Suryaa.co.in

Telangana

తెలంగాణ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే.. కానీ చేతల ప్రభుత్వం కాదు

రైతాంగానికి గతంలో అనేక సబ్సిడీలు వచ్చేవి
ఒక్క రైతు బంధు ఇస్తూ.. మిగిలిన అన్నీ దోచేస్తున్నడు
బీజేపీ ఎలక్షన్ కమిటీ చైర్మన్ఈటల రాజేందర్

అబ్ కీ బార్ కిసాన్ సర్కారు కేసీఆర్ మాట. నాలుగున్నర సంవత్సరాలుగా.. రైతులకు ఇచ్చిన భరోసాను పూర్తిచేయలేదు. ఇవాళ ఎన్నికలు ఉన్నయని రైతులను మోసం చేసేందుకు కొత్త మాటలు చెబుతున్నడు. రైతాంగానికి గతంలో అనేక సబ్సిడీలు వచ్చేవి.. ఇవాళ అవన్నీ ఎత్తేసి.. ఒక్క రైతు బంధు ఇస్తూ.. మిగిలిన అన్నీ దోచేస్తున్నడు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తరుగులేకుండా ధాన్యం కొంటం.రైతుల హక్కుగా అందాల్సిన అన్ని సబ్సిడీలు అందిస్తం. మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి రాగానే పేదలకు ఇండ్లకోసం జాగాలిస్తం. తెలంగాణ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే.. కానీ చేతల ప్రభుత్వం కాదు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నరు. వారందరూ ముక్తకంఠంతో అంటున్నరు.. అన్నా కేసీఆర్ ను పంపించి.. మోదీ కి పట్టం గడితేనే మా జీవితాలు బాగుపడతయ్ అంటున్నరు.

LEAVE A RESPONSE