Suryaa.co.in

Andhra Pradesh

ఆ కానిస్టేబులే నేటి యుపిఎస్సీ ర్యాంకర్

– పట్టుదలంటే..ఉదయ్ కృష్ణారెడ్డిదే

ప్రభుత్వ స్కూల్లో చదివి, సీఐ అవమానించడంతో కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసి.. సివిల్ ర్యాంక్ సాధించాడు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం, ఊళ్లపాలేనికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాడు. కూరగాయలు అమ్మి తన నానమ్మ తనను చదివించింది. చిన్నప్పటి నుండి ప్రభుత్వ స్కూల్లో, కాలేజీలో చదివిన ఉదయ్, 2019లో సీఐ అవమానించడంతో కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసి, సివిల్స్ వైపు మళ్లాడు. యూపీఎస్సీ సివిల్స్‌లో ఫలితాల్లో ఆల్ ఇండియా 780వ ర్యాంక్ సాధించాడు.

LEAVE A RESPONSE