– టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలు పాడుపెట్టిన సైకో జగన్ రెడ్డి
– టీడీపీ జాతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ…
– నక్కా ఆనంద బాబు
ఎన్టీఆర్ గృహాకల్ప, కేంద్రం ప్రకటించిన ఆవాస్ యోజన పథకం ద్వారా కట్టిన వాటికి జగన్ రెడ్డి టిడ్కో ఓపెనింగ్ కి వెళ్లి ఆవాకులు చవాకులు పేలాడు.
చంద్రబాబు నాయుడుకు పేదలకు ఇళ్లు ఇచ్చే మనస్సు ఉందా అని అబద్దాలు మాట్లాడాడు. ఇలా మాట్లాడటానికి సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి. ఎన్నికల నాటికి 2,62,560 పూర్తిచేసి ఇస్తే వాటిని పేదలకు ఇవ్వకుండా పాడుపెట్టి నాలుగేళ్ల తరువాత పేదల ఇళ్లు గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది.
పాదయాత్ర సమయంలో టిడ్కో గృహాల మీద లోన్ తీసుకుంటే దానికి 30 ఏళ్లు ఈఎంఐలు కట్టాలని మాయమాటలు చెప్పాడు. నేను అధికారంలోకి వస్తే ప్రీ గా పంపిణీ చేస్తానని మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత పాడుపెట్టారు. చంద్రబాబు నాయడు నిర్మాణం పూర్తి చేసిన 2,62,560 టిడ్కో ఇళ్లను పంపిణీ చేయకుండా సైకో మనస్తత్వంతో వాటిని మురుగునా పడేశారు.
ఎన్టీఆర్ పేరు మీద రూరల్ హౌసింగ్ 7,56 లక్షల గృహాలను నిర్మించాం. పట్టణ ప్రాంతాలలో పిఎంఏవై ద్వారా 2,60 లక్షల ఇళ్లు నిర్మించాం. మొత్తం 12,56 వేల ఇళ్లను నిర్మించి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు దే. వివిధ దశల్లో ఇంకో 18లక్షలు ఉన్నాయి. మొత్తంగా 30లక్షలు ఇళ్లు నిర్మాణం చేయాలనేది. చంద్రబాబు గారి సంకల్పంతో శ్రీకారంతో చుట్టారు.
ఈరోజు ఎన్నికలు ముందు హడావుడి చేస్తున్నాడు. అబద్ధాలు చెప్పడం అతనికి ఒక అలవాటుగా మారింది. టిడ్కో గృహాలపై ఉన్న విషయంపై వాళ్లకు చెప్పకుండా పంపిణీ చేస్తానడం సిగ్గుచేటు. పేదవాడికి కూడు, గుడ్డ, నీడ గురించి ఆలోచించిన పార్టీ తెలుగుదేశం. దేశంలో పక్కాగృహాలకు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదవాడి కలను ఏవిధంగా నేరవేర్చుతాడో సమాధానం చెప్పాలి.
ఈ రోజు జగనన్న కాలనీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడు. జగన్ రెడ్డి జగనన్న కాలనీలు ఏర్పాటుచేసిందే సంపాదించుకొవడానికే తప్ప ప్రజలకు మేలు చేయడానికి కాదు. తక్కువ రేటు ఉన్న భూములను 4 రెట్లు పెంచి వ్యాపారం చేసిన మాట వాస్తవం. జగనన్న కాలనీల పేరుతో దోపిడీకి తేరలేపారు. పేద వాడి ఇంటి కల నేరవేరేది టీడీపీతోనే.
టీడీపీ జాతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…
పేద ప్రజల ఇళ్ల నిర్మాణంలో మోసం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. టీడీపీ హయాంలో 12.60 లక్షల ఇళ్లను నిర్మాణం చేసి పంచిన ఘనత టీడీపీ ది . గ్రామీణ ప్రాంతాలలో ఇళ్లు కట్టుకునే విషయంలో రాజకీయాలకు అతితంగా ఇచ్చాం.
ఈప్రభుత్వంలో పేదవాడి ఇళ్లపై రాజకీయం చేస్తున్నాడు ఈ సైకో జగన్ రెడ్డి. దళితులను చిన్న చూపు చూసే వ్యక్తి ఈ సైకో . టీడీపీ హయాంలో పక్కాగృహాలకు దళితులకు రూ. 2.50 లక్షల ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దళిత మోసం చేసిన దళిత ద్రోహి జగన్ రెడ్డే. అగిపోయిన టిడ్కో గృహాలకు వెంటనే లబ్దిదారులకు అందిచాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
టీడీపీ జాతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ…
గుడివాడలో టిడ్కో గృహాలను లబ్దిదాలకు అందిస్తున్నామని ఒక నాటకానికి తెరలేపారు. టిడ్కో గృహాల విషయంలో జగన్ రెడ్డి వైఖరి చూస్తే సొమ్ము ఒకరిది సొకు ఒకరిది అన్నట్లుంది. సొమ్ము టీడీపీ ది సొకు ఏమో వైసీపీదని రాష్ట్రంలోని ప్రజలు గమనిస్తున్నారు. కేవలం నువ్వు రంగులు వేసుకొని నాటకానికి తేరలేపారు. టీడీపీ హయాంలో కట్టిన గృహలకు శంకుస్థాపన చేయడం సిగ్గు అనిపించలేదా జగన్ రెడ్డి నాలుగేళ్లు మీ ప్రభుత్వం ఏమి చేసింది గాడిదలు కాచిందా? సమాధానం చెప్పాలి. వాటర్, కరెంట్ ,డ్రైనేజీ, సౌకర్యం ఇస్తే పేదవారి సొంత ఇంటి కల నేరవేరింది.
రాజధాని అమరావతి లో 5 వేలు ఇళ్లను పాడుపెట్టి ఎక్కడో ఆర్ -5 జోన్ ప్రజలను మోసం చేయడానికి తెరలేపావ్. స్థానికంగా ఉన్న పేదవాళ్లకు ఒక్క ఇళ్లు ఇవ్వకుండా ఎక్కడెక్కడో ఉన్న పేదవారికి ఇవ్వడం దర్మార్గం. నీకు పేదలకు సంక్షేమం ఇద్దామని లేదు కనుక నీకు పతకం స్టార్ అయింది గుర్తుపేట్టుకొమని హెచ్చరిస్తున్న.
కక్షపూరిత వ్యవహరిస్తున్నాడే తప్ప పేదలకు న్యాయం చేసే దోరణి లేడు. నీ మోసపు మాటలు దగా, కుట్రలను ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎత్తులు, జిత్తులు ఇంకా పారవు టిడ్కో గృహాలు ఓపెనింగ్ చేయడమే నాలుగేళ్లు పట్టిదంటే నీకు నిజంగా పేద వాళ్ల మీద ప్రేమఉందా జగన్ రెడ్డి ఉంటే ఇప్పటికై టిడ్కోలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు అందిచాలని డిమాండ్ చేస్తున్నాం.