– ఏపీ తలరాత మార్చనున్న మెర్క్స్
– ఆ కంపెనీ వస్తే ఏపీకి షిప్పింగ్ కంపెనీల వరద
– దుబాయ్, సింగపూర్ వాళ్ళకి కూడా లేని అవకాశం
– ఇక షిప్పింగ్ లెజెండ్స్ క్యూ
– ఏడాదికి 5 లక్షల కోట్ల ఆదాయం ఉన్న ఏకైక జగద్విఖ్యాత కంపెనీ ఏపీకి రాక
– మెర్క్స్ రాకతో వచ్చే ప్రయోజనాలను వివరించడంలో అధికారులు, సర్కారు మీడియా విఫలమైందా?
– దాని ప్రయోజనాలేమిటో అధికారులు, సర్కారు మీడియా అర్ధం చేసుకోలేదా? అర్ధం కాలేదా?
– లోకేష్ కష్టం గురించి వివరించడంలో అధికారులు, సర్కారు మీడియా విఫలమైందా?
– లోే ష్ స్వయంగా వెళ్లి చర్చించిన తర్వాత కుదిరిన ఒప్పందం
– దాన్ని కూడా ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యారా?
– మెర్క్స్ కంపెనీతో ఒప్పందం వార్తలో వైఫల్యం ఎవరిది?
రాష్ట్రానికి రాబోతున్న మెర్క్స్ కంపెనీ గురించి ఓసారి తెలుసుకుందాం.
ఈ ప్రభుత్వం వచ్చాక చాలా పరిశ్రమలు వచ్చాయి, వస్తున్నాయి. కానీ హైటెక్ సిటీలా రాష్ట్ర భవిష్యత్తును, ఒక కొత్త ఎకనామిక్ జనరేషన్ తీసుకొచ్చే పరిశ్రమ అయితే రాలేదు అనే చెప్పాలి. ఒకవేళ వచ్చినా సామాన్యులకి అర్ధం అయ్యేలా చెప్పడం ప్రభుత్వం విఫలమయింది అని ఒప్పుకోవాలి.
ఇప్పుడు మెర్క్స్ (Maersk డెన్మార్క్ కంపెనీ) గురించి తీసుకుంటే వందేళ్లు చరిత్ర ఉన్న కంపెనీ. ఏడు వందలకు పైగా షిప్స్ (ఒక్కో షిప్ విలువా మన దగ్గర ఉండే వెయ్యి కోట్ల టర్నోవర్ ఉండే పరిశ్రమతో సమానం) నాలుగు వందల పోర్టులలో ఆపరేషన్స్, ప్రత్యక్షంగా,పరోక్షంగా ఐదారు లక్షలకు పైగా ఆధారపడి ఉన్న ప్రపంచంలోనే నెంబర్ వన్ లాజిస్టిక్ కంపెనీ వస్తుంటే సింపుల్ గా 9వేల కోట్లు, పది వేల ఉద్యోగాలు అని ఒక ప్రకటనతో సరిపెట్టారు.
ఈ కంపెనీ తీసుకువస్తే దాని ప్రభావం, వచ్చే అవకాశాలపై చంద్రబాబుగారికి, క్లారిటీ ఉన్నా ఆయన తర్వాత చూసుకొనే మంత్రులు, అధికారులు, అధికార ప్రతినిధులు వగైరా వగైరాలకు సరైన అంచనా లేనట్టుంది. లేదంటే వారికి ఇంకా ముఖ్యమైన కార్యక్రమాలలో బిజీగా ఉన్నారేమో?!
నిజానికి ఈ జగద్విఖ్యాత కంపెనీతో ఒప్పందం కోసం మంత్రి లోకేష్ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. విస్తారమైన తీర సంపద, పోర్టుల సదుపాయం, రోడ్డు కనెక్టివిటీ ఉన్న ఏపీలో.. మీ కంపెనీ స్థాపిస్తే వచ్చే ప్రయోజనాలు వివరించి, వారిని ఒప్పించడంలో లోకేష్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. సింగపూర్లో ఈ కంపెనీ లాజిస్టిక్ రంగంలో ప్రవేశించిన తర్వాతనే ప్రపంచంలో లాజిస్టిక్ రంగం రూపురేఖలు మారిపోయాయి. సహజంగా లాజిస్టిక్ కంపెనీలకు షిప్పులు ఉండవు. కానీ మెర్క్స్ కంపెనీకి 726 సొంత షిప్పులు ఉన్న ఏకైక సంస్థ.
