Suryaa.co.in

Andhra Pradesh

లైమ్ లైట్ లోకి రావాలనుకున్నప్పుడల్లా ఆళ్ల ఇలా తప్పుడు ఫిర్యాదులు తెరపైకి తెస్తాడు

-కోర్టు ధిక్కరణ ఆదేశాల సెగ తన ప్రభుత్వానికి తగలకూడదన్న దురాలోచన, కుట్రతోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి …నిర్మాణమే జరగని ఇన్నర్ రింగ్ రోడ్ పేరుతో తప్పుడు ఫిర్యాదు చేశాడు. లైమ్ లైట్ లోకి రావాలనుకున్నప్పుడల్లా ఆళ్ల ఇలా తప్పుడు ఫిర్యాదులు తెరపైకి తెస్తాడు

• ఆళ్ల రామకృష్ణారెడ్డి తప్పుడు ఫిర్యాదులు, పిటిషన్లు పట్టుకొని దర్యాప్తులు, విచారణ అంటూ అధికార యంత్రాంగం అభాసుపాలు అవుతోంది
• లేనివి ఉన్నట్లు, ఉన్నవిలేనట్టు చూపుతూ, ప్రజలను వెర్రివాళ్లను చేయాలన్న దురుద్దేశంతోనే జగన్ రెడ్డి, ఆళ్ల తప్పుడు ఫిర్యాదులను తెరపైకి తెస్తున్నారు
• తన అన్న ఇంట్లో పట్టుబడిన వందలకోట్ల అక్రమ సంపాదనపై ఆళ్ల ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
– గుంటూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్

మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్లరామకృష్ణారెడ్డి తప్పుడు పిటిషన్లు వేయడమే అలవాటుగా బతుకుతున్నాడని, వాస్తవాలు, ఆధారాలు లేకుండా అధికారుల్ని, పోలీస్ యంత్రాంగాన్ని, తప్పుడుపిటిషన్లతో ఆయనఅనేకమార్లు అభాసుపాలుచేశాడని, ఆళ్లఫిర్యాదులు, ఆయనపిటిషన్లు పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికైనా వారిపని వారుచేసుకుంటే మంచిదని గుంటూరుపార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, మాజీఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ హితవుపలికారు.బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే …

మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచింది మొదలు ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్లు వేయడమే తనపనిగా పెట్టుకున్నాడు. గతంలోరాజధానిలోని దళితులభూముల్ని కొందరు బలవంతంగా లాక్కున్నారని, వారిని మోసగించి కారుచౌకగా కొట్టేశారని, చంద్రబాబు, ఆయనపార్టీవారే రియల్ ఎస్టేట్ వ్యాపారంచేశారని ఆళ్లరామకృష్ణారెడ్డి ఫిర్యాదుచేశాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా ఎవరుభూములు అమ్మారు…ఎంతకిఅమ్మారు.. ఎవరికిఅమ్మారు…ఎవరుకొన్నారంటూ సీబీసీఐడీవారు రాజధానిగ్రామాలన్నీతిరిగి కొండను తవ్విఎలుకను కూడా పట్టలేకపోయారు.

రాజధానిప్రాంతంలోని దళితులంతా తమభూములు స్వచ్ఛందంగానే ఇచ్చామని చెప్పడంతో, ప్రభుత్వం సీబీసీఐడీ, ఇతరఅధికారులు తేలు కుట్టినదొంగల్లా మిన్నకుండి పోయారు. తాను లైమ్ లైట్ లోకి రావాలని భావించినప్రతిసారీ రామకృష్ణారెడ్డి తప్పుడుఫిర్యాదులు, తప్పుడు పిటిషన్లు వేస్తుంటాడు. తాజాగా అదేకోవలో అమరావతి మాస్టర్ ప్లాన్ లోని ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్ మెంట్ మార్చారని, దానివల్ల అయాచితంగాకొందరు లబ్ధిపొందారని, ప్రభుత్వఖజానా కు నష్టంవాటిల్లిందని ఆళ్లరామకృష్ణారెడ్డిఫిర్యాదుచేశారు.

దానిపై సీబీసీఐడీ వెంటనే27-04- 2022న కేసునమోదుచేయడం.. వారంలో విచారణజరపడం, సీబీసీఐడీ అఢిషనల్ డైరెక్టర్ వెంటనే మాజీమంత్రి నారాయణ, మరికొందరికి నోటీసులుఇవ్వడం జరిగిపోయింది. రాజధానిఅనేది ఆంధ్రుల పరువుప్రతిష్టలకు సంబంధించింది. దాన్నికూడా ఈప్రభుత్వం తనస్వార్థరాజకీయాలకు వాడుకుంటూ, రాష్ట్రపరువుని అప్రదిష్టపాలు చేస్తోంది. ఈప్రభుత్వంలో ముఖ్యమంత్రి మొదలు, ఆళ్లరామకృష్ణారెడ్డిసహా, అధికారులు కొందరు ఉన్నవిలేనట్లు, లేనివి ఉన్నట్లుచూపిస్తూ, నమ్మించే ప్రయత్నా లుచేస్తున్నారు. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణమనేది మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి చుట్టుపక్కల నిర్మించాలని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం భావించింది.

