– ఏపీ ప్రభుత్వ ఉత్తర్వు
అమరావతి : తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విభజన సమయంలో కేటాయించిన 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను స్వరాష్ట్రానికి పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రిలీవ్ అయ్యే వారు తమ కేడర్ చివరి ర్యాంక్ లో నే విధుల్లో చేరతారని వెల్లడించింది.