తీరా ఆ ఒప్పందం సాధిస్తే.. మీడియాలో వచ్చిన అరకొర వార్తలు నిరుత్సాహపరిచాయి. దానికి కారణం. ఇంగ్లీషులో వచ్చిన ఆ ఒప్పంద వార్తను అర్ధం చేసుకునే సామర్థ్యం లేకనా? ఇంగ్లీషు తెలిసిన జర్నలిస్టులు సర్కారులో లేకనా?.. లేకపోతే ఏపీ రూపురేఖలు మార్చి, ప్రభుత్వ ఆదాయం పెంచి, ఉపాథి అవకాశాలు మెరుగుపరిచే అలాంటి కంపెనీతో జరిగిన ఒప్పంద వార్తను నిర్లక్ష్యం చేసి ఉండరు. ఫలితంగా యువనేత లోకేష్ పడ్డ కష్టం ప్రపంచానికి తెలియకుండా పోయింది. అదొక్కటే ఆవేదన కలిగించే అంశం.
అయినా మనకి తప్పదు కదా?!
ఇంకా విషయానికి వస్తే ఆంధ్రపదేశ్ బెజవాడ కేంద్రంగా ట్రాన్స్పోర్ట్ పరిశ్రమ గత కొన్ని దశాబ్దాలుగా దేశంలోనే ఎంతో పేరు గాంచింది. బండ్లు బావుంటాయి. టైం మెయింటైన్ చేస్తారు. సరకు జాగ్రత్తగా చూసుకుంటారు. నార్త్ ఈస్ట్ లాంటి ప్రమాదకరమైన ఘాట్ లో కూడా జాగ్రత్తగా చేరుస్తారు. ఇలా చాలా చెప్పుకుంటారు. అలాంటి పరిశ్రమ చాలా కాలంగా సంక్షోభంలో ఉంది.
మధ్యలో కొంతకాలం ఆక్వారంగం, గ్రానైట్, ఐరన్ ఓర్ లాంటివి ఆదుకున్నా ఇవి ఒక ప్రాంతానికి లేదా కొంతమంది వ్యక్తులకు ఉపయోగపడింది తప్ప, పరిశ్రమ మొత్తంగా లాభపడింది లేదు. అదే మెర్క్స్ (డెన్మార్క్ కంపెనీ) రావడం అంటూ జరిగితే.. చిన్న, పెద్ద ఎగువ, దిగువ మధ్యతగతి కనీసం లక్ష కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది.
ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం.
1. మిగతా కంపెనీలకులాగా వీళ్ళ ఆపరేషన్స్ మొదలు పెట్టడానికి సంవత్సరాలు, సంవత్సరాలు పట్టదు. ఒక్కసారి సైట్ ఫైనల్ అయ్యింది అంటే, ఒక్క సంవత్సరంలోనే వాళ్ళ కార్యక్రమాలు మొదలు పెట్టేస్తారు.
2. వీళ్ళకి సొంత షిప్స్ లోనే సరకు రవాణా ఉంటుంది. ఒక పోర్ట్ కు వచ్చి బెర్తింగ్ కోసం రోజుల తరబడి యాంకరేజ్ లో వెయిట్ చేసే దానికన్నా, వేరే పోర్ట్ టెర్మినల్ వాడుకొని ఆఫ్ లోడ్ చేసుకొని, షిప్ వేరే డెస్టినేషన్ కి వెళ్ళి పోతుంది. తర్వాత రోడ్ ట్రాన్స్పోర్ట్ వాడుకొని పంపేసుకుంటారు. మనకి ఆల్రెడీ రోడ్స్ కనెక్టివి బానే ఉంది. కొన్ని చోట్ల పెంచాలి. కానీ ప్రస్తుతానికి ఇబ్బంది లేదు.
దీని వల్ల వాళ్ళకి వాయేజ్ ఖర్చు కలిసి వస్తుంది. మనకి లోకల్ గా ట్రాన్స్పోర్ట్ అవకాశాలు మెరుగవుతాయి. ఒక్కసారి షిప్పింగ్ కంపెనీ వాయేజ్ కలిసి వస్తుంది అని పోజిటివ్ గా ఫీల్ అయ్యింది అంటే, ఇంకా ఆ ప్రాంతాన్ని హబ్ చేసుకొని తన ఫ్లీట్ తో వీలున్నంత వాడుకోవడానికి చూస్తుంద. , దుబాయ్, సింగపూర్ ఫైనాన్షియల్ హబ్స్ గా ఏర్పాటు అవ్వడానికి ముఖ్యకారణం.. అక్కడి ఆయిల్, క్రమశిక్షణ, వర్క్ కల్చర్ లాంటి ఎన్ని చెప్పుకున్నా,, అన్నిటికన్నా ముఖ్య కారణం అక్కడి ప్రభుత్వాలు షిప్పింగ్ హబ్స్ కి ప్రోత్సాహం ఇవ్వటమే.
