ఆనోట్ తాలూకా రెండోకాపీ అతనిబావ అడపాబాబ్జీకి చేరిందినిజంకాదా?
– దానిగురించి మంత్రికి తెలిసి.. విజయ్ సూసైడ్ నోట్ బయటపెట్టవద్దని, అతను తనకోసం ఖర్చుపెట్టిన డబ్బంతా తిరిగిస్తానని… పార్టీలో కీలక స్థానం కట్టబెడతారని బాబ్జీకి మంత్రి హామీఇచ్చింది నిజమా…కాదా?
• తరవాత బాబ్జీని కూడా పట్టించుకోకుండా..మంత్రి అతనికి ముఖంచాటేయబట్టే… అతను తీవ్రఒత్తిడికిలోనై గుండెపోటుకి గురై చనిపోయింది నిజంకాదా?
• నిన్న టీవీ 5 న్యూస్ ఛానల్లో వచ్చిన కథనంలోని వాస్తవమెంత….దానిపై వ్యవస్థలు ఎందుకు విచారణ జరపడంలేదు? గుడివాడప్రజలు వంకా విజయ్.. అడపా బాబ్జీ మరణాలకు ఎవరు కారణమని చెప్పుకుంటున్నారు?
• ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంచెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి, డీజీపీకిఉందా..లేదా?
• గుడివాడ నియోజకవర్గంలో వేళ్లూనుకున్న మంత్రి ఆగడాలపై, ఆయన అధికారదర్పానికి,నోటికి భయపడి బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న మంత్రిబాధితుల గోడుపై సమగగ్రమైన దర్యాప్తుజరిపించాలని డీజీపీకి లేఖరాస్తున్నా
– టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య
కృష్ణాజిల్లాలోని గుడివాడ నియోజకవర్గానికి చట్టాలు వర్తించవా అని, ఆనియోజకవర్గంలో తప్పొప్పులు నిర్ణయించేదిఎవరని, అసలుకొన్నివ్యవస్థలు సదరు నియోజకవర్గంలో పనిచేస్తున్నాయా లేదో..ముఖ్యమంత్రిగానీ, రాష్ట్రస్థాయి అధికారగణమో సమాధానం చెప్పాలని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యు లు వర్ల రామయ్య డిమాండ్ చేశారు.ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలుక్లుప్తంగా ఆయనమాటల్లో ….
గుడివాడినియోజకవర్గం ఏమైనా మంత్రి కొడాలినానీ సొంతజాగీరా ? గుడివాడనియోజకవర్గానికి రాష్ట్రంలో, దేశంలో ఏమైనా ప్రత్యేక ప్రతిపత్తిఉందా? కొడాలినానీ చెప్పిందే ఆ నియోజకవర్గంలో వేదమా..అక్కడేమీ పోలీస్, రెవెన్యూ, ఇతరశాఖలు ఏమీలేవా?
నిన్నటికి నిన్న ఒకన్యూస్ ఛానల్లో ఒక కథనంప్రసారమైంది. అడపాబాబ్జీ అనే వ్యక్తి కొడాలినానీకి ముఖ్యమైన అనుచరుడు. అతను చనిపోతే చాలావేళ్లు మంత్రివైపే చూపించాయి. అతని మరణానికి మంత్రే కారణమని చాలా మంది అభిప్రాయపడ్డారు. అడపా బాబ్జీ శవయాత్రజరుగుతుండగా, మంత్రివెళ్లి మృతదేహాన్ని చూసి వస్తుండగా, ఒకయువకుడు మంత్రిపైదాడిచేసినంత పనిచేశాడు. నీవల్లే అడపాబాబ్జీ చనిపోయాడని సదరుయువకుడు మంత్రిని నిలదీస్తూ, నానీచొక్కాపట్టుకున్నాడంటున్నారు.
