• చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపిన జగన్ రెడ్డి, మరోపక్క యథేచ్ఛగా టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నాడు
– టీడీపీ శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు
రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధించడానికి జగన్ రెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయా ల్సిన విచారణ సంస్థల్ని జేబు సంస్థలుగా మార్చి, తప్పుడు కేసులతో తెలుగుజాతి కోసం పనిచేస్తున్న దేశం గర్వించే నాయకుడిని అక్రమంగా జైలుపాలు చేశాడని టీడీపీ శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“భావితరాల కోసం రాష్ట్రప్రజల సుఖసంతోషాల కోసం పనిచేసే నాయకుడికి ఈ పరిస్థితి కల్పించినందుకు జగన్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకుంటాడు. క్రమశిక్షణ, నిజాయితీ తో వ్యవహరించే పెద్దాయన్ని మానసికంగా హింసించడం, అక్రమంగా అరెస్ట్ చేయడం తెలుగుజాతికే అవమానకరం..బాధాకరం.
తానే కాదు చంద్రబాబు తప్పుచేశాడు… జైలుకెళ్లాడని ప్రజల్ని నమ్మించడానికే జగన్ రెడ్డి ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు
వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటినుంచీ చంద్రబాబుని ఏదోరకంగా తప్పుడు కేసుల్లో ఇరి కించాలని అనేక ప్రయత్నాలు చేశారు. చిన్న తప్పు చేయని, ఎలాంటి అవినీతి మరక లేని చంద్రబాబుని ఏదోరకంగా జైలుక పంపాలని నాలుగేళ్లుగా కలలుగన్న జగన్ రెడ్డి, చివరకు కుట్రపూరితంగా తాను అనుకున్నది చేశాడు. నిండా అవినీతిలోమునిగి 38 కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి నాతో పాటు చంద్రబాబుని కూడా జైలుకుపంపించి, తప్పుచేశాడని ప్రజల్ని నమ్మించడానికే ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు.
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో అవినీతి అని ఈ ప్రభుత్వం 20నెలల క్రితం కేసుపెడితే, దానిలో ముద్దాయిలుగా పేర్కొన్నవారందరికీ ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాంటి కేసును మరలా తిరగదోడి, ఆప్పుడు లేని చంద్ర బాబు పేరుని ఇప్పుడుచేర్చి కుట్రపన్ని అన్యాయంగా ఆయనపై కక్ష తీర్చుకున్నారు.
విభజనానంతర రాష్ట్రంలోని యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించడాలనే సదుద్దేశంతో చంద్రబాబునాయుడి ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది.
దానిలో 2,13,000 మంది యువత శిక్షణ పొందితే, వారిలో 70 వేల మందికి ఉపా ధి, ఉద్యోగాలు లభించాయి. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఏర్పడిన శిక్షణా కేంద్రాల్లో అన్నిరకాల పరికరాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉందని, కేంద్రాలు బాగా పనిచేస్తున్నాయని ఈ ప్రభుత్వం కూడా తొలుత ధృవీకరించుకుంది. ఏమీ లేని దానిలో ఏదో తప్పుజరిగిందని కట్టుకథలు అల్లి చంద్రబాబు పేరు ఇరికించి, ఆయన్ని అన్యాయంగా జైలుకు పంపారు.
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో అవినీతిజరిగిందని చెబుతున్న వైసీపీప్రభుత్వం, సీఐడీ ఆనాడు సదరు ప్రాజెక్ట్ అమల్లో కీలకంగా వ్యవహ రించి, ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అజయ్ కల్లం, ప్రేమచంద్రారెడ్డిలను ఎందుకు విచారించలేదు? వారికి కేసుతో సంబంధం లేకపోతే చంద్రబాబుకి ఎలా సంబంధముంటుంది? దీన్ని బట్టే ఈ కేసులో ఉన్న కుట్రకోణం అర్థమవుతోంది.
చంద్రబాబు జీవితం మొత్తం పోరాటాలు, ఆటుపోట్ల మయమే. ఆదిలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయడానికి ఎందరో అనేక కుట్రలు పన్నితే వాటన్నింటినీ చంద్రబాబు సమర్థవంతంగా ఎదుర్కొని తెలుగుప్రజలకోసం మొక్కవోని ధైర్యంతో నిలిచారు. జీవిత మంతా నిస్వార్థంతో కష్టంతో పనిచేసిన వ్యక్తి, ప్రజలకోసం పరితపించి, యువత బాగు కోసం పాటుపడిన చంద్రబాబు విషయంలో జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులకు చలించి ఎంతో మంది బలిదానాలకు పాల్పడుతున్నారు.
