హైదరాబాద్ కూకట్‌పల్లిలోని, సుమిత్రనగర్ కు చెందిన ప్రముఖ జ్యోతిష్య, హస్త సాముద్రిక, వాస్తు శాస్త్రం నిపుణులు , పంచాంగకర్త డా. వంగర రవిశంకర్ శర్మ కి ప్రతిభా పురస్కారం తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వారిచే పార్లమెంట్ సభ్యులు పోతుగంటి నాగయ్య రాములు చేతులమీదుగా ఇవ్వడం జరిగింది.
డా. రవిశంకర్ శర్మ గత పది సంవత్సరాలుగా జ్యోతిష్య రంగంలో చేసిన కృషికి ప్రతిఫలంగా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్యోతిష్యం తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన బహుగొప్ప ఆస్తి భావిస్తున్నారని, ఈ జ్ఞానాన్ని తనకు తన పదిమందికి అందించడం తన పూర్వజన్మ సుకృతం అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త తోట ఆంజనేయులు , రామ్ కుమార్ మరియు రవిశంకర్ శర్మ కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది.