– సీఎం కేసీఆర్ ఆలోచన విధానం దేశాన్ని కదిలిస్తుంది
– సంక్షేమంలో ముందుకు తీసుకువెళ్లడంలో తెలంగాణ రాష్ట్రం ముందుంది
-మంత్రి కొప్పుల ఈశ్వర్
దివ్యాంగులు దైవ స్వరూపులని ధైర్యం లో ధైర్యంలో గొప్పవారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగ దినోత్సవాన్ని పురస్కరించు కొని రెండు రోజులు జరుపుకునే ఆటల పోటీలను మంగళవారం నాడు హైదరాబాద్ ఎల్.బి. స్టేడియం లో మంత్రి కొప్పుల ఈశ్వర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ వాసుదేవ రెడ్డి ప్రారంభించారు.
దివ్యంగుల సంక్షేమమే ప్రభుత్వ ఉద్దేశ్యం అని అన్నారు. వారిని అన్ని రంగాలలో సంక్షేమ ముందుకు తీసుకు వెళ్లడంలో తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తుందనిమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమం కొనసాగుతుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత 60 కోట్ల బడ్జెట్ తో వికలాంగుల సంక్షేమం కొరకు ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుందని అన్నారు. క్రీడలు,ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ విద్య ఉద్యోగ రంగాలలో ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఐదు శాతం రిజర్వేషన్ తీసుకువచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని, దివ్యాంగులు మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు ప్రభుత్వం ఈ క్రీడలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పశు సంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దివ్యాంగుల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని..పెన్షన్లు మూడువేల రూపాయలకు పెంచిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ 24 కోట్ల రూపాయల పరికరాలను దివ్యాంగులకు అంద జేయడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమిస్తుందని అన్నారు, దేశంలో సంక్షేమ నిధిలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ లో ఉందని దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.
వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ మాట్లాడుతూ సుమారు 110 రకాల ఆటలు ఆడేందుకు జిల్లాల నుండి వికలాంగులు హైదరాబాదు నగరానికి వచ్చారని వారందరికీ రెండు రోజులు ఆనందభరితంగా క్రీడలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. 33 జిల్లాల వికలాంగులు తమ ప్రతిభను జిల్లాలలో ప్రదర్శించి ఇక్కడికి రావడం ఆనందదాయకంగా ఉందని కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహరించిన దక్షిణామూర్తి అన్నారు. గెలుపొందిన క్రీడాకారులకు మంత్రులు మెమంటోలు. సర్టిఫికెట్ లు, నగదు పారోతోషికం అందచేశారు.