దానికోసం ఒక డ్రాఫ్ట్ కూడా తయారుచేశారు. అదిఇంకా ఫైనల్ పబ్లికేషన్ అవలేదు. ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణంచేపట్టకుండా గతప్రభుత్వానికి అప్పటిప్రతిపక్షం అనేకఅవరోధాలు కలిగించింది. రాజశేఖర్ రెడ్డి హయాంలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ప్రణాళికను దుర్వినియోగంచేసి, దానిఅలైన్ మెంట్ మార్చి… దాన్నిఅష్టవంపులుతిప్పి, చివరకు తన అనుమాయులకు మేలుచేసినట్టే టీడీపీప్రభుత్వం కూడా, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణంలో ఏవో స్వార్థ రాజకీయాలు చేసినట్టు జగన్మోహన్ రెడ్డ్డి అనుమానించారు. ఆక్రమంలోనే తనపార్టీ ఎమ్మెల్యేతో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ పేరుతో తప్పుడుఫిర్యాదు చేయించి, అధికారులతో నోటీసులు ఇప్పించారు.

అలాంటి దిక్కుమాలినపనులు తండ్రీకొడుకులు చేస్తారుగానీ… చంద్రబాబు ,టీడీపీప్రభుత్వం చేయదు. ప్రభుత్వంలోఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల్ని లెక్కచేయకుండా తండ్రీకొడుకులు ఇద్దరూ వారివారి స్వార్థానికి సొంతనిర్ణయాలు తీసుకుంటారనేది అందరికీ తెలిసినవాస్తవమే. అలానే అందరూ చేస్తారనుకుంటే ఎలా? అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అనేది డ్రాఫ్ట్ పబ్లికేషన్ దశలోనే ఆగిపోయింది. ఎక్కడో కంతేరులో హెరిటేజ్ భూములుంటే, అమరావతిలోని ఇన్నర్ రింగ్ రోడ్ కివాటిని ఎలా లింకుపెడతారు?

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం డ్రాఫ్ట్ పబ్లికేషన్ దశలోఉండి, నిర్మాణమే ప్రారంభంకానప్పుడు ఎవరికో లబ్ధిచేకూర్చే పని ఎలాసాధ్యమవుతుందని కూడా ఈప్రభుత్వం ఆలోచించదా? ప్రజల్నివెర్రివాళ్లనుచేసి, వారిని ఏదోరకంగా మాయచేయాలన్నదే ఆళ్లరామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డిల తాపత్రయం. జగన్ రెడ్డి ఆడేదుర్మార్గపు ఆటలో ఆళ్లరామకృష్ణారెడ్డి ఒకపావులా ఆయనకు ఉపయోగపడుతున్నాడు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ సహా, రాజధానిభూముల్లో ఏమీలేకపోయినా, ఏదోజరిగినట్టుగా దుష్ర్పచారం చేస్తున్న ఆళ్లరామకృష్ణారెడ్డి, తనఅన్నఇంట్లో పట్టుబడిన వందలకోట్ల అక్రమ సంపాదనపై ఎప్పుడు ఎందుకు పిటిషన్లు వేయలేదు? తన అన్న ఇంట్లో వందల కోట్ల నల్ల డబ్బుని ఒక గది నుంచి ఇంకోగదికిమార్చినా రామకృష్ణారెడ్డి పట్టించుకోడు, అసలేమీ తెలియనట్లే నటిస్తాడు.

అమరావతి నిర్మాణం ముందుకెళ్లకూడదన్న కుట్రతోనే తప్పుడు ఫిర్యాదు….
కేవలం అమరావతి నిర్మాణం ముందుకెళ్లకూడదన్న ఒకేఒక్క లక్ష్యంతోనే రామకృష్ణారెడ్డి మరలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చారంటూ తప్పుడుఫిర్యాదుచేశాడు. కోర్టుఆదేశంతో నిర్ణీతవ్యవధిలోగా అమరావతి నిర్మాణం పూర్తిచేయాల్సిరావడంతో దాన్నుంచి ఎలాతప్పించుకోవాలన్న ప్రయత్నంలోభాగంగానే జగన్ రెడ్డి, రామకృష్ణారెడ్డితో ఇన్నర్ రింగ్ రోడ్ పేరుతో తప్పుడుఫిర్యాదు చేయించాడు. ఆ తప్పుడు ఫిర్యాదు పట్టుకొని అధికారయంత్రాంగం ఎప్పటిలానే కుక్కతోకపట్టుకొని గోదావరిఈదే ప్రయత్నంచేస్తోంది.

