Suryaa.co.in

National Telangana

ఢిల్లీ లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

-మధ్యప్రదేశ్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
-మహాకాల్‌ ఉజ్జయినిలో గవర్నర్‌ అధ్యక్షతన నిర్వహణ
-ఎంపీ రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీ నరహరి ట్వీట్‌
-వేడుకల నిర్వహణకు అధికారుల నియామకం
-2న కోర్టుల్లో జాతీయ పతాకావిష్కరణ

హైదరాబాద్ : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. సచివాలయంలో జూన్‌ 2న ఉదయం 10.30 గంటలకు జాతీయ పతాకాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించి ఉత్సవాలు ప్రారంభించనున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. సచివాలయంలో జూన్‌ 2న ఉదయం 10.30 గంటలకు జాతీయ పతాకాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించి ఉత్సవాలు ప్రారంభించనున్నారు. వేడుకల ఏర్పాట్ల కోసం శాఖలవారీగా 13,398 మంది అధికారులను నియమించారు. అన్ని శాఖల నుంచి 7,250 మంది అధికారులను వేడుకలకు ఆహ్వానించటంతోపాటు, వారికోసం 151 బస్సులను ఏర్పాటు చేశారు. సమన్వయం కోసం నోడల్‌ అధికారులను కూడా ప్రభుత్వం నియమించింది.

ఎంపీలో ఎగురనున్న తెలంగాణ జెండా
మధ్యప్రదేశ్‌లో మన తెలంగాణ జెండా సగౌరవంగా ఎగురనున్నది దశాబ్ది వేడుకలను మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పరికిపండ్ల నరహరి పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌ వాసి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. మహాకాల్‌ ఉజ్జయిని నగరంలో జూన్‌ 2న ఆ రాష్ట్ర గవర్నర్‌ మంగుబాయి పటేల్‌ అధ్యక్షతన వేడుకలు జరుగనున్నట్టు తెలిపారు.

ముఖ్య అతిథిగా ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ మోహన్‌యాదవ్‌ పాల్గొననున్నారని, కార్యక్రమానికి తనను కూడా ప్రభుత్వం ఆహ్వానించిందని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించటం, అందులో తాను పాల్గొనటం.. తెలంగాణ బిడ్డగా చాలా గర్వంగా ఉన్నదని తెలిపారు. ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్న మధ్యప్రదేశ్‌ ప్రభుత్వానికి నరహరి ధన్యవాదాలు తెలిపారు. పండుగలా సాగే ఈ వేడుకల్లో తెలంగాణవాసులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ రాజధాని ఢిల్లీలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు యంత్రాంగం సిద్ధమైంది. ఢిల్లీలోని తెలంగాణ భవనంలోఅంబేద్కర్‌ ఆడిటోరియం వేదికగా ఉత్సవాలు జరుగనున్నాయి. 2న ఉదయం 9 గంటలకు జెండా ఆవిష్కరణతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.

అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించటం, ఫొటో ఎగ్జిబిషన్‌, హెల్త్‌చెకప్‌ క్యాంపులు, సాంస్కృతిక కార్యక్రమాలను ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ ఆలయాలపై నృత్యప్రదర్శన, గిరిజన నృత్యం-కొమ్మకోయా వంటివి ప్రదర్శించనున్నారు. మాజీ ఎంపీ మందా జగన్నాథం, రిటైర్డ్‌ ఐఏఎస్‌ కేఎం సాహ్ని, తెలంగాణ రెసిడెంట్‌ కమిషనర్‌ డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. దశాబ్ది ఉత్సవాల కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ను ప్రత్యేకంగా ముస్తాబు చేస్తున్నారు.

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్‌ 2న రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల ప్రాంగణాల్లో ఉదయం 9.30 గంటలకు జాతీయ జెండాఎగురవేయనున్నారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ కే సుజన గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

LEAVE A RESPONSE