హైదరాబాద్ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018 సంవత్సరానికి గాను తెలుగు రాష్ట్రాలకు చెందిన 44 మంది ప్రముఖులను పురస్కారాల కోసం ఎంపిక చేసింది. వీరిలో డా.గంపా నాగేశ్వరరావు (వ్యక్తిత్వ వికాసం), స.వెం.రమేష్ (భాషాచ్ఛందసాహిత్య విమర్శ), డా.మచ్చ హరిదాస్ (సాహిత్య విమర్శ), మెట్టు మురళీధర్ (కథ), తాటికొండల నరసింహారావు (నాటకరంగం), డా.బి.జానకి (జనరంజక విజ్ఞానం), ఎం.వి.రామిరెడ్డి (కాల్పనిక సాహిత్యం), ఎం.పవన్‌కుమార్ (ఉత్తమ ఉపాధ్యాయుడు), రాజశుక (పత్రికా రచన), మరిపాల శ్రీనివాస్ (జీవిత చరిత్ర), జావేద్ (కార్టూనిస్టు), డా.ఆర్.కమల (ఉత్తమ రచయిత్రి), డా.పూస లక్ష్మీనారాయణ (వచన కవిత), కోడూరు పుల్లారెడ్డి (సృజనాత్మక సాహిత్యం), డా.ఎం.శ్రీకాంత్‌కుమార్ (పరిశోధన), డా.గురవారెడ్డి (హాస్యరచన), సి.జానకీబాయి (ఉత్తమనటి), వల్లూరి శ్రీహరి (ఉత్తమ నటుడు), రావుల పుల్లాచారి (ఉత్తమ నాటక రచయిత), షేక్ బాబు (హేతువాద ప్రచారం), డా.విజయలక్ష్మీ పండిట్ (ఉత్తమ రచయిత్రి), డా.టి.వి.భాస్కరాచార్య (వివిధ ప్రక్రియలు), పుల్లూరి ప్రభాకర్ (అవధానం), డా.సూరేపల్లి సుజాత (మహిళాభ్యుదయం), అడ్లూరి రవీంద్రాచారి (గ్రంథాలయకర్త), ఆచార్య దొర్తి ఐజాక్ (గ్రంథాలయ సమాచార విజ్ఞానం), జి.కిరణ్మయి (ఆంధ్రనాట్యం), గులాబీల మల్లారెడ్డి (నవల), గడ్డం శ్రీనివాస్ (జానపద కళలు), ఆచార్య మాడభూషి శ్రీధర్ (ఆధ్యాత్మిక సాహిత్యం), తిరువాయిపాటి చక్రపాణి (పద్యం), సంజయ్‌కిషోర్ (సాంస్కృతిక సంస్థ నిర్వాహణ), వొల్లాల వాణి (జానపద గాయకులు), డా.వాసరవేణి పరశురాములు (బాలసాహిత్యం), మ్యాజిక్ బోస్ (ఇంద్రజాలం), డా.మోత్కూరి మాణిక్యరావు (పద్యరచన), దివాకర్ల సురేఖామూర్తి (లలిత సంగీతం), ఇందిరా కామేశ్వరరావు (శాస్త్రీయ సంగీతం), డా.సాగి కమలాకరశర్మ (జ్యోతిషం), ఆచార్య వెనకపల్లి తిరుపతయ్య (గేయం), బి.సుధీర్‌రావు (కూచిపూడి నృత్యం), డా.బి.జయరాములు (ప్రాచీన సాహిత్యం), కృష్ణానాయక్ చౌహాన్ (అనువాద సాహిత్యం), డా.పి.లక్ష్మీరెడ్డి (చిత్రలేఖనం)లు కీర్తి పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరికి జనవరిలో హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారాలు ప్రదానం చేస్తారు. పురస్కారం కింద రూ.5,116 నగదుతో పాటు పురస్కార పత్రాన్ని అందజేస్తారని వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
Devotional
హనుమంతుడు వివాహితుడా? అవివాహితుడా?
హనుమంతుడు అవివాహతుడనే చాలామందికి తెలుసు. ఆయన బ్రహ్మచారి అన్నది లోకం నమ్మిక. కానీ ఆయన వివాహితుడేనని శాస్త్రం చెబుతోంది. మరి హతుమంతుడు వివాహితుడా? అవివాహితుడా? ఓసారి చూద్దాం! ఆయనను సువర్చలా సహిత హనుమ అని పిలుస్తారు. సువర్చలా సహిత హనుమకు కళ్యాణం చేయడం శాస్త్రంలో అంగీకరించారు. ఎందుకంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళకుంటే పెద్దలైనటువంటివారు తరించరు. శాస్త్రంలో హనుమకు…
గుడిలో ప్రదక్షిణ ఎందుకు చేస్తారు?
గోపురం దాటి లోనికి వచ్చిన భక్తుడు ధ్వజస్థంభ దర్శనం చేసుకున్న తరువాత లోనున్న దైవదర్శనం చేసుకునే ముందు గుడి ప్రాకారంలోపల ప్రదక్షిణం చెయ్యడం ఆనవాయితీ. అసలు ప్రదక్షిణం ఎందుకు చేయాలి? ప్రదక్షిణ అని దేనిని అంటారు?? అంతరాలయం చుట్టూ చేస్తే దాన్ని పరిక్రమం అంటారు, బయట ప్రాకారం చుట్టూ చేస్తే దాన్ని ప్రదక్షిణ అంటారు. ఋగ్వేదం…
Sports
చరిత్ర సృష్టించిన భారత చెస్ ప్లేయర్
భారత చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్ వరల్డ్ చెస్ ఛాంపియన్ గా అవతరించారు. వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్-2024లో భాగంగా మాజీ ఛాంపియన్ డింగ్ లిరెన్‌తో జరిగిన 14వ రౌండ్లో గుకేశ్ విజయం సాధించారు. దీంతో క్లాసికల్ చెస్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన అత్యంత పిన్న వయస్కుడిగా (18 ఏళ్లు) రికార్డు నెలకొల్పారు. గేమ్ అనంతరం…
అండర్ 19 రాష్ట్ర జట్టుకు ఎంపికైన సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే
జగ్గయ్యపేట పట్టణానికి చెందిన టి. వరుణ్ సాత్విక్, ఎన్. రాజేష్ లు ఆంధ్ర రాష్ట్ర అండర్ 19 మల్టీ డేస్ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. ఈరోజు జగ్గయ్యపేట జీ.వీ.జే బాయ్స్ హైస్కూల్లో గల బివి సాగర్ మెమోరియల్ స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో నెట్స్ వద్దకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య వెళ్లి వారిని అభినందించారు….