– కేసీఆర్ పదేళ్ల పాలన ఫలితమే ఈ విజయం
– పదేళ్లలో తెలంగాణ వరి ఉత్పత్తిలో సాధించిన ప్రగతిపై కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమశాఖ విడుదల చేసిన గణాంకాలపై హర్షం వ్యక్తం చేసిన వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: తాజాగా కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ 2014 – 15 నుండి 2024 – 25 కు సంబంధించి విడుదల చేసిన నివేదికనే దానికి సాక్ష్యం. సాగునీరు, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరంటు, అందుబాటులో ఎరువులు, విత్తనాలు, వంద శాతం పంటల కొనుగోళ్ల మూలంగా ఈ అద్భుత విజయం సాధ్యం అయింది.
పంటల ఉత్పత్తులకు అవసరమైన గోదాంలతో పాటు, విద్యుత్ రంగాన్ని పునర్ వ్యవస్థీకరణ చేయడం దీనికి మరో కారణం. దేశంలోనే అత్యధికంగా 240 శాతం వృద్ధి రేటుకు కారణం పదేళ్ల కేసీఆర్ చేపట్టిన వ్యవసాయ, రైతు అనుకూల విధానాలే తెలంగాణ తర్వాత మధ్యప్రదేశ్ 80 శాతం, యూపీ 25 శాతం, తమిళనాడు 20, పంజాబ్ 12 శాతం మాత్రమే వృద్ధి సాధించాయి.
పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ 13 శాతం, మణిపూర్ 25 శాతం, అస్సాం 12 శాతం, కర్ణాటక 11, ఒడిశా 8 శాతం పతనం చెందడం గమనార్హం. కేసీఆర్ ప్రభుత్వ విధానాలను దేశం అనుసరించాలి. రైతులకు, వ్యవసాయ రంగానికి చేయూతనివ్వాలి.