సదరుఘటనపై ప్రభుత్వం విచారించదా? ప్రభుత్వానికి, వ్యవస్థలకు ఆబాధ్యత లేదా? అడపాబాబ్జీ గుండెపోటుతోచనిపోయాడంటున్నారు. ఎవరి ఇబ్బందులు..ఎవరిఒత్తిడివల్ల బాబ్జీకి గుండెపోటు వచ్చిందని అతని కుటుంబసభ్యులను ఆరాతీశారా? న్యూస్ ఛానల్లో వచ్చిన కథనాన్నిబట్టి, గుడివాడప్రజలు అనుకునేదాన్నిబట్టి, అడపాబా బ్జీ బావమరిదైన వంకావిజయ్ గతంలో మంత్రిగారి తరుపున 2014ఎన్నికల్లో విపరీతంగాఖర్చుపెట్టి, ఎన్నికలప్రచారం చేశాడు. ఆసమయంలో తాను గెలిచాక విజయ్ తనకోసంపెట్టిన ఖర్చంతా తిరిగిచెల్లిస్తానని మంత్రిగారుచెప్పారు.
ఈమాట నేను అనడంలేదు.. గుడివాడప్రజలంతా అనుకుంటున్నారు. దానికి సాక్ష్యాలేమున్నాయో..అది నిజమోకాదో… విచారించాల్సిన బాధ్యత అధికారులదేకదా! ఏరుదాటేవరకు ఓడమల్లయ్య..ఏరు దాటాక బోడిమల్లయ్య అదేకదా.. మంత్రికొడాలినానీవ్యవహార శైలి. ఆయననోటికి, బూతులకుభయపడి వ్యవస్థలు అన్నీకిమ్మనకుం డా ఉండటంభావ్యమా?
అడపా బాబ్జీ బావమరిదైన వంకావిజయ్ 2015లో రైలుకిందపడి ఆత్మహత్యచేసుకున్నాడంటున్నారు. ఆ ఘటనను నాటిరైల్వేపోలీసులు ప్రమాదవశాత్తూమరణించారని చెప్పాడు. ఆనాడుమరణించిన విజయ్ జేబులో సూసైడ్ నోట్ ఉందని, అదిచేరాల్సినవారికిచేరలేదని, దానికి సంబంధించిన మరోకాపీ మాత్రం అడపాబాబ్జీకి చేరిందని గుడివాడ గగ్గోలుపెడు తోంది. వంకావిజయ్ సూసైడ్ నోట్ మాయమైతే, అతనిమరణాన్ని ప్రమాదవశాత్తూజరిగిన మరణంగా చిత్రీకరించడానికి స్వయంగా మంత్రిగారే రంగంలోకి దిగారంటున్నారు.
పోలీసులు కూడా ఆ సూసైడ్ నోట్ గురించి ఎక్కడాప్రస్తావించలేదు. ఈ విషయాలన్నీ అడపాబాబ్జీతోపాటు, మంత్రిగారికి తెలుసు.
ఇదంతాజరిగినకొన్నాళ్లకు అడపాబాబ్జీని మంత్రిగారుపిలిపించి, విజయ్ రాసిన సూసైడ్ నోట్ వివరాలు బయటపెట్టవద్దని, విజయ్ తాలూకాబాకీమొత్తాన్ని తీరుస్తానని మరలా బాబ్జీతో నమ్మబలికా డు. కానీ మంత్రిగారు తనప్రామిస్ ను నిలబెట్టుకోలేదు. బాబ్జీకి ఎంతోప్రాధాన్యతఇస్తానని.. అప్పులన్నీతీరుస్తాననిచెప్పిన మంత్రి గారు అవేవీచేయలేదు. దాంతో బాబ్జీపరిస్థితి హృదయవిదారకంగా తయారైంది. దాంతో అతనుమనస్తాపానికిగురై భరించలేని ఒత్తిడి తోనే గుండెపోటుకి గురయ్యాడంటున్నారు.
ఈ మంత్రి అవలంభిస్తున్న దౌర్జన్యపూరిత రాజకీయాలవల్ల… ఈ మంత్రి యూజ్ అండ్ త్రో విధానంవల్ల, ఈ మంత్రి అస్తవ్యస్త విధానాలవల్ల ఎన్నోకుటుంబాలురోడ్డునపడ్డాయి..పడుతున్నాయి. ఇప్పటికీ అనేకమంది వారిబాధను బయటకుచెప్పుకోవడానికి భయపడుతున్నారు.అడపాబాబ్జీ ఉదంతంపై తాను విచారణచేస్తే, అసలుజరిగిన విష యమేంటో తెలిసింది. అందుకే ఈ మొత్తం వ్యవహారంపై రేపు డీజీపీకి లేఖరాయాలని నిర్ణయించుకున్నాను.
