Suryaa.co.in

Telangana

దళితుల వ్యక్తిగత అభ్యున్నతికై కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ

దళిత బంధు పేదలకు వరమని ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని దళిత బంధుతో పేదల వ్యక్తిగత వికాసానికి మన రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు శనివారం మధ్యాహ్నం మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర లోని సాయి గార్డెన్ లో తోరూర్ లోని ఎల్ వై ఆర్ గార్డెన్ లో మండల కేంద్రాలలో దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై సంబంధిత శాఖ అధికారులతో ప్రజాప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు మండలంలో విడతలవారీగా గ్రామాల ఎంపిక ప్రక్రియ నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేపట్టి త్వరలోనే యూనిట్లను లబ్ధిదారులకు అందే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు ఎలాంటి జాప్యం లేకుండా అందజేసేటట్లు తగు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు . అర్హులైన లబ్ధిదారులను గ్రామాల్లోనే దళిత సంఘాల నాయకులతో సమీక్షలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కేటగిరీలో అందజేస్తామని ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి తెలిపారు.

దళితుల అభివృద్ధి చెందడానికి ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ఉద్యమ తరహాలో అమలు చేయడం జరుగుతుందని ఇది ఒక దిక్సూచియని మన పాలకుర్తి నియోజకవర్గం లో 1500 దళిత కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని అందించడం జరుగుతుందని దళిత బంధు పథకం కోసం ప్రతి ఏటా 25 వేల కోట్లు కేటాయించడం జరుగుతుందని గ్రామాల్లోని మహిళా సంఘాల సభ్యులకు స్వచ్ఛందంగా చేతివృత్తిలో కుట్టు మిషన్లో ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు పదివేల విలువ చేసే మిషన్లు అందించడం స్వయంగా ఆర్థిక అభివృద్ధి సాధించేలా మహిళలను ప్రోత్సహించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమం లో ఎంపీపీ రాజేశ్వరి జెడ్పిటిసిలు శ్రీనివాస్ జ్యోతిర్మయి పాలకుర్తి దేవస్థానం చైర్మన్ రామచంద్రయ్య శర్మ జిల్లా రైతుబంధు సమితి సభ్యులు నెహ్రూ డిపిఓ సాయిబాబా సంబంధిత శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులు సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE