గుంటూరు: ప్రముఖ పారిశ్రామికవేత్త, టిడిపి నాయకులు తాడిశెట్టి మురళీమోహన్ జన్మదిన వేడుకలను ఇ వి.వి యువ వాహిని ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. గుంటూరు నవభారత్ నగర్ లో జరిగిన వేడుకలలో తాడిశెట్టి మురళీమోహన్ అభిమానుల సమక్షంలో జన్మదిన కేకును కట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మీయులు, కార్యకర్తల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోవటం సంతోషంగా ఉందన్నారు.
ఈవివి యువ కళావాహిని అధ్యక్షుడు వెచ్చా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. తాడిశెట్టి మురళీమోహన్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం తాడిశెట్టి మురళీమోహన్ చేతుల మీదుగా పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుంకర సతీష్ కుమార్, కొండబోయిన శీను, అన్నంరాజు సాయిరాం, అడపా కాశీ విశ్వనాథం, మాద రాధా తదితరులు పాల్గొన్నారు.