Suryaa.co.in

International Telangana

అమెరికా అందాల పోటీల్లో తెలంగాణ అమ్మాయి..

హైదరాబాద్: అమెరికాలో ప్రవాస భారతీయుల హవా అన్ని రంగాల్లో కనబరుస్తున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రానికి చెందిన ప్రవాస భారతీయురాలు బావండ్ల రిషితకు మిస్ ఫిలాంత్రఫీ యూనివర్స్ 2024-2025 అవార్డు లభించింది.ఈ నెల 11న వాషింగ్టన్ లో జరిగిన అందాల పోటీలో పాల్గొని, నిన్న గురువారం అవార్డు అందుకున్నట్లు ఆమె తండ్రి మాణిక్యం తెలిపారు. బావండ్ల రామ లచ్చయ్య, సత్యమ్మ దంపతుల మూడో కుమారుడే బావండ్ల మాణిక్యం. 14 సంవత్సరాల క్రితం అమెరికాకి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.

LEAVE A RESPONSE