-హాన్ నదికి హైదరాబాద్ లోని మూసి నదికి ఒకే పరిస్థితులు
– స్పీకర్ ప్రసాద్ కుమార్
సియోల్ (దక్షిణ కొరియా): సౌత్ కొరియా దేశ పర్యటనలో భాగంగా సియోల్ నగరం లోని హన్ మరియు చియాంగీచాన్ నదులను తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ , శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ , లెజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు సందర్శించారు.
సియోల్ నగరం మద్య నుండి ప్రవహించే హన్ నది గతంలో మురికిగా కాలుష్యంతో ఉండేదని ఇరవై సంవత్సరాల క్రితం ప్రభుత్వం నదిని శుద్ధి చేసి పరిసరాలను సుందరంగా తీర్చిదిద్ది, మౌళిక వసతులు కల్పించడంతో పర్యాటక ప్రదేశంగా మారిందని స్థానిక అధికారులు శాసన బృందానికి వివరించారు.
చియాంగీచాన్ నదీ వెంట మౌళిక వసతులు ఏర్పాటు చేయడంతో పర్యాటకం బాగా అభివృద్ధి చెందిందని స్థానిక ప్రజలు, వ్యాపారులు తెలంగాణ శాసన బృందానికి తెలిపారు.
సియోల్ లోని హాన్ నదికి హైదరాబాద్ లోని మూసి నదికి పరిస్థితులు ఒకే విదంగా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన మూసి పునరుజ్జీవనం, సుందరీకరణ పూర్తయితే మన మూసీ నది కూడా పరిశుభ్రంగా మారడంతో పాటుగా హైదరాబాద్ నగరానికి పర్యాటక ప్రదేశంగా మారుతుందని స్పీకర్ ప్రసాద్ కుమార్ అభిప్రాయపడ్డారు.
ఆస్ట్రేలియా లోని సిడ్నీలో జరిగిన 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (CPA) కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం.. కామన్వెల్త్ దేశాలలో స్టడీ టూర్ లలో భాగంగా న్యూజిలాండ్, జపాన్ దేశాలలో పర్యటించి దక్షిణ కొరియా చేరుకుంది.