-ఉద్యమ స్ఫూర్తితో అన్ని వేళలా అండగా నిలిచి రైతే రాజు అని తెలియజేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
-2 కోట్ల 3 లక్షల ఎకరాలకు పెరిగిన సాగు విస్తీర్ణం
-3 కోట్ల 50 లక్షల టన్నులకు పెరిగిన పంటల ఉత్పత్తి
-రైతుబందు ద్వారా 9 విడతలలో రూ.57,881 కోట్లను రైతుల ఖాతాలలో జమచేసిన ప్రభుత్వం
దేశానికి అన్నం పెట్టే రైతుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్నప్పటికీ ఉమ్మడి పాలనాకాలంలో నాటి ప్రభుత్వాలు చూపిన వివక్ష, నిర్లక్ష్యం వలన సం్షోభంలో చిక్కుకున్న వ్యవసాయ రంగమునకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో నూతన జవసత్వాలు లభిస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం వినూత్నముగా రూపొందించి అమలు చేస్తున్న రైతుబందు, వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా, రైతు భీమా, చెరువుల పునరుద్దరణ,భారీ సాగునీటి ప్రాజెక్టులు, నాణ్యమైన విత్తనాలు సరఫరా,పంటలు కొనుగోలు, రైతువేదికలు, ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారి నియామకం, తదితర కార్యక్రమాలు, పధకాలతో రైతులలో సేద్యం పట్ల విశ్వాసాన్ని పునరుద్దరించడం జరిగింది.
ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఒకనాడు ఎందుకూ పనికిరావని ఖాళీగా ఉంచిన బంజరు భూములలో నేడు బంగారు పంటలు పండుతున్నాయి. రైతు సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి వ్యవసాయరంగంలో తెలంగాణ రాష్ట్రం సాదించిన ప్రగతే దీనికి ప్రత్యేక నిదర్శనంగా నిలుస్తుంది. 2014 నాటికి సాగు విస్తీర్ణం 1 కోటీ 34 లక్షల ఎకరాలు కాగా, నేడు అది 2 కోట్ల 3 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇది కాకుండా 11.50 లక్షల ఎకరాలకు ఉద్యానపంటలు సాగు విస్తీర్ణం పెరిగింది. 2014-15 నాటికి ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు మాత్రమే ఉండగా, 2021-22 నాటికి 2.49 కోట్ల టన్నులకు చేరింది.
అన్ని పంటల ఉత్పత్తి కలిపి 3.50 కోట్ల టన్నులకు చేరుకుంది. 2014-15 లో పత్తి సాగు విస్తీర్ణం 41.83 లక్షల ఎకరాలు ఉండగా, 2020-21 నాటికి 44.70% వృద్ధి 18.70 లక్షల ఎకరాలు పెరిగి 60.53 లక్షల ఎకరాలకు చేరుకున్నది.2014-15 లో పత్తి దిగుబడి 35.83 లక్షల బేళ్లు ఉండగా, 60.44 లక్షల బేళ్లకు చేరుకున్నది. రైతు పండించిన ధాన్యాన్ని ఎటువంటి పరిమితులు లేకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఈనాటి వరకు రూ.1,07,748 కోట్ల విలువైన 6 కోట్ల 06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమును ప్రభుత్వం సేకరించి రైతుల ఖాతాలలో జమచేసింది.
అలాగే వ్యవసాయరంగమునకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరాకు రూ.36,703 కోట్ల ను ఖర్చు చేసి విద్యుత్ సరఫరా వ్యవస్థను ప్రభుత్వం పటిష్టపరిచింది.సాలీనా దాదాపు రూ.10,500 కోట్లు భరించి వ్యవసాయమునకు నాణ్యమైన ఉచిత విద్యుత్ ను ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. రైతుబంధు పథకం ప్రపంచంలోనే వినూత్న ఆలోచనలతో రూపొందించిన పధకం. రైతుబందు ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున గత 9 విడతలలో రూ.57,881 కోట్లను పంట పెట్టుబడి సాయంగా రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమచేసింది.
గతంలో విత్తనాలు మొదలు పురుగుమందులు, ఎరువుల కొరకు ఫర్టిలైజర్ షాపులు, వడ్డీ వ్యాపారస్తుల చుట్టూ తిరిగే రైతులు రైతుబందు సొమ్ముతో తమకు నచ్చిన పంటలను సాగుచేస్తున్నారు. విదివశాత్తు అనుకోని పరిస్థితుల్లో కుటుంబానికి పెద్ద దిక్కుగా వుండే రైతు చనిపోతే ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు రైతు భీమా పథకమును ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. రైతు భీమా ఇప్పటివరకు 88,963 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున భీమా పరిహారమును చెల్లించడం జరిగింది . రాష్ట్రములోని ప్రజల తలసరి ఆదాయం 2014-15 లో రూ.1,12,162 లు ఉండగా, 2021-22 నాటికి రూ.2,78,833 లకు పెరిగింది. వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతి కూడా రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరుగుదలకు దోహదం చేసింది.రైతులకు ఆధునిక సేద్య, సస్యరక్షణ పద్ధతుల గురించి చైతన్య పరచేందుకు ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని ప్రభుత్వం నియమించింది.
పంటలకు గిట్టుబాటు ధర కోసం ఆహారశుద్ధి పరిశ్రమలు వెచ్చించి 6.66 లక్షల మంది రైతులకు లబ్ది చేకూర్చడం జరిగినది.రైతు సంక్షేమంలో భాగంగా తెలంగాణ ఏర్పడిన తరువాత ట్రాక్టర్లపై రూ.273.5 కోట్ల రవాణా పన్ను మాఫీతో పాటు రాష్ట్రం ఏర్పడక ముందటి రూ.41.6 కోట్ల రవాణా పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. ధాన్యం నిల్వ సామర్ధ్యమును పెంచుటకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకున్నది గోడౌన్ల సామర్థ్యం 2014-15 లో 39 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉన్నది . ప్రస్తుతం గోడౌన్ల సామర్థ్యం 68.28 లక్షలకు పెంచడం జరిగింది. అలాగే ధాన్యం కాకుండా రూ.9,406.67 కోట్లతో ఇతర పంటలను ప్రభుత్వం సేకరించింది.
నాణ్యమైన విత్తనాల విత్తనాలు సరఫరాకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నది. విత్తన నకిలీకి, కల్తీకి పాల్పడే వారిపై పీడీ యాక్టు నమోదు చేయిస్తున్నది. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా, ఇప్పటివరకు మొత్తం రూ. 963.26 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న చేయుటతో వ్యవసాయరంగం ఆధునికీకరణ చెందుతున్నది. 2014-15 లో వ్యవసాయ ట్రాక్టర్లు సంఖ్య 94,537 ఉండగా,ప్రస్తుతం 3 లక్షలు 52 వేలకు పెరిగాయి. 2014-15 లో 6,318 హార్వెస్టర్లు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం 19,309 లకు చేరాయి. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో తెలంగాణ వ్యవసాయరంగం దేశానికే ఆదర్శంగా పురోగమిస్తున్నది.