బీసీలకు అండగా ఉంటూ, కష్టపడి పని చేసే వారిని తెలుగుదేశం ప్రోత్సహిస్తుంది

105

– రాష్ట్ర తేదేపా అధ్యక్షుడు కింజరపు అచ్చంనాయుడు

రాష్ట్ర బీసీ సాధికారత సమితిలో సగర కులం నుంచి జంపన వీర శ్రీనివాస్ ను రాష్ట్ర కన్వీనర్ గా నియమించినందుకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గౌరవ మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అచ్చం నాయుడుని కలిసి శాలువా, పూలమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపిన జంపన వీర శ్రీనివాస్.

ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని, బీసీల సాధికారత తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడు బీసీలకు అండగా ఉంటూ, పార్టీలో కష్టపడి పనిచేసే వారికి పదవులు ఇస్తూ ప్రోత్సహిస్తుందని, దానిలో భాగంగానే ఈ రోజు బీసీ సాధికారత లో సగర కులం నుంచి జంపన వీర శ్రీనివాస్ ను రాష్ట్ర అధ్యక్షులుగా నియమించామని, శ్రీనివాస్ కష్టపడి పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని అచ్చం నాయుడు అన్నారు.

బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. అన్న నందమూరి తారకరామారావు గారి దగ్గర నుంచి, చంద్రబాబు , లోకేష్ బాబు వరకు బీసీల అభ్యున్నతికి, బీసీ సాధికారత కు కట్టుబడి ఉన్నారని, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని, కావున రాబోయే రోజుల్లో మనం అందరం కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకువచ్చి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందాం అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో తాడిశెట్టి వీరస్వామి, వల్లూరు కిరణ్, వాసు తదితరులు పాల్గొన్నారు.