అడపా బాబ్జీ బావమరిది వంకా విజయ్ మృతిపై సమగ్రమైన దర్యాప్తుజరిపించాలని…. అతనికుటుంబసభ్యులను, సన్నిహితు లను విచారించి వాస్తవాలు వెల్లడించాలనికోరబోతున్నాను. విజయ్ మృతిని ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా చిత్రకరించిం దిఎవరు…దానివెనకాల మంత్రిగారి ప్రమేయముందా అనేదానిపై కూడా ఆరాతీయాలని డీజీపీని కోరబోతున్నాం. అలానే బాబ్జీ శవ యాత్రలో మంత్రిపై యువకుడు దాడిచేయడానికి కారణమేంటి.. బాబ్జీకి ఎందుకుగుండెపోటు వచ్చింది.. గుండెపోటుతో అతను చని పోయేంతలా అతన్నిఒత్తిడికి గురిచేసిందిఎవరనేదానిపైకూడా సమగ్రమైన దర్యాప్తుజరిపించాలని డీజీపీని కోరాలని నిర్ణయించుకున్నాం.
ఈ మంత్రి ఆగడాలను కట్టడిచేయకుంటే…ఇలాంటి దారుణాలు నిత్యం జరగుతూనేఉంటాయి. అడపాబాబ్జీ, వంకావిజయ్ లాంటి వారుఎందరు చనిపోవాలని ప్రశ్నిస్తున్నా. మంత్రినోటికి, అతని బూతులకు భయపడాలా.? తగ్గేదేలే.. బూతులమంత్రి.. నీ వేంటో.. నీ ఆగడాలేంటో గుడివాడలో ఏఇంటి తలుపుకొట్టినా చెబుతారు బూతులమంత్రి.
తెలుగుదేశంపార్టీ తరుపున డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని విజ్ఞప్తి చేస్తున్నాం. మంత్రిఆగడాలపై..అతని వ్యవహారశైలిపై సమగ్రమైన దర్యాప్తుజరిపించి, ఇంకెందరు బాబ్జీలు.. విజయ్ లు మంత్రి కబం ధహస్తాల్లో చిక్కుకొని నలిగిపోతున్నారో కనిపెట్టాలని కోరుతున్నాం.గతంలో మంత్రి నిర్వహించిన కేసినోపై నూజీవీడుడీఎస్పీతో విచార ణకు ఆదేశించారు. కానీ ఆ వ్యవహారం ఏమైందో.. పోలీస్ శాఖ నివేదిక ఏమైందో ఇంతవరకుతెలియదు. మంత్రిగారి కేసినోఆడించిన విధానాన్నిబట్టి,ఎందరో ఆడబిడ్డల పుస్తెలు తెగిపోయాయి. కాబట్టి, పోలీస్ వారు కేసినో వ్యవహారాని కి సంబంధించిన నివేదికను బయటపెట్టాలి.
ముఖ్యమంత్రికూడా ఈ బూతులమంత్రి అవసరం తనకుందని అతన్ని వెనకేసుకొస్తున్నాడా? వంకావిజయ్… అడపాబాబ్జీల మరణాలపై కూలంకషమైన దర్యాప్తుజరిపించి, అసలు వాస్తవాలు నిగ్గుతేల్చాలని డీజీపీకి లేఖరాయబోతున్నాం. వంకావిజయ్.. సూసైడ్ నోట్ లో ఏముంది.. రైల్వే పోలీసులు దాన్నిఎందుకు బయటపెట్టలేదు? రాష్ట్రపోలీసులు సూసైడ్ నోట్ లోని అంశాల పరంగాఎందుకు దర్యాప్తుచేయలేదు? మంత్రిగారిపై ఎంతకోపముం టే యువకుడు ఆయన కాలర్ పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు?
ఆ ఘటనజరిగిననాడే పోలీసులు వెంటనేస్పందించి..అసలేం జరి గిందనే దిశగా దర్యాప్తుప్రారంభించిఉండాల్సింది. ఒకక్లూ లభిస్తే, దాన్నిపట్టుకొని వ్యవహారం మొత్తంబయటకు లాగాల్సింది పోలీసులే.. అన్నిఆధారాలుసేకరించి.. వివరాలన్నీ అప్పగించాక వారేం చేస్తారు?