– వైఎస్‌ఆర్‌టీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిని సస్పెండ్ చేసిన డీఈవో
చిత్తూరు : కొత్త పీఆర్సీతో ఉపాధ్యాయులకు నష్టం జరుగుతోందని నిరసిస్తూ… 48 గంటలపాటు నీళ్లు మాత్రమే తీసుకొని, పాఠాలు బోధించిన చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం బాలినాయనిపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు, వైఎస్‌ఆర్‌టీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డిని డీఈవో శేఖర్ మంగళవారం సస్పెండ్ చేశారు.
ఆయన సోమవారం దీక్ష ప్రారంభించగా మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది. ఈ విషయమై నివేదిక ఇవ్వాలంటూ మంగళవారం ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు.డీఈవో సూచనతో ఎంఈవో… విష్ణువర్ధన్‌రెడ్డి వివరణ తీసుకున్నారు.ఉపాధ్యాయులందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే దీక్షకు దిగానని.. యథావిధిగా పాఠాలు చెప్పానని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది.ఎంఈవో నుంచి నివేదిక అందిన తర్వాత ఆగమేఘాలపై విష్ణువర్ధన్‌రెడ్డిని సస్పెండ్ చేశారు. వైకాపాకు అనుబంధంగా ఉన్న వైఎస్‌ఆర్‌టీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిని సస్పెండ్ చేయడం చిత్తూరు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
విధులకు హాజరవుతూనే…పాఠాలు బోధిస్తూ శాంతియుతంగా దీక్ష చేపట్టిన ఉపాధ్యాయుణ్ని సస్పెండ్ చేయడం ఎంతవరకు సబబని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.