Suryaa.co.in

Telangana

అంగరంగ వైభవంగా తెలంగాణ శతాబ్ది వేడులు

-9 నుండి 2 వ విడత గొర్రెల పంపిణీ
-ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు జూన్ 2 వ తేదీ నుండి 22 వ తేదీ వరకు 21 రోజుల పాటు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.

గురువారం డాక్టర్ BR అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్బంగా దశాబ్ది ఉత్సవాల నిర్వహణ, ఈ నెల 9 వ తేదీ నుండి ప్రారంభించనున్న 2 వ విడత గొర్రెల పంపిణీ, 8,9,10 తేదీలలో నిర్వహించే ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమావేశంలో విజయ డెయిరీ చైర్మన్ సోమా భరత్ కుమార్, గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, మత్స్య సహకార సంఘాల చైర్మన్ పిట్టల రవీందర్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధార్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, TSLDA CEO మంజువాణి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. చేపట్టిన కార్యక్రమాలు, లబ్దిదారులకు జరిగిన మేలు గురించి కరపత్రాల ద్వారా వివరించాలని సూచించారు.

రాష్ట్రంలో సబ్సిడీ గొర్రెల యూనిట్లు పొందిన గొర్రెల పెంపకం దారులు, ప్రభుత్వం సబ్సిడీ పై అందజేసిన వాహనాలు, ఉచిత చేప పిల్లల ద్వారా లబ్దిదారులు అత్యధికంగా ఉన్నారని, దశాబ్ది ఉత్సవాల లో పశుసంవర్ధక, మత్స్య శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలలో భాగస్వాములను చేయాలని చెప్పారు. ఉత్సవాల నిర్వహణకు సంబంధించి కార్యక్రమాల పై సమగ్ర కార్యాచరణ ను రూపొందించి జిల్లా, మండల అధికారులకు పంపింఛి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ 3 వ తేదీన తెలంగాణ రైతు దినోత్సవం సందర్బంగా గ్రామాల్లోని రైతు వేదికల వద్ద నిర్వహించే కార్యక్రమాలలో పాడి రైతులు, మత్స్యకారులు పాల్గొనే విధంగా డెయిరీ అధికారులు, మత్స్య శాఖ అధికారులు, పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. 8 వ తేదీన చెరువుల పండుగ సందర్బంగా ప్రధాన చెరువులు, రిజర్వాయర్ ల వద్ద వేదికలను ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాల ను నిర్వహించాలని చెప్పారు.

ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీ ఇతర పథకాలపై ప్లేక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న పరిస్థితులు, తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు, ఫోటో ప్రదర్శనలు నిర్వహించాలని చెప్పారు. అదేవిధంగా అన్ని మత్స్య శాఖ కార్యాలయాలకు విద్యుత్ దీపాలంకరణ చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా అన్ని పశువైద్య శాలల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

మేలు జాతి దూడల సంపద అభివృద్ధి కోసం కృత్రిమ గర్భధారణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. 21 లక్షల కృత్రిమ గర్భధారణ లతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని వివరించారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన నాణ్యమైన దూడల ప్రదర్శన నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.

గోపాలమిత్రలు కూడా ఈ ఉత్సవాలలో పాల్గొనేలా చూడాలని అన్నారు. ఇవే కాకుండా 21 రోజులపాటు ప్రతిరోజూ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలలో కూడా భాగస్వాములు కావాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

9 నుండి 2 వ విడత గొర్రెల పంపిణీ
2 వ విడత గొర్రెల పంపిణీ ని మొదటగా ఈ నెల 5 వ తేదీన ప్రారంభించాలని నిర్ణయించడం జరిగిందని, అనివార్య కారణాల వలన 9 వ తేదీన ప్రారంభించనున్నట్లు మంత్రి చెప్పారు. 9 వ తేదీన నల్లగొండ జిల్లా నకిరేకల్ లో మంత్రి శ్రీనివాస్ యాదవ్ గొర్రెల పంపిణీ ని ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు.

లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు నూతనంగా ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేసి తీసుకొచ్చే గొర్రెల కు అవసరమైన మందులు, దాణా, ఇన్సురెన్స్ ట్యాగ్ లు అందుబాటులో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా 8,9,10 తేదీలలో మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో నిర్వహించే ఫిష్ పుడ్ ఫెస్టివల్ 8 వ తేదీన మంత్రి శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ లోని NTR స్టేడియంలో ప్రారంభిస్తారు.

ఫిష్ పుడ్ ఫెస్టివల్ కు అన్ని ఏర్పాట్లు చేసే విధంగా అన్ని జిల్లాల అధికారులను ఆదేశించాలని చెప్పారు. ఫిష్ పుడ్ ఫెస్టివల్ నిర్వహించే ప్రాంతాలలో విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయ స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

LEAVE A RESPONSE