చంద్రబాబుపై సీఐడీ పెట్టింది ముమ్మాటికీ తప్పుడు కేసే, ఆయన రూపాయి అవినీతి చేశాడని ఎలాంటి ఆధారాలు కోర్టుకు చూపలేకపోయింది
జగన్ రెడ్డిపై 11 సీబీఐ, 7 ఈడీ కేసులుంటే, ఇతరత్రా కేసులు 20కిపైగా ఉన్నాయి. లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలతో పాటు, రూ.43వేలకోట్ల అక్రమాస్తులు ఉన్నాయని ఈడీ నిర్ధారించింది. 5వేలకోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ జప్తుచేసింది.. అవినీతికి పాల్పడినట్టు నేరం నిరూపితమై 16నెలలు జైల్లో ఉండి వచ్చాడు. అలాంటి వ్యక్తి చంద్రబాబుని తప్పుడు మనిషిగా చిత్రీకరించడానికి వ్యవస్థ ల్ని దుర్వినియోగం చేసి, తాను అనుకున్నది సాధించాడు.
చంద్రబాబుపై నేడు సీఐడీ పెట్టిన కేసులో ఎక్కడా రూపాయి అవినీతి జరిగిందని నిరూపించలేకపోయారు. ఎక్కడా డబ్బులు ఒకరినుంచి మరొకరికి వెళ్లాయనే ఆధారాలు లేవు. అవినీతి సొమ్ము 10రూపాయలు రికవరీ చేసిన సందర్భాలు లేవు. కేవలం తనకు అంటిన అవినీతి మరకల్ని చంద్ర బాబుకి రుద్ది, ఏదోరకంగా ఆయన్ని ప్రజల్లో పలుచన చేయడానికే జగన్ బరి తెగించా డు. దేశమంతా జీ20 సదస్సు గురించి మాట్లాడుకుంటే, ఏపీలో మాత్రం చంద్రబాబు విషయంలో జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం వ్యవహరించిన దుర్మార్గపు విధానాలను తప్పుపట్టారు.
పోరాటపటిమ, నిజాయితీ ఉన్న కార్యకర్తలు ఉన్నంతవరకు టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరు
చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ ప్రజలంతా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేతకు కలిగించిన బాధ, ఆవేదన కంటే వందరెట్లు మన ప్రత్య ర్థికి కల్పించేవరకు విశ్రమించకూడదని, దుర్మార్గపు ప్రభుత్వంపై పోరాడటానికి అన్ని విధాలా సన్నద్ధం కావాలని టీడీపీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం.
చంద్రబాబుతో మొదలైన అక్రమ అరెస్టుల పర్వం, గ్రామస్థాయి వరకు కొనసాగుతుంద నడంలో ఆశ్చర్యం లేదు. ఎవరిని అరెస్ట్ చేసినా, ఎందరిని జైళ్లకు పంపినా,టీడీపీ బలం పోరాటపటిమతో కూడిన నిజాయితీపరులైన కార్యకర్తలే. వారున్నంత కాలం టీడీపీని ఎవరూ ఏమీచేయలేరు. వికృతక్రీడ మొదలపెట్టిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే తగినవిధంగా బుద్ధిచెబుతారు. ప్రజలు వైసీపీని, జగన్ రెడ్డిని రాష్రంనుంచి సాగనం పేవరకు ప్రతి టీడీపీ కార్యకర్త గట్టి పట్టుదలతో గుండెధైర్యంతో పనిచేయాలి.
చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపిన జగన్ ప్రభుత్వం, యథేచ్ఛగా అర్హుల ఓట్లు తొలగించే పనిలో నిమగ్నమైంది
అన్యాయంగా తెలుగుదేశం అధినాయకుడిని జైల్లో పెట్టిన ప్రభుత్వం, మరోపక్క యథేచ్ఛగా దొంగఓట్లు సృష్టిస్తూ, టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తోంది. ఫామ్-6, ఫామ్-7 తో పాటు,ఇతర దరఖాస్తుల్ని తప్పుడు చిరునామాల తో గంపగుత్తగా సృష్టిస్తూ, అర్హులైన ఓట్లను తొలగిస్తున్నారు.
టీడీపీ నేతలు, కార్యకర్త లు చంద్రబాబునాయుడికి జరిగిన అన్యాయానికి బాధపడుతుంటే, గతవారం రోజుల్లో వైసీపీప్రభుత్వం ఫామ్-7 దరఖాస్తులు లక్షలసంఖ్యలో సృష్టించి, ఓట్లు తొలగించే తంతుని నిర్విరామంగా కొనసాగిస్తోంది. అధినేత గురించి ఆందోళన చెందకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలు క్షేత్రస్థాయి నుంచే వైసీపీ దుర్మార్గాలను కట్టడి చేయాలి.” అని విజ్ఞప్తి చేస్తున్నాం.