– అట్లగే మీ పదేళ్ల లోగుట్టు బయటపెట్టండి
– తెలంగాణ ప్రదేశ్ మీడియా & కమ్యూనికేషన్స్ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి
హైదరాబాద్: కవితక్క.. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మొదటి నుంచి మీరు ఈరోజు చెప్పింది ఏనాడో చెప్పారు. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై వాస్తవాలు చెప్పినందుకు ధన్యవాదాలు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు మీద సీఎం రేవంత్ రెడ్డి గారు సీబీఐ విచారణకు ఆదేశించారు.
సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అవినీతికి పాల్పడ్డారని ఎప్పటి నుంచో చెపుతున్నారు. దాని ఫలితమే నేడు సీబీఐ విచారణ.
మీరు గత పది సంవత్సరాల మీ పాలనలోని ఇంకా అనేక లోగుట్టు విషయాలు బయట పెడతారని ఆశిస్తున్నాము. పాలకి పాలు…నీళ్లకు నీళ్లు తేలాల్సిందే.