– అమరావతిపై జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఈర్ష్యాద్వేషాలు ఇసుమంతైనా తగ్గలేదు. పవిత్రమైన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలుచెబుతూ, కోర్టుతీర్పుని అపహాస్యంచేశాడు. నయవంచనకు మరోరూపం జగన్మోహన్ రెడ్డని తేలిపోయింది
• అమరావతిని అభివృద్ధిచేయడం జగన్మోహన్ రెడ్డికి చేతగాదని తేలిపోయింది
• అమరావతికోసం పోరాడుతున్న రైతుజేఏసీకి ముఖ్యమంత్రి రాజధాని అభివృద్ధి బాధ్యతను అప్పగిస్తే, ఈప్రభుత్వానికి రూ.25వేలకోట్ల ఆస్తిని అప్పగిస్తామని ఛాలెంజ్ చేస్తున్నా
– మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్
అసెంబ్లీలో అభివృద్ధివికేంద్రీకరణ బిల్లుపైచర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగాఖండిస్తున్నామని, ముఖ్యమంత్రిగా ఉండి…ఒకప్రాంతాన్ని నాశనం చేస్తూ..మరో ప్రాంతాన్ని బాగుచేస్తున్నట్లు ప్రజల్ని నమ్మించాలనిచూడటం బాధాకరమని, రాజధాని అమరావతిపై న్యాయస్థానంచాలా స్పష్టంగా తీర్పుఇచ్చినాకూడా ముఖ్యమంత్రికి, మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలకి రాజధానిపై ఉన్న ఈర్ష్యాద్వేషాలు తొలగిపోలేదని మాజీశాసనసభ్యులు, గుంటూరు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ స్పష్టంచేశారు.శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
శివరామకృష్ణన్ కమిటీనే వికేంద్రీకరణ చేయమని చెప్పిందని జగన్మోహన్ రెడ్డి పచ్చిఅబద్ధంచెబుతూ ప్రజల్నినమ్మించాలని చూస్తున్నాడు. శివరామకృష్ణన్ కమిటీ అభివృద్ధిని వికేంద్రీకరించమని.. అన్నిప్రాంతాలను అభివృద్ధిచేయాలని చెప్పింది. ముఖ్యమంత్రిగా ఉన్నవ్యక్తికి పాలనావికేంద్రకరణకు, అభివృద్ధి వికేంద్రీకరణకు తేడాతెలియక పోతేఎలా? బినామీభూములున్నాయని ఇప్పటికీ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు.
కోర్టులు స్వయంగా చెప్పినా… మిమ్మల్ని ఆఛెంప.. ఈఛెంప వాయించినా ఇప్పటికీ భూములుకొన్నారనిచెబితేఎలా? టీడీపీవాళ్లకు భూములున్నాయని నమ్మించడానికి సిట్ వేసి ఏంనిరూపించారు? ఇంకా సిగ్గులేకుండా ఈ ప్రాంతంపై నాకు ప్రేమఉందని.. అమరావతిలోనే తాను ఇల్లుకట్టుకున్నానని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. ఈ ప్రాంతంపై ఆయనకు ప్రేమే ఉంటే, అభివృద్ధికోసం పులివెందులనియోజకవర్గానికి కేటాయించిన నిధుల్లో సగమైనా కేటాయించాడా? తాను ముఖ్యమంత్రి అయ్యాక అమరావతిలో ఒక్కనిర్మాణమైనా జగన్మోహన్ రెడ్డి పూర్తిచేశాడా? ఇల్లుకోగానే పండగ అయిపోయినట్టు, రాజధానికి న్యాయంచేసినట్టు కాదు జగన్మోహన్ రెడ్డీ? నయంచనకు ప్రతిరూపం జగన్మోహన్ రెడ్డి. వంచన..మోసాలకు ప్యాంట్ షర్ట్ వేస్తే అది జగన్మోహన్ రెడ్డే అని చెప్పొచ్చు.
అమరావతిపై జగన్మోహన్ రెడ్డికి కనీసం సవతితల్ల్లిప్రేమకూడా లేదు. రాజధాని నిర్ణయం రాష్ట్ర పరిధిలోనే ఉంటుందని జగన్మోహన్ రెడ్డి నిన్నసభలో చెప్పుకొచ్చారు. కానీ నిర్ణయమనేది ఒక్కసారి మాత్రమే తీసుకుంటారు. పదేపదే కప్పదాటువైఖరితో నిర్ణయాలు మార్చుకుంటూ, ప్రజల్ని బలిచేయకూడదని తెలుసుకోండి జగన్ రెడ్డి గారు! తాను అధికారంలోకి వస్తే రాజధానిని మారుస్తానని జగన్మోహన్ రెడ్డిప్రతిపక్షంలోఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు? జగన్మోహన్ రెడ్డిప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. బీజేపీవారు అధికారపక్షంతో మిత్రపక్షంగా ఉన్నప్పుడు అందరి ఆమోదంతోనే అమరావతిగా రాజధానిని ఏకగ్రీవంగా ప్రకటించారు. అవేవీ మీకుగుర్తులేవా జగన్మోహన్ రెడ్డి గారు?