3. ఎప్పుడైతే మెర్క్స్ (డెన్మార్క్ కంపెనీ) ఆపరేషన్స్ స్టార్ట్ చేసిందో, దాని వెనకే MSC, CGM, Cosco లాంటి షిప్పింగ్ లెజెండ్స్ క్యూ కడతాయి. అప్పట్లో ఎలా అయితే మైక్రోసాఫ్ట్ వచ్చాక గూగుల్, విప్రో, ఓరాకిల్ లాంటివి హైదరాబాద్ కు వచ్చాయో అలా అన్నమాట!
4. వీటితో పాటు, కమర్షియల్ బ్యాంకింగ్ & ఫైనాన్స్ బ్యాంకింగ్, ఇన్సూరెన్ సెక్టార్, RTO లాంటి వైట్ కాలర్ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు మొదలుకొని, బాడీ బిల్డింగ్, రిపేర్లు లాంటి శ్రామిక రంగం వరకూ చిన్న, దిగువ, ఎగువ మధ్య తరగతి ప్రజలకు ఎందరికో ఉపాధి కల్పిస్తాయి.
5. అన్నిటికన్నా మిన్నగా రైతాంగానికి ఎంతో ఉపయోగ పడుతుంది. ఒకరకంగా బంగారం పండించడమే. ఈ విషయంలో దుబాయ్, సింగపూర్ వాళ్ళకి కూడా లేని అవకాశం ఆంధ్రప్రదేశ్ కి వస్తుంది. కాకపోతే మన రైతులకి కొంచెం ప్రపంచస్థాయి వ్యవసాయ పంటలు, వాటి నాణ్యత, స్టోరేజ్ గురించి పూర్తి అవగాహన అందించాలి. ఈ ఇంటర్నెట్ యుగంలో అదంత పెద్ద విషయం కాదు.
6. ఇంకా Export, Import, industrial రంగాలలో అవకాశాలకు కొదవే ఉండదు (ఇది అర్ధం చేసుకోవడానికి కొంచెం EXIM, కస్టమ్స్, డ్యూటీ లేవీల నాలెడ్జ్ ఉండాలి ఇంకోసారి మాట్లాడుకుందాం)
7. చాలా వరకు మేధో వలస కంట్రోల్లోకి వస్తుంది. ముందే చెప్పినట్టు.. వీటిని మొదలు పెట్టడానికి పెద్దగా టైం పట్టదు. కాబట్టి రెండు, మూడు సంవత్సరాలు గట్టిగా వీటి మీద శ్రద్ధ పెట్టి, కరెక్ట్ గా ఫాలో అప్ చేస్తే.. ఈ చివర ఇచ్చాపురం నుంచి ఆ చివర తడ వరకూ , అన్ని రంగాలలో ఉపాధి దొరికే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారుతుంది.
కాకపోతే ఇక్కడ సమస్య అల్లా పార్టీతోనే … అన్నీ చేసి పార్టీ ఓడిపోతే ?
నువ్వు అభిమానించిన నీ నాయకుడు నానాపాట్లు పడి.. వయసుని లెక్క చేయకుండా, ఆరోగ్యాన్నీ పణంగా పెట్టి, తెచ్చిన పరిశ్రమ ఎవడో వచ్చి ఓపెనింగ్ చేసి వాడి తండ్రి, తాతల అకౌంట్ లో వేస్తుంటే ?
ఇంకో నాయకుడు ఎవడో వాడి కులాభిమానంతోనో, పార్టి అభిమానం అనో ఇంకో తలమాసినోడు పేరు చెబుతుంటే ?
చదువుకొని, నాలెడ్జ్ ఉండీ కొందరు కులకుష్టుతో పచ్చి అబద్ధాలను నమ్ముతూ వాటినే ప్రచారం చేస్తూ ఉంటే ?
పోనీలే అంతమందికి అన్నం పెడుతుంది కదా ఎవడి పేరు ఉంటే ఏంటిలే అని సరిపెట్టుకుందామా ?
అలాంటి తప్పుడు చరిత్రనే మన తరవాత తరాలకు ఇద్దామా ?
మరేం చేద్దాం ???
ఏదైనా ఒక సంస్థ, పరిశ్రమ తీసుకువచ్చినప్పుడు అది సామాన్యుడికి ఎలా ఉపయోగపడుతుంది అనేది చెప్పడంలో, పార్టీ వ్యవస్త పూర్తిగా విఫలం అవుతుంది. …
ఇప్పుడనే కాదు 2004 లో కంప్యూటర్లు కూడు పెడతాయా ? అని రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలోనే కూసినప్పుడు.. సరైన సమాధానం అసెంబ్లీకే కాదు ప్రజలకు కూడా అర్థమయ్యేలా చెప్పి ఉంటే, రాష్ట్రం పరిస్థితి ఇలా దిక్కులు చూసుకునేలా ఉండేది కాదు.