గతంలోకూడా ఆళ్ల, జగన్మోహన్ రెడ్డి రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అని, తెలుగుదేశంపార్టీవారు రైతులను భయపెట్టి, వారినుంచి తక్కువధరకే భూములుకొన్నారని నానాయాగీచేశారు. వారి అనుకూలమీడియా సాక్షిలో దుష్ప్రచారం చేశారు. అమరావతి భూముల్లోఎక్కడా ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని రాష్ట్రహైకోర్ట్ తేల్చిచెప్పినా, ప్రభుత్వానికి మొట్టికాయలువేసినా రామకృష్ణారెడ్డి, జగన్ రెడ్డిల బుద్ధి మారలేదు. కేబినెట్ సబ్ కమిటీ, సిట్ వేసికూడా ఈప్రభుత్వం అమరావతిలో ఏదోజరిగిందని నిరూపించడానికి ప్రయత్నించి తీవ్రంగా భంగపడింది.

నారాయణ విద్యాసంస్థల్లో పదోతరగతి పరీక్షపత్రాలు లీక్ అయ్యాయని ప్రభుత్వం చెబుతుంటే, గతంలో బొత్ససత్యనారాయణ ఎక్కడా పేపర్ లీక్ కాలేదన్నాడు. నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసే గిరిధర్ రెడ్డిని పట్టుకొని, ఆయనఏదోచెప్పాడని నారాయణను అరెస్ట్ చేస్తారా? పదోతరగతి ప్రశ్నపత్రం లీకైతే నారాయణపొందే లబ్ధిఏమిటి? నారాయణను బదనాం చేసి, నారాయణవిద్యాసంస్థల్ని మూసేయించడమే ప్రభుత్వ లక్ష్యం.

ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఒప్పుకున్న మంత్రి పెద్దిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి…
నారాయణ అరెస్ట్ వ్యవహారంలో తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు ఒప్పుకున్న మంత్రిపెద్దిరెడ్డి అసలు మంత్రిగా పనికొస్తాడా? ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తాము పేపర్ లీకేజ్ నిందితులను పట్టుకున్నామని, వారుచెప్పిన సమాచారం ఆధారంగానే నారాయణను అరెస్ట్ చేశామని పెద్దిరెడ్డి చెప్పారు. అలాంటప్పుడు ఫోన్ ట్యాపింగ్ నేరంపై నారాయణను, తనప్రభు త్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కు బాధ్యుడిని చేస్తూ ముఖ్యమంత్రిని ఎందుకు అరెస్ట్ చేయ కూడదని ప్రశ్నిస్తున్నాం. నేరాలు చేసేదిప్రభుత్వమే… తిరిగి ఏమీ చేయని వారిని అరెస్ట్ చేసేది ప్రభుత్వమే.

అధికారంలో ఉన్నాం కదా..ఏమైనా చేస్తామంటే చేసుకోండి.. కానీ ప్రజల్ని నమ్మించడానికి దొంగనాటకాలు ఆడవద్దని ప్రభుత్వాన్ని, మంత్రులను హెచ్చరిస్తున్నాం. తప్పుడు ఆరోపణలతో ఎలాగైతే నారాయణ విద్యాసంస్థల ప్రతిష్టను మంటగలపాలని ప్రయత్నించారో, అదేవిధంగా తప్పుడు ఫిర్యాదుతో అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఈ ముఖ్యమంత్రి, ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రయత్నిస్తున్నారు. కావాలనే వారిద్దరూ తప్పుడు ఫిర్యాదులతో అమరావతిని అభివృద్ధి చేయకుండా, కోర్టు ధిక్కరణ ఆదేశాలనుంచి తప్పించుకో వాలని చూస్తున్నారు.

వాస్తవంగా ముఖ్యమంత్రి కేసులుపెట్టించాల్సింది.. తప్పుడు ఫిర్యాదు లుచేస్తున్న ఆళ్లపైనా.. ఫోన్ ట్యాపింగ్ నేరం ఒప్పుకున్న పెద్దిరెడ్డిపైనా . తనకు నచ్చనివ్యక్తు లు, పరిశ్రమలపై ముఖ్యమంత్రి కక్షసాధిస్తున్నాడు. ఆయన నిర్వాకంతోనే రాష్ట్రం వైపు పారిశ్రామికవేత్త లెవరూ కన్నెత్తి చూడటం లేదు. రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి లేకుండాచేస్తూ, పరిశ్రమలను తరిమేస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలుబుద్ధిచెప్పేరోజుదగ్గర్లోనే ఉంది.

గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమాన్ని గడపగడపకు మన ప్రభుత్వం అని పేరు ఎందుకు మార్చారు? వైసీపీనేతలు, ముఖ్యమంత్రిచేసిన తప్పులకు అధికారుల్ని బలిచేయా లనే ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా పేరు మారుస్తూ జీవోఇచ్చారా? ఇప్పటికే సీఐడీ, సీబీసీఐడీ, పోలీస్ విభాగాలు ఈ ప్రభుత్వం చేతిలో బలిపశువులు అయ్యాయి. ఇక మిగిలింది సాధారణ చిరుద్యోగులు, అందుకే గడపగడపకు మనప్రభుత్వం అంశాన్ని తెరపైకితెచ్చారు. ముఖ్యమం త్రి, ఆళ్ల రామకృష్ణారెడ్డి తప్పుడు ఫిర్యాదులు, కేసులతో తెలుగుదేశాన్ని ఏమీచేయలేరు.

LEAVE A RESPONSE