Suryaa.co.in

Andhra Pradesh

‘‘గోదారమ్మ’’ చంద్రబాబును చల్లగా చూడమ్మ

– ఆయన ఆరోగ్యం కోసం గోదావరి జలాలతో అభిషేకం
– మొక్కు తీర్చుకున్న తెలుగు మహిళలు
– 2024లో అధికారం టీడీపీదే : ఆదిరెడ్డి శ్రీనివాస్‌

రాజమహేంద్రవరం : గోదావరి మాత మా అధినేత చంద్రబాబు నాయుడి సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండేలా చూడమ్మా, ఆయన త్వరలో ప్రజల మధ్యకు వచ్చి రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చేలా దీవించమ్మా, 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేలా చూడాలని వేడుకుంటూ తెలుగు మహిళలు గోదావరి మాతను వేడుకున్నారు.

ప్రభుత్వ కుట్రలో భాగంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు నేపధ్యంలో 52 రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో ఆయన త్వరగా బయటకు వచ్చేలా చూడాలని, ఆయన బయటకు వచ్చిన వెంటనే గోదావరి మాతను దర్శనం చేసుకుని 108 బిందెల గోదావరి జలంతో అభిషేకం చేస్తామని తెలుగు మహిళలు గోదావరి మాతకు మొక్కుకున్నారు. ఆ మొక్కు ప్రకారం తెలుగు మహిళ రాజమండ్రి పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, టీడీపీ నగర అండన్‌వాడీ కమిటీ అధ్యక్షురాలు బోను ఈశ్వరిల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం తెలుగు మహిళలు చేరుకుని 108 బిందెలతో గోదావరి జలాభిషేకం నిర్వహించి గోదావరికి హారతి ఇచ్చారు.

ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ముఖ్య అతిధిగా, రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌ కుమార్‌, రాజమండ్రి పార్లమెంట్‌ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా తదితరులు హాజరై పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆరోగ్యం, ఆయనకు రెగ్యులర్‌ బెయిల్‌ రావడం పట్ల తెలుగు మహిళలు ఆనందంగా ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ నెల 29వ తేదీ నుంచి చంద్రబాబు నాయుడు ప్రజా క్షేత్రంలోకి వచ్చేందుకు హై కోర్టు ఇచ్చిన రెగ్యూలర్‌ బెయిల్‌లో అవకాశం కల్పించిందన్నారు. చంద్రబాబు నాయుడు ఇక బయటకే రారు అని వాధించిన వైకాపా నాయకులు ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

ఆధారాల్లేని పసలేని కేసులు పెట్టి ఇబ్బందిపెట్టాలని చూశారని, చివరకు న్యాయమే గెలిచిందన్నారు. హై కోర్టు వైకాపా వారికి అక్షింతలు వేసిందని విమర్శించారు. అన్నింటిలో అవినీతికి పాల్పడుతున్న అధికార పార్టీ వారు వారి మచ్చను ఇతరులకు అంటించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయాలన్నీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ప్రస్తుతం తాము నిర్వహిస్తున్న భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం ద్వారా జరిగిన, జరుగుతున్న పరిణామాలను ప్రజలకు తాము వివరిస్తున్నామన్నారు.

రాజమండ్రి పార్లమెంట్‌ మహిళ కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి మాట్లాడుతూ తెలుగు మహిళలు అమ్మ వారికి వేడుకున్న మొక్కును ఈ రోజు తీర్చుకోవడం జరిగిందన్నారు. 52 రోజుల అనంతరం చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారని, జగన్‌ ప్రభుత్వం అక్రమంగా బనాయించిన కేసుల నుంచి ఆయన కడిగిన ముత్యంలా బయటపడతారన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి అని అన్నారు. 2024లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. చంద్రబాబు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారన్నారు.

అంగన్‌ వాడీ నగర కమిటీ అధ్యక్షురాలు బోను ఈశ్వరి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడి అరెస్టు అక్రమమైందని అన్ని వర్గాల వారు ఖండిరచారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటే అది చంద్రబాబు చలవేనన్నారు. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసే వరకూ తాము కృషి చేస్తామన్నారు. నగర తెలుగు మహిళ కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అందరికీ కావాల్సిన వ్యక్తన్నారు. అటువంటి వ్యక్తిని జగన్‌ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి ఇబ్బందులు పెట్టిందన్నారు. ఆయన ఎటువంటి వ్యక్తో, ఆయన మేథస్సు ఏమిటో అందరికీ తెలుసన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తురకల నిర్మల, రాజమండ్రి పార్లమెంట్‌ మహిళ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి మీసాల నాగమణి, అంగన్‌ వాడీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి కప్పల వెలుగు కుమారి, తెలుగు మహిళలు కానేటి కృపామణి, దొంగ నాగమణి, కర్ణం లక్ష్మీ నాయుడు, సింహా నాగమణి, సావిత్రి, దంగేటి అన్నవరం, మోతా నాగలక్ష్మి, బూరా కల్పన, అహ్మదున్నీషా భేగం, కె శ్యామల, పాడి లలిత, మేరీ, అస్సరీ, మాధవి, విజయలక్ష్మి, గంగా, మంజుల, లక్ష్మి, పితాని కుటుంబరావు, కవులూరి వెంకటరావు, ఫయాజ్‌, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE