నక్సలైట్స్ గురించి ఇవాళ తెలుగులో జరుగుతున్న వాదోపవాదాలు లేదా చర్చలు దేశంలో మరో భాష ప్రజల్లో జరగడం లేదు! తమిళ్ష్, కన్నడం, బెంగాలీ, మరాఠీ, పంజాబీ, మలయాళం వంటి దేశంలోని ఏ భాష ప్రజలూ ఇవాళ నక్సలైట్స్ గురించి తెలుగులో ఉన్నంత ఆలోచన, పేలాపన చెయ్యడం లేదు. ఇవాళ దేశంలో నక్సలిజమ్ అనే జన విరోధ, అభివృద్ధి నిరోధ, నరహంతక వికృతం, వికారం, కీడు, విధ్వంసక క్రీడ ముగింపుకు వస్తున్న చారిత్రిక శుభసమయంలో ఒక్క తెలుగులో మాత్రమే నక్సలిజమ్ అనుకూల వాంతులు వస్తున్నాయి. ఏమిటి ఈ రోగం? ఏమిటీ ఈ దోషం? దేశంలోని ఇతర భాషల ప్రజల్లో లేని ఈ దోషం ఒక్క తెలుగులో మాత్రమే ఎందుకు ఉంది? ‘తెలుగు దోషం’ ఏమిటి? దానికి నివృత్తి ఏమిటి? తెలుగులో మాత్రమే ఉన్న వ్యాధికి వైద్యం లేదా? కమ్యూనిజమ్ అన్నది ప్రతి భాష సాహిత్యం, కవిత్వంలోకి వచ్చింది. కానీ ఆ కమ్యూనిజమ్ వల్ల తెలుగు సాహిత్యం, కవిత్వం భ్రష్టుపట్టినట్టుగా దెబ్బతిన్నంతగా దేశంలోని ఇతర భాషల సాహిత్యం, కవిత్వం భ్రష్టుపట్టలేదు; దెబ్బతినలేదు.
గత 50యేళ్ల కాలంలో తెలుగు కవిత్వం నాశనమైనట్టుగా ప్రపంచంలోని ఏ భాష కవిత్వమూ నాశనం అవలేదు. తెలుగులో ప్రముఖ కవులైన అఫ్సర్, శివారెడ్డి, గోపి వంటి వాళ్లు నిస్సందేహంగా ఇతర భాషల్లో మామూలు కవులుగా కూడా పరిగణించబడరు. దేశంలో ఏ భాషలోనూ ఉచ్చల కవిత్వం రాలేదు; ఒక్క తెలుగులో మాత్రమే ఉచ్చల కవిత్వం వచ్చింది. తెలుగుకు మాత్రమే ఎందుకీ దుస్థితి, దుర్గతి, దుర్మతి? తెలుగులో ప్రజా గాయకులు, ప్రజా కవులు అని అనబడుతున్న వాళ్లు ఇతర భాషల్లో ప్రజా గాయకులు, ప్రజా కవులు అవలేదు; అవలేరు. ప్రపంచంలోని ఇతల భాషలలో మన ప్రజా గాయకులు, ప్రజా కవులు వంటి వాళ్లకు వీధి జాగిలాలకు ఉండే స్థానం కూడా లేదు; ఉండదు.
తెలుగులో మాత్రం ఈ నైచ్యం ఎందుకు తాండవిస్తోంది? భూకబ్జాలు, ధన దోపిడి, నరమేధం వంచన, దందాలు దాడులు, దాష్టీకాలు, కులోన్మాదులను, కుల దూషణ చేసే వాళ్లను తెలుగులో ప్రజా కళాకారులు అంటారు. నేను ఆవేదనతో ఈ మాటలు అంటున్నందుకు వీధి జాగిలాలకు, బురద వరాహాలకు సంయుక్తంగా పుట్టిన ఏ నికృష్టపు జీవో ఫేస్బుక్లో నా ఫోటో పెట్టి ‘అందరూ అరుసుకొర్రి’ అని ఒక పోస్ట్ పెట్టావచ్చు, ఆ నీచ జీవి ఫ్రెండ్ లిస్టులో ఉన్న అత్యంత జుగుప్సాకరంగా పుట్టిన వికృత జీవులు తమ అసభ్య పుట్టుకలను తెలియజేసే భాషతో నన్ను తూలనాడావచ్చు.
లోగడ నేను గద్దర్ విషయంలో ‘చదువు’, ‘తెలివిడి’ ప్రాతిపదికన ఒక పోస్ట్ పెడితే వీధి జాగిలాలకు, బురద వరాహాలకు సంయుక్తంగా పుట్టిన సురేందర్ అనే ఒక అతి నీచపు జీవి చేసిన పని, ఆ పనికి కామెంట్లుగా అతి అసభ్యకరంగా పుట్టిన కొన్ని వీధి జాగిలాల పుత్రులు, పుత్రికలు తమ స్థాయి భాషా ప్రయోగం చేశారు. ఆ జీవుల అంతే… అందువల్లే ఆ బూతు జన్మలకు కొన్ని తరాలుగా సభ్య సమాజంలో చోటు దక్కలేదు. ఏ భాష ప్రజలలోనూ పెద్దగా కనిపించని దోషాలు తెలుగు ప్రజల్లో మాత్రమే ఎందుకున్నాయి? బాలమురళీకృష్ణ, ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం, పీ. సుశీల, ఎస్. జానకి, పీ.బీ. శ్రీనివాస్ వంటి గాయనీగాయకులు తమిళ్ష్, కన్నడం, మలయాళం వంటి భాషల్లోనే ఎక్కువగా రాణించారు. ముఖ్యంగా బాలమురళీకృష్ణ తమిళ్ష్ ప్రజలవల్లే విశ్వవిఖ్యాతమయ్యారు. మొత్తం దక్షిణాది సినిమా గానాన్ని ప్రభావితం చేసి నడిపించిన పీ.బీ. శ్రీనివాస్ కన్నడం, తమిళ్ష్ వల్లే the transitional icon of south Indian film singing అయ్యారు. తెలుగులో గొప్ప గాయకుడైన ఘంటసాలకు ఇతర భాషలలో పెద్దగా గుర్తింపు రాణింపు రాలేదు. ఎస్. జానకికి మలయాళం, కన్నడం, తమిళ్ష్ భాషల్లో ఉన్న ప్రశస్తి తెలుగులో రాలేదు. మన తెలుగు దోషం ఏమిటి? మన తెలుగువాళ్లకు లేనిదేమిటి? మనకు ఇకపైనైనా రావాల్సినది వస్తుందా? ఆవేదనతో..
– రోచిష్మాన్ 9444012279