* కేసీఆర్ ముందుచూపుతో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా
* దశాబ్ద కాలంలో రెట్టింపైనా విద్యుత్ ఉత్పత్తి
* విద్యుత్ సంస్కరణల వల్ల విపక్షాల కళ్లు బైర్లుకమ్ముతున్నాయి
* తెలంగాణ పుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్
దశాబ్ధ కాలంలో ఎన్నో విద్యుత్ సంస్కరణలను తెలంగాణ సర్కార్ తీసుకువచ్చినట్లు తెలంగాణ పుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తెలిపారు. కేసీఆర్ ముందుచూపు, విద్యుత్ సంస్థ ఉద్యోగుల సహకారంతోనే ఇది సాధ్యమయిందని వివరించారు. నేడు అన్ని రంగాలకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ వస్తే చీకట్లు కరెంటు ఉండక చీకట్లు కమ్ముకుంటాయని విష ప్రచారం చేస్తే నేడు వారి కండ్లు బైర్లు కమ్మేవిధంగా 24 గంటల కరెంట్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. గతంలో కరెంటుకు కోసం ధర్నాలు చేస్తే రైతులను కాల్చి చంపిన చరిత్ర గత ప్రభుత్వాలది కాగా నేడు రైతుకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఘన చరిత్ర తెలంగాణ సర్కార్ దని వివరించారు. గతంలో పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించేవారని.. కాగా అసలు డిమాండ్ కు మించి ఏడాది పొడవునా అన్నిరంగాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ ఏర్పాటుక నాటికి విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 7,778 మెగావాట్లు కాగా నేడు కేసీఆర్ గారి కృషితో 18453 మెగావాట్లకు చేరుకుందని తెలిపారు. 26.96 లక్షల వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని వివరించారు. డబుల్ ఇంజన్ సర్కార్ అని గొప్పలు చెప్పుకునే గుజరాత్ లో సైతం నేటికి పరిశ్రమలకు పవర్ హాలీడేలు ప్రకటిస్తున్నారని.. అలాగే రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ సైతం అక్కడ అందుబాటులో లేదన్నారు.
ప్రత్యేక రాష్ట్రంలో యాదాద్రి పవర్ ప్లాంట్ ద్వారా 4వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి, భద్రాద్రి పవర్ ప్లాంట్ ద్వారా1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్ర సర్కార్ శ్రీకారం చుట్టిందన్నారు.