Suryaa.co.in

Andhra Pradesh Telangana

సుజనా చౌదరికి హైకోర్టులో ఊరట

ఈ నెల 30 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు అమెరికా, యూరప్ దేశాల్లో పర్యటనకు మాజీ ఎంపీ సుజనా చౌదరికి తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ మేరకు నిన్న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బెస్ట్ క్రాంప్టన్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ. 6 వేల కోట్ల వరకు మోసం చేసిన కేసులో సుజనా చౌదరి పాత్ర ఉందంటూ సీబీఐ లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. దీంతో ఆయన విదేశాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది.

ఈ నేపథ్యంలో తాను విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సుజానా చౌదరి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై నిన్న హైకోర్టులో వాదనలు జరిగాయి. జస్టిస్ జి.రాధారాణి విచారణ చేపట్టగా, పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది కె.వివేక్ రెడ్డి, న్యాయవాది విమల్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం సుజనా చౌదరి విదేశీ పర్యటనకు అనుమతినిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

LEAVE A RESPONSE