తాజా జిఎస్డిపి సమీక్షలో లీనమైన చిత్రం మొదటిది. రెండవది రెండేళ్ల క్రితం కుట్రతో అరెస్ట్ చేస్తే.. కిటికీలో చూస్తున్న దృశ్యం. రేపు వివాహ వార్షికోత్సవం అనగా.. కుట్రను అమలు చెయ్యమని ఆదేశించిన దుర్మార్గుడు దేశంలో లేడు.
కౌరవ సభలో “ధర్మరాజు కోపము దహనాగ్నికన్న గడుగున్, అది పుట్టగా గగనమందు గరుతమున్; అది జ్వలించగ దిక్కులెల్ల నశించును, అది పుట్టక మునుం దానిని పొడిచిననైన! (ధర్మరాజు కోపం అగ్నికన్నా భయంకరమైనది. అది జ్వలిస్తే ఆకాశాన్నే తాకుతుంది, అన్ని దిక్కులూ దగ్ధమవుతాయి. అందువల్ల ఆయన కోపం పుట్టకముందే ఆపడం అవసరం)” అని శ్రీకృష్ణుడు హెచ్చరిస్తాడు.
కానీ అరెస్టు అయ్యాక శ్రేణులను కూడా సముదాయిస్తూ చట్టం న్యాయానికి సహకరిస్తూ.. శాంతంగా వెళ్లారు. ఆ శాంతం నలు దిక్కులా కోపంగా మారి తెలుగు ప్రపంచాన్ని చుట్టేసింది. అయోధ్య రాముని వనవాసం, పాండవ వనవాసం లెక్కన చూస్తూ భరించ లేకపోయారు జనం.
ఆయన సమకాలికుల నుండి నేటి తరం వరకు ఆయన 30 ఏళ్ల క్రితం సీఎం అయ్యాక ఎప్పుడూ అన్ని రోజులు టీవీలో అయినా చూడకుండా వున్నది లేదు. బంధించిన ఆ 52 రోజులు ప్రపంచంలో వున్న తెలుగు వారి గుండెల్లో ఒక బడబాగ్నిని సృష్టించింది. సంఘీభావాలు హోరెత్తాయి. తెలుగు సమాజం ఆక్రోశించింది. ముందుగా పరిహసించిన పొరుగు పొగరును దించింది.
ఇవాళ “భవతీ భిక్షాం దేహీ” లెక్కన “బాబూ ప్రతిపక్షహోదా ఇవ్వండి” అంటున్నా.. ప్రజలు ఇవ్వనిది నా చేతుల్లో ఏముంది అని ధర్మబద్దంగా చెప్పేశారు.
ఇలా జనం తపస్సులో వుండే రిషి జోలికి ఆ రోజు వెళ్లకుండా వుండి వుంటే బహుశా ప్రతిపక్ష హోదా కోసం బిక్ష అడిగేది తప్పేదేమో.