మన బాధ్యత అయినా.. కొన్ని సార్లు డెడ్ లైన్, టార్గెట్ లను ప్రెజర్ అనుకుంటాం మనం. ఈయన ప్రైవేటు అమెరికన్ కంపెనీ సీఈఓ. మన ప్రభుత్వ టార్గెట్, డెడ్ లైన్లు ఆయన పాటించాల్సిన అవసరం లేదు.
2025 క్యాలెండర్ మొదటి పేజీలో నెల చివరన అనుకున్నారు. రెండేళ్లు పడుతుంది, 2026 చివరన అవుతుందని అంచనా వేశారు. కుదరదు ఏడాది గడువు అన్నారు. సవాల్ గా తీసుకున్నాడు. 2025 చివరి నెల పేజీ వుండగానే 11 నెలల్లో తానేమిటో చూపించాడు. తాత్కాలిక సెటప్ పూర్తి చేసుకుని, 500 మంది ఉద్యోగుల రీలొకేషన్లు అడ్జెస్ట్ చేసి, 11 నెలల్లో వైజాగ్ లