Suryaa.co.in

Andhra Pradesh Telangana

లోకేష్ పాదయాత్రలో తెలంగాణ తమ్ముళ్లు

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వందరోజుల సందర్భంగా తెలంగాణ టీడీపీ నేతలు శ్రీశైలంకు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఎండా-వానలను లెక్కచేయకుండా, లోకేష్ చేస్తున్న పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి.. టీడీపీ యువనేత లోకేష్‌ను సన్మానించారు. ఏపీలో టీడీపీ అధికారం చేపట్టేందుకు యువగళం స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. జగన్ సర్కారు బెదిరింపులు, ఆటంకాలు, ఒత్తిళ్లను అధిగమించి లోకేష్ చేస్తున్న పాదయాత్ర పార్టీని కచ్చితంగా అధికారంలోకి తీసుకువస్తుందని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా తెలంగాణ జిల్లాల్లో నిర్వహిస్తున్న మినీ మహానాడు, ఎన్టీఆర్ శత జయంతి వేడుకల నిర్వహణ గురించి వారు లోకేష్‌తో చర్చించారు. దానికి స్పందించిన లోకేష్ వారిని అభినందించారు. తెలంగాణలో మళ్లీ పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేతలు మండూరి సాంబశివరావు, కాసాని వీరేశం, ప్రకాష్ ముదిరాజ్, డాక్టర్ ఏఎస్ రావు, ఎన్టీఆర్ గౌస్, సూర్యదేవర లత తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE