పంటల సాగు విస్తీర్ణం:
• 2014 నాటికి సాగు విస్తీర్ణం కోటీ 31 లక్షల ఎకరాలు కాగా 2022-23 నాటికి అది 2 కోట్ల 38 లక్షల ఎకరాలకు పెరిగింది. పెరిగిన సాగు విస్తీర్ణం కోటి 7 లక్షల ఎకరాలు (81.6 %).
ధాన్యం ఉత్పత్తి:
• 2014-15 నాటికి ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు మాత్రమే ఉండగా, 2022-23 నాటికి రికార్డు స్థాయిలో సుమారు 3.00 కోట్ల టన్నులకు చేరుకున్నది.
ధాన్యం సేకరణ:
• తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఈనాటి వరకు రూ. లక్షా 33 వేల కోట్లతో, 722.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
ఇతర పంటల సేకరణ:
• అలాగే ధాన్యం కాకుండా రూ.11,439.06 కోట్లతో ఇతర పంటల సేకరణ
సాగు నీరు:
• పెండింగ్ సాగు నీటి ప్రాజెక్టుల పూర్తి, నూతన ఎత్తిపోతల పథకాల వల్ల వచ్చిన సాగునీటి ద్వారా పెరిగిన సాగు విస్తీర్ణం.
• ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగు నీరు.
• పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా దక్షిణ తెలంగాణ లో 6 జిల్లాల్లోని మరో 12.30 లక్షల ఎకరాలకు సాగు నీరు.
• రూ. 5349 కోట్లతో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరించి, 8.93 టిఎంసి ల సామర్థ్యంతో 15.05 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ
• సాగు నీటి శిస్తు రద్దు.
ఉచిత విద్యుత్తు :
• సాలీనా దాదాపు రూ.10,500 కోట్లు భరిస్తూ, రాష్ట్రంలోని రైతులందరికి 24 గంటల ఉచిత విద్యుత్తు.
రైతు బంధు :
• రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున గత 11 విడతలలో రూ.72 వేల 815 కోట్లు
రైతు భీమా :
• రైతు భీమా పథకం ద్వారా ఇప్పటివరకు 1,11,320 మంది రైతు కుటుంబాలకు రూ. 5,566 కోట్ల భీమా పరిహారం చెల్లింపు.
రుణ మాఫీ
• తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు
o మొదటి విడతలో 35.31 లక్షల రైతుల యొక్క రూ.16,144.10 కోట్లు రుణమాఫీ
o రెండవ విడతలో ఇప్పటి వరకు 22 లక్షల 98 వేల 039 రైతుల యొక్క రూ.13,000.51 కోట్లు రుణమాఫీ (రూ.1,40,000/- వరకు). కొనసాగుతున్న మిగిలిన రైతుల యొక్క రుణ మాఫీ ప్రక్రియ. (మొత్తం రుణ మాఫీ: రూ. 19,440 కోట్లు)
o 2014 నుండి రెండు విడతలలో కలిపి ఇప్పటివరకు 58.29 లక్షల రైతుల యొక్క రూ.29,144.61 కోట్లు రుణమాఫీ
వ్యవసాయ విస్తరణ:
• ఒక్కొక్కటి రూ.22 లక్షల వ్యయంతో రూ. 572 కోట్లతో 2601 రైతు వేదికల నిర్మాణం
• ప్రతి 5 వేల ఎకరాలకు ఒక ఏఈఓ
• క్రాప్ బుకింగ్ అవలంభిస్తున్న ఏకైక రాష్ట్రం
విత్తనాలు, ఎరువులు :
• సీజన్ కు ముందే రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు
• విత్తనాల నకిలీకి, కల్తీకి పాల్పడే వారిపై పీడీ యాక్టు
• దేశానికి అవసరమయ్యే పత్తి విత్తనాలలో 50 శాతం తెలంగాణాలోనే ఉత్పత్తి.
• ఇప్పటివరకు రూ. 981.51 కోట్లతో 41.59 లక్షల క్వింటాళ్ల రాయితీపై వివిధ రకాల పంటల విత్తనాలు సరఫరా.
వ్యవసాయ యాంత్రీకరణ:
• ఇప్పటివరకు మొత్తం రూ.963.26 కోట్లతో, 6.66 లక్షల మంది రైతులకు లబ్ది.
• తెలంగాణ ఏర్పడిన తరువాత ట్రాక్టర్లపై రూ.273.5 కోట్ల రవాణా పన్ను మాఫీతో పాటు రాష్ట్రం ఏర్పడక ముందటి రూ.41.6 కోట్ల రవాణా పన్ను రద్దు.
గోడౌన్ల సామర్థ్యం:
• 2014-15: 39.01 లక్షల మెట్రిక్ టన్నులు, ప్రస్తుతం 73.82 లక్షల మెట్రిక్ టన్నులు
మార్కెట్ కమిటీ రిజర్వేషన్లు:
• 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను రిజర్వేషన్ల ద్వారా భర్తీ.
• సీజన్ కు ముందే ఏ పంటలు వేయాలో, రైతులకు సూచించడానికి మార్కెట్ రీసర్చ్ & అనాలసిస్ వింగ్ ఏర్పాటు
సూక్ష్మ సేద్యం:
• రూ.1847.10 కోట్ల సబ్సిడీతో 7.79 లక్షల ఎకరాలలో సూక్ష్మ సేద్య సాగు
పంట నష్ట పరిహారం:
• పంట నష్ట పరిహారం కింద ఇప్పటివరకు మొత్తం రూ.1794.76 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ
ఆయిల్ పామ్ సాగు:
• ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడంలో భాగంగా ఆయిల్ పామ్ మిషన్ కింద వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఎకరాల సాగు లక్ష్యం
• ప్రస్తుతం రాష్ట్రంలో 1,94,954 ఎకరాలకు చేరిన ఆయిల్ పామ్ సాగు.
వ్యవసాయ విద్యకు ప్రోత్సాహం:
• తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నూతనంగా (11) వ్యవసాయ మరియు ఉద్యాన విద్య కళాశాలలు & పాలిటెక్నిక్ ల ఏర్పాటు
• వ్యవసాయ కళాశాలలు : 5
• వ్యవసాయ పాలిటెక్నిక్ లు: 4 • ఉద్యాన కళాశాలలు : 1
• ఉద్యాన పాలిటెక్నిక్ లు: 1
రాష్ట్ర తలసరి ఆదాయం
• 2014-15: రూ.1,12,162/-, 2022-23 : రూ.3,17,115/-
• పంటలకు గిట్టుబాటు ధర కోసం ఆహారశుద్ది పరిశ్రమలు