జార్ఖండ్..ఉత్తరాఖండ్.. చత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు రాజధానులను ఒకప్రభుత్వం నిర్ణయించాక, తరువాతవచ్చిన ప్రభుత్వాలు ఏవీ ఆయారాష్ట్రాల రాజధానులు మార్చలేదని మీకుతెలియదా జగన్మోహన్ రెడ్డి? ఆయారాష్ట్రాల కు ముఖ్యమంత్రులుగా పనిచేసినవారెవరూ మీకులాగా మూడురకాల ఆలోచనలు చేయలేదు. కేంద్రమిచ్చిన అవకాశాన్ని గతప్రభుత్వమే వినియోగించుకొని రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని ప్రకటించింది. భారతదేశ పొలిటికల్ మ్యాప్ లో రాష్ట్రరాజధానిగా అమరావతిని కేంద్రమే పెట్టింది. ఆ విషయం మీరెందుకు గ్రహించరు జగన్మోహన్ రెడ్డి?
తుగ్లక్ నిర్ణయాలు పదేపదే తీసుకుంటాము.. మా నిర్ణయాలతో ప్రజలు ఎలాపోయినామాకు పరవా లేదంటే ఎలా? వికేంద్రీకరణ గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి… మాకే అధికారమిచ్చారు ఏమైనా చేస్తాము అన్నట్లుగా మాట్లాడారు. ప్రజలు అధికారమిచ్చింది…. ప్రభుత్వఆస్తులకు, ప్రజల ఆస్తులకు, రాష్ట్రానికి కస్టోడియన్ లా ఉంటారని మాత్రమే. రాష్ట్రానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలు మీపార్టీ మీటింగ్ లోనో.. లేక మీ కిచెన్ కేబినెట్ లోనే తీసుకునే నిర్ణయాల్లా ఉంటే ప్రజలు హర్షించాలా?
ధర్మాన ప్రసాదరావు నిండుసభలో అంబేద్కర్ వంటి మహానుభావుడిని వాడు అని సంబో ధించడం.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కుసంస్కారానికి నిదర్శనం. కార్యనిర్వాహక, శాసనవ్యవస్థలను జగన్మోహన్ రెడ్డి చట్టప్రకారం పనిచేయనిస్తున్నాడా? తనపాలనలో డీజీపీ లెక్కలేనన్ని సార్లు చేతులుకట్టుకొని కోర్టులో ఎందుకు నిలబడ్డాడో జగన్మోహన్ రెడ్డిచెప్పగలడా? ఐఏఎస్..ఐపీఎస్ లు చేతులుకట్టుకొని కోర్టులముందు నిలబడి, ముఖ్యమంత్రి చేసిన తప్పులకు సంజాయిషీలు ఇచ్చుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి కార్యనిర్వాహక వ్యవస్థగొప్పతనం గుర్తుకురాలేదా?
రాష్ట్రఎన్నికల కమిషనర్ ను కులంపేరుతో తిట్టినప్పుడు కార్యనిర్వాహక వ్యవస్థను గౌరవించాలని తెలియదా? తనమాట చెల్లుబాటు కాలేదన్న అక్కసుతో కౌన్సిల్ ను రద్దుచేయడానికి ప్రయత్నించిన జగన్ రెడ్డి… శాసనవ్యవస్థ గొప్పతనం గురించి చెప్పడం సిగ్గుచేటు. తిరిగి ఇప్పుడు అదే కౌన్సిల్ కు తనపార్టీకి చెందిన రాజకీయ నిరుద్యోగులను పంపుతున్నాడు. ఊరికే ఉపన్యాసాలిస్తూ.. ప్రజలకు తెలియదు కదా అని శాసనవ్యవస్థ.. కార్యనిర్వాహకవ్యవస్థ.. అంటూ కన్నింగ్ ముచ్చట్లు చెప్పకు జగన్మోహన్ రెడ్డి.
మూడురాజధానుల చట్టం సరైందే అయితే, జగన్మోహన్ రెడ్డి, ఆయనప్రభుత్వం ఎందుకు కోర్టునుంచి దాన్ని ఉపసంహరించుకుంది? ప్రభుత్వకార్యాలయాలకు పార్టీరంగులు వేయకూడదన్న చిన్న లాజిక్ కూడా మీ శాసనవ్యవస్థకు తెలియలేదా జగన్మోహన్ రెడ్డీ? బూతులు తిట్టడానికి.. న్యాయవ్యవస్థను దూషించడానికి మీరుశాసనవ్యవస్థను ఉపయోగించుకుంటారా? శాసనవ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గౌరవించేవాడే అయితే తనపార్టీవారితో న్యాయమూర్తులను, కోర్టులను ఎందుకు తిట్టించాడో… ఇప్పుడు దానిపై సీబీఐ విచారణ ఎందుకు ఎదుర్కొంటున్నాడో సమాధానం చెప్పగలడా?