క్వాంటం, బ్లాక్ చైన్ అంటే ఎవడికి అర్ధం అవుతుంది ? కాస్తో కూస్తో అవి ఇవి చదివే నాలాంటి వాళ్ళకే చాలా మందికి అవి సామాన్యుడికి ఎలా ఉపయోగపడతాయి అనేది తెలియదు.
షిప్పింగ్ లైన్లో ఉన్నా కాబట్టి లాజిస్టిక్ హబ్ గురించి నాకున్న అవగాహన ఇక్కడ చెప్పా, మిగతావాటి గురించిన అవగాహన ఎలా తెలుస్తుంది ?
ఉదాహరణకి అనంతపురానికి కియా తెచ్చాం, తెచ్చాం అని చెబుతారు. సెల్ఫీలు దిగుతారు. కానీ అనంతపురం జిల్లాకు తీసుకువచ్చిన కియా వల్ల శ్రీకాకుళం జిల్లాలో మారుమూల పింఛన్ తీసుకొనే వాళ్ళకి, జీతం తీసుకొనే ఉద్యోగికి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఎలా తెలుస్తుంది ?
అదే కియా కడుతున్న పన్నుల వల్ల, ఆ కియా కారు కొన్నోడు కట్టే రోడ్ టాక్స్ వల్ల, కొట్టించే పెట్రోల్ మీద వచ్చే టాక్స్ వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం దాన్ని ఎలా రాష్ట్రంలో ఇంకో మూల పని చేసే ఉద్యోగికి జీతంగా వెళుతుంది.. పెదోళ్లకి రకరకాల పథకాలు ఎలా వెళ్తుంది అనేది వివరించి చెప్పలేనప్పుడు వాటి వల్ల ఉపయోగం ఏమిటి ?
సరికదా.. కొత్తగా వచ్చిన పరిశ్రమలు, వాటితో పెరిగిన భూమి ధరలతో పుట్టుకు వచ్చే ప్రాంతీయ విద్వేషాలు, వాటిల్లో చలి కాచుకునే రాజకీయ నాయకులకు ఉపయోగం తప్ప.
హైదరాబాద్ అభివృద్ధి చెందింది అక్కడ పార్టీ పోయింది. ఇది మన పరిస్తితి.
That’s Beauty of Democracy అని సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి తప్ప ఉపయోగం ఏముంది?
అందుకే కష్టపడి తీసుకొచ్చే ప్రతి సంస్థ, పరిశ్రమ ఏదైనా దాని పురోగతిని ఎలా టైం ఫ్రేమ్ పెట్టుకొని ఎలా చూస్తారో.. అలానే దాని వల్ల ప్రయోజనం సామాన్యుడికి చేరిందా కనీసం అర్ధమయ్యేలా ఒకటికి పది సార్లు చెప్పే వ్యవస్థ ఉండేలా చూసుకోవాలి. అవసరం ప్రత్యేక వ్యవస్థ, కార్యక్రమాలు ఉండాలి.
పట్టిసీమ వల్ల రాయలసీమకు కలిగే ఉపయోగాలు, టిడిపి నాయకుల వల్ల కాకుండా మద్యలో జగన్ రెడ్డి పాలన రావడంతో వాళ్ళకి బాగా అర్ధం అయ్యింది అని తెలుసా ? అట్లాంటుంది మన వాళ్ళతో …
PS: ఇక్కడ మెర్క్స్ గురించి రాసినప్పుడల్లా.. డెన్మార్క్ కంపెనీ అని బ్రాకెట్ లో ఎందుకు రాసానంటే, ప్రపంచంలో హ్యాపీస్ట్ దేశాల లిస్ట్ వేస్తే ఎప్పుడూ టాప్ 5 లో ఉండే దేశం అది. వాళ్ళ కంపెనీలలో ఉద్యోగం చేయడం ప్రివిలేజ్ గా బావిస్తారు. అలాంటి దేశం నుంచి ప్రపంచంలో నెంబర్ 1 కంపెనీ ఇండియాకి, అందులో మన ఆంధ్రప్రదేశ్ కి ఒప్పించారంటే చంద్రబాబు గారి చరిత్రలో సువర్ణ అక్షరాలతో మరో పేజీ సిద్ధం అయ్యిందని!
ఒక తెలుగువాడిగా మనం గర్వపడాల్సిన విషయం. ఇలాంటి పెద్ద కంపెనీలు మన దగ్గరనుండి తమ వ్యాపార కార్యకలాపాలు చేయడానికి సిద్ధ పడుతున్నాయంటే.. దానివలన మనదగ్గరకు వచ్చే ఆదాయం, ఉద్యోగావకాశాలు మరి కొన్ని తరాల వరకు లాభాలు తెస్తాయని సంగతి మరువద్దు.
– నవీన్ చౌదరి పాటూరి