– రాహుల్ గాంధీ ఆనాడు హామీలు ఇచ్చి ఇపుడు ఇటు వైపు రావడం లేదు
– చప్పట్ల కోసం రేవంత్ రెడ్డి రైమింగ్ కోసం పాలన
– ఢిల్లీ కే మూటలు చేరుతున్నపుడు రాహుల్ గాంధీ తెలంగాణ ఎందుకు వస్తారు?
– కాంగ్రెస్ నేతలకు అంత ఉక్రోశం ఉంటే జాబ్ కేలండర్ ను విడుదల చేయించండి
– బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి
హైదరాబాద్: యువతను రకరకాల హామీలతో మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఇచ్చిన హామీల గురించి నిరు ద్యోగులు రోడ్లపైకి వస్తే పోలీసులతో లాఠీ చార్జీలు చేపిస్తారా ?బూతులు ప్రయోగిస్తారా ?
అన్యాయం ఎదిరించినవాడే నాకు ఆరాధ్యదైవం అని నాడు కాళోజి అన్నారు. కాళోజి స్పూర్తితో తిరగబడుతున్న నేల ఇది. పోలీస్ ఉన్నతాధికారిగా ఉన్న వ్యక్తి నిరుద్యోగుల పై అంత నీచంగా మాట్లాడుతారా? ఆ పోలీసు ఉన్నతాధికారి పై తక్షణమే చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం తరపున వెంటనే నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి.
అర్ధరాత్రి పూట మహిళలను అరెస్టు చేసే సాంప్రదాయం సమైక్య పాలనలోనూ లేదు. ఒక్క దిల్ సుఖ్ నగర్ లోనే 2 లక్షల మంది యువత పోలీస్ కానిస్టేబుళ్ల ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండేళ్ల వయసు యువతది వృధా అయ్యింది. సంక్రాంతికి తమ సొంత ఊళ్లకు వెళ్లలేని పరిస్థితి నిరుద్యోగ యువత ది.
నోటిఫికేషన్లు రాక నెలల తరబడి డబ్బులు ఖర్చు పెడుతున్న యువత ఆర్థికంగా చిక్కిపోతున్నారు. రేవంత్ రెడ్డి చప్పట్ల కోసం రైమింగ్ కోసం పాలన చేస్తున్నారు. తప్ప ఇచ్చిన హామీల అమలు పై దృష్టి పెడుతున్నారు. ఇచ్చిన హామీల పై ఏనాడైనా రేవంత్ రెడ్డి సమీక్షించుకున్నారా ?
రాహుల్ గాంధీ ఆనాడు హామీలు ఇచ్చి ఇపుడు ఇటు వైపు రావడం లేదు. తెలంగాణ కాంగ్రెస్ పెద్దలకు ఏ టీ ఎం అయ్యింది. ఢిల్లీ కే మూటలు చేరుతున్నపుడు రాహుల్ గాంధీ తెలంగాణ ఎందుకు వస్తారు ? రాహుల్ గాంధీ ఇచ్చిన హామీల పై మొహం చాటేయడం తో కే టీ ఆర్ కు కడుపు రగిలి మాట్లాడారు.
రాహుల్ ను ఒక్క మాట అన్నందుకే కాంగ్రెస్ నేతలు నోరు పారేసుకుంటున్నారు. మోసం చేసిన వారిని అలా అనకుంటే ఎలా అంటారు? యువత గురించి కాంగ్రెస్ కు పట్టదా? కాంగ్రెస్ నేతలకు అంత ఉక్రోశం ఉంటే జాబ్ కేలండర్ ను విడుదల చేయించండి.
రేవంత్ భాషను అందరూ ఏవగించుకుంటున్నారు. వరంగల్ లో కాంగ్రెస్ శాసన సభ్యుడు తన స్థాయిని మరచి కే టీ ఆర్ పై దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యం లో ఎవరిని నాయకులు బహిష్కరించలేరు .తప్పు చేస్తే ప్రజలే బహిష్కరిస్తారు. శాసన సభ ను చేత గాని సభగా పాలక పక్షం మార్చింది. విధాన సభను విద్వంస సభ గా మార్చారు.
ప్రభుత్వానికి భజన చేసేందుకు పాలక పక్షం ఎలాగూ ఉంది .ప్రతిపక్ష సభ్యులు కూడా భజన చేయాలా ? ముఖ్యమంత్రి ని విమర్శిస్తే మైక్ ఇవ్వనని స్పీకర్ ఎలా అంటారు ? నిరుద్యోగుల సమస్యలు అసెంబ్లీ లో ప్రస్తావన కు రాకపోవడానికి పాలక పక్షమే కారణం.
మున్సిపల్ ఎన్నికల లోపే ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ ఇవ్వాలి. రాహుల్ గాంధీ కే టీ ఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. రాహుల్ నిరుద్యోగుల డిమాండ్ల పై స్పందించాలి. నిరుద్యోగుల డిమాండ్ల పై బీ ఆర్ ఎస్ పోరాడుతూనే ఉంటుంది. కాంగ్రెస్ నేతలు బూతులు ఆపి నిరుద్యోగులకిచ్చిన హామీల అమలు కోసం కృషి చేయాలి.
కంచెలు తొలగించాం అంటే కుదరదు .నిరుద్యోగుల ఆందోళనల పై ఉక్కు పాదం మోపడం తక్షణమే ఆపాలి. ప్రజా పాలన అంటే నిరుద్యోగులపై లాఠీలు ప్రయోగించడం కాదు అని కాంగ్రెస్ నేతలు గ్రహించాలి. సీఎం రేవంత్ రెడ్డి రైజింగ్ 2047 గురించి మాట్లాడటం కాదు .ముందు నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలి .