రాజమండ్రిలో జరుగుతున్న మహానాడు వేడుకల్లో, తెలంగాణకు చెందిన తెలుగుమహిళా నేతలు బోనమెత్తారు. వాటిని ఊరేగింపుగా తీసుకువెళ్లి, పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు అందించారు. రెండు తెలుగురాష్ట్రాలు చల్లగా ఉండాలని, టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకున్నామని తెలుగుమహిళలు చెప్పారు. తెలంగాణ తెలుగుమహిళలు బోనమెత్తిన దృశ్యం అందరినీ ఆకర్షించింది.
ఎన్ టీ ఆర్ శతజయంతి సందర్భంగా రాజమహేంద్రవరం వేమగిరి లో జరిగిన మహానాడు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన , రాష్ట్ర తెలుగు మహిళా
అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి ఆధ్వర్యములో ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ బతుకమ్మలను చేసి, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడి కి ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర లత, కార్యనిర్వహక కార్యదర్శి లీల పద్మ, తెలుగు మహిళా నాయకురాళ్లు ఉప్పల శాంతి, కొణతాల కనక దుర్గ, పొట్రు సరస్వతి, రజనీ, రాజరాజేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.
వచ్చే మహానాడుకు బాబు సీఎం అవుతారు: షకీలారెడ్డి
‘ఈసారి మహానాడు పార్టీ అధికారంలో ఉండగనే జరుగుతుంది. చంద్రబాబు సీఎం హోదాలో మహానాడులో కార్యకర్తలను కలవబోతున్నారు. అమ్మను మేం అదే కోరుకున్నాం. మండుటెండలు సైతం లెక్కచేయకుండా తెలంగాణ నుంచి రాజమండ్రి మహానాడుకు వచ్చిన తెలుగుమహిళలకు నా కృతజ్ఞతలు. ఇక్కడకు వచ్చిన తెలంగాణ నేతలకు వేదికపై సముచిత ప్రాధాన్యం ఇచ్చి, గౌరవించిన తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు తెలుగుమహిళల పక్షాన కృతజ్ఞతలు’ అని తెలంగాణ తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి వ్యాఖ్యానించారు.