Suryaa.co.in

Andhra Pradesh Telangana

టీటీడీ లేఖలు ఆమోదించినందుకు థ్యాంక్స్ బాబూ!

– తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా స్థలాన్ని కేటాయించాలి
– మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు

హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను ఈనెల 24వ తేదీన నుండి అనుమతిస్తామని నిర్ణయం తీసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి, టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, పాలక మండలికి మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాటి ప్రభుత్వం రెండు రాష్ట్రాలను సమానంగా చూడడం జరిగింది. దాని ద్వారా ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కొత్తగా సిఫార్సు లేఖలను తీసుకోకపోవడం వల్ల తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి, వెంటనే ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని కోరడం జరిగింది.

తెలంగాణలో ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ అనే భేదం ప్రస్తుతం ఎలాగైతే ఉందో.. అదేవిధంగా తిరుపతి దేవునివద్ద కూడా ఆంధ్ర ప్రజా ప్రతినిధులకు ఎలాగైతే సదుపాయాలు కల్పిస్తారో, అదేవిధంగా తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఎలాంటి భేదం లేదు చేస్తే భేదాభిప్రాయాలు ఉండవు. యాదాద్రి, వేములవాడ, మన్యంకొండ, జోగులాంబ వంటి దేవాలయాలలో సమానంగా చూడడం జరుగుతుంది. దేవుని వద్ద వ్యత్యాసం లేకుండా చూడాలి.

తెలంగాణ నుండి ప్రతి రోజూ 350 మంది టూరిస్టులు గతంలో తెలంగాణ టూరిజం నుండి దర్శించుకునే వారు. లోపాలు, అక్రమాలు ఏమైనా ఉంటే వాటిని సరి చేసి, ఒక నిర్ణయం తీసుకొని ఆంధ్ర, తెలంగాణ టూరిజం నుండి ప్రజలకు సదుపాయాలను పునరుద్ధరించాలి.

తిరుపతిలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు స్థలాన్ని ఏ విధంగా అయితే కేటాయించారో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా స్థలాన్ని కేటాయించాలని కోరారు.

LEAVE A RESPONSE