ప్రస్తుతం సుప్రీంకోర్టు సీజేఐ గా ఉన్న వ్యక్తిపై తప్పుడు ఫిర్యాదు చేసింది జగన్మోహన్ రెడ్డికాదా ? కోర్టు తనపరిధి దాటివ్యవహరించడంలేదు.. అది అబద్ధంకూడా. ముఖ్యమంత్రే అహంకారం తో తనపరిధి దాటి ప్రవర్తిస్తున్నాడు. బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంప్రకారమే కోర్టులు, శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ నడుచుకోవాలి. కిందికోర్టు పరిధిదాటి ప్రవర్తిస్తే, దానిపై జగన్మోహన్ రెడ్డి పైకోర్టులను ఆశ్రయించాలి. సీఆర్డీఏ చట్టంప్రకారం మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని న్యాయస్థానంచెబితే, ముఖ్యమంత్రేమో కాలపరమితి ఎలా ఇస్తారంటున్నాడు.
20ఏళ్ల సమయం ఇచ్చారని చెబుతున్న ముఖ్యమంత్రికి ఆసమయం రాజధానిని అభివృద్ధి చేయడానికి సరిపోదా అని ప్రశ్నిస్తున్నాం. రాజధాని అమరావతిపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని ముఖ్యమంత్రి అసలు పూర్తిగా చదవనేలేదని నిన్న ఆయనసభలో మాట్లాడిన దాన్ని బట్టే అర్థమైంది. ప్రజల్ని తప్పుదోవపట్టించడానికి…. తనవాచాలత్వాన్ని ప్రజలపై రుద్దడానికే నిన్న ముఖ్యమంత్రి పవిత్రమైన అసెంబ్లీని వేదికగా ఎంచుకున్నాడు.
రాజధాని అనేది జగన్మోహన్ రెడ్డికి చిన్నవిషయమేమోకానీ… రాష్ట్రప్రజలకుకాదు. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిఎన్నిసార్లు మారిందో జగన్మోహన్ రెడ్డికి తెలియదా? ప్రత్యేకరాష్ట్రంకోసం పొట్టిశ్రీరాములుగారు ఎందుకుప్రాణత్యాగంచేశారో ముఖ్యమం త్రిగాఉన్నవ్యక్తే తెలుసుకోకపోతే ఎలా? అవమానం.. అసూయలమధ్యన బ్రతకలేకనే తెలుగు వారంతా తమకు ప్రత్యేకరాష్ట్రంకావాలని నినదించారు. ప్రజలభావోద్వేగాలను గుర్తించలేని వ్యక్తి ముఖ్యమంత్రిస్థానంలో ఉండటం ఈ రాష్ట్రప్రజలు చేసుకున్నఖర్మ. తమిళనాడు..తెలంగాణ…కర్ణాటక రాష్ట్రాలకుఆయారాష్ట్ర రాజధానులనుంచి వస్తున్న ఆదాయమెంతో కూడా ముఖ్యమంత్రికి తెలియదా? రాష్ట్రరాజధాని..దాని ఆర్థికమూలాలు.. వాటిద్వారా జరిగే అభివృద్ధిఅనేది జగన్మోహన్ రెడ్డికి చిన్నవిషయంలా కనిపించడం, ఆయన లోని మానసికఅపరిపక్వతకు నిదర్శనం.
తన దుష్ప్రచారాన్ని, దురుద్దేశాలను ప్రజలపై రుద్దడానికి ముఖ్యమంత్రి అసెంబ్లీని వేదికగా చేసుకోవడందుర్మార్గం. రైతులుచేసిన త్యాగాలను , వారిచ్చిన భూములను తక్కువచేసి చూపే ప్రయత్నాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఆలోచనావిధానాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నా ము. రైతులు ఇచ్చిన భూములవిలువ రూ.2లక్షలకోట్లు. అది జగన్మోహన్ రెడ్డికి తెలియక కాదు. కేవలంఅమరావతిని నాశనంచేయడమే అతని లక్ష్యం. నిజంగా ఈ మఖ్యమంత్రికి అన్నిప్రాంతాలు అభివృద్ధిచేయాలని ఉంటే..కేంద్రంనుంచి రాయలసీమకు, ఉత్తరాంధ్రకు రావాల్సిన ప్యాకేజీ గురించి ఎందుకు నిలదీయడం లేదు?
రాష్ట్రాన్ని అభివృద్ధిచేయడం జగన్మోహన్ రెడ్డికి చేతగాదు. జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం అమరావతిని రైతు జేఏసీ యాక్షన్ కమిటీకి అప్పగించి, అభివృద్ధిచేసుకునే హక్కుకల్పిస్తే, ప్రభుత్వానికే తిరిగి రూ.25వేలకోట్ల ఆస్తిని అప్పగిస్తాం. తాము విసిరే ఛాలెంజ్ కు ముఖ్యమంత్రి కట్టుబడితే అందుకు తాముసిద్ధంగాఉన్నాం.