రాజధాని లేని ఆంధ్ర ఇప్పుడు సీఎం జగన్మోహన్‌రెడ్డి అరాచక విధానాలతో అరాచకాంధ్రప్రదేశ్‌గా మారిందని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపి రావుల చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. జగన్ తీరు చూసి కొత్త పారిశ్రామికత్తలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు పారిపోతున్నాయని ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన తమ పార్టీ కార్యకర్తల చర్యను కనీసం ఖండించని వైసీపీని చూసి తెలుగుజాతి సిగ్గుపడుతోందని అన్నారు.
మంగళగరి టీడీపీ ఆఫీసుపై వైసీపీ దాడికి నిరసనగా.. సికింద్రాబాద్ పార్లమెంటు టీడీపీ ఆఫీసులో, అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా ఆధ్వర్యంలో నిర్వహించిన మౌనదీక్ష కార్యక్రమానికి రావుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రావుల మాట్లాడుతూ, ఆంధ్రాలో రాజ్యమేలుతున్న అరాచకశక్తులపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ దేశానికి ప్రధాని, రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్లను నియమించిన బాబును, బొడ్డూడని వైసీపీ నేతలు దుర్భాషలాడటం దారుణమన్నారు. బాబు వయసంత లేని మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు చూసి మహిళలు సిగ్గుపడుతున్నారన్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వైసీపీ దుండగులను శిక్షించి, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.
అధ్యక్షుడు సాయిబాబా మాట్లాడుతూ ఏపీలో జరుగుతున్న పరిణామాలను చూసి, ప్రతి తెలుగువాడు సిగ్గుతో తలదించుకుంటున్నాడన్నారు. దౌర్జన్యాలే ఇంటిపేరుగా మారిన జగన్‌కు రాజకీయంగా పతనం ప్రారంభమైందన్నారు. ఏపీలో రాష్ట్రపతిపాలన విధించి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల కిశోర్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జులు, సీనియర్లు బాలరాజ్‌గౌడ్, రాజాచౌదరి, బిల్డర్ ప్రవీణ్, రవీంద్రాచారి, కొమరయ్య, ఎంకె బోస్, విజయశ్రీ, ప్రమీల, అన్నపూర్ణమ్మ, ప్రకాష్, గౌరీశంకర్, రాజు, కట్టా రాములు తదితరులు పాల్గొన్నారు.