Suryaa.co.in

Andhra Pradesh

మంత్రి కొడాలి నానిపై తెలుగుదేశం పార్టీ కుట్ర రాజకీయాలు

– క్యాసినో జరగకుండానే టీడీపీ విషప్రచారం
– మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి

గుడివాడ, జనవరి 21: రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పై తెలుగుదేశం పార్టీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని గుడివాడ మున్సిపల్ మాజీ వైసైచైర్మన్ అడపా బాబ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గుడివాడ పట్టణం లింగవరం రోడ్డులోని కే. కన్వెన్షన్, మెయిన్ రోడ్డులో జరిగిన వేర్వేరు సమావేశాల్లో అడపా బాబ్జి మీడియాతో మాట్లాడారు. ఎంతో ప్రశాంతంగా ఉండే గుడివాడ నియోజకవర్గాన్ని అల్లకల్లోలం చేసేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. క్యాసినో వంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండానే జరిగినట్టుగా విషప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. గుడివాడ నియోజకవర్గ, పరిసర ప్రాంత ప్రజలంతా మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో జరిగిన జాతీయస్థాయి ఎడ్ల బండలాగుడు ప్రదర్శన పోటీలను ప్రత్యక్షంగా వీక్షించారని చెప్పారు.

ఈ నేపథ్యంలో క్యాసినో వంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగాయని చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. పోలీసులకు ఒకవైపు ఫిర్యాదు చేయడంతో పాటు ఇంకో వైపు నిజ నిర్ధారణ కమిటీ పేరుతో గుడివాడలో అరాచకం సృష్టించేందుకు ప్రయత్నించారని, ప్రజలు తరిమికొట్టే పరిస్థితి టీడీపీకి ఎదురైందని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు మాట్లాడుతూ విజయవాడ నుండి కిరాయి గూండాలను తీసుకువచ్చి గుడివాడలో అలజడి సృష్టించేందుకు టీడీపీ ప్రయత్నించిందన్నారు. టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం నింపేందుకు కుట్ర రాజకీయాలు చేశారన్నారు. తెలుగుదేశం పార్టీలో మొదటి నుండి ఇటువంటి ఆనవాయితీ కొనసాగుతూ వస్తోందన్నారు. కిరాయి వ్యక్తులతో దెబ్బలు తిని వైసీపీ కార్యకర్తలు కొట్టినట్టుగా చిత్రీకరించే ప్రమాదం ఉందన్నారు. దీన్ని ప్రజల మద్దతుతో నిరశిస్తున్నామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కుట్ర రాజకీయాలను అడ్డుకుని తీరతామన్నారు.

గుడివాడ ప్రజలు ఎంతో చైతన్యంతో వ్యవహరిస్తారని గుర్తుచేశారు. పిచ్చి వేషాలు మానుకోవాలని టీడీపీ శ్రేణులను మండలి హెచ్చరించారు. వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్ని కుట్రలకు పాల్పడినా మంత్రి కొడాలి నాని ప్రతిష్ఠను అంగుళం కూడా తగ్గించలేరని చెప్పారు. ఇప్పటికైనా టీడీపీ శ్రేణులు పద్ధతి మార్చుకోకపోతే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, గుడివాడ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి, ఎంపీపీ పెయ్యల ఆదాం, జడ్పీటీసీ సభ్యుడు గోళ్ళ రామకృష్ణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్విక్టర్, నాయకులు మెరుగుమాల కాళీ, కసుకుర్తి బాబ్జి, పాలడుగు రాంప్రసాద్, మేకల సత్యనారాయణ, కొంకితల ఆంజనేయప్రసాద్, గిరిబాబాయ్, మూడెడ్ల ఉమా, చింతల భాస్కరరావు, వెంపటి సైమన్, దారం నరసింహా, కొలుసు నరేంద్ర, రేమల్లి పసి, షేక్ సయ్యద్, చుండి బాబి, పెద్ది కిషోర్ , పొట్లూరి మురళీధర్, తోట రాజేష్, లోయ రాజేష్, ఎస్కే బాజీ, అలీబేగ్, చింతాడ నాగూర్ , చిన్ని దుర్గాప్రసాద్, మాదాసు వెంకటలక్ష్మి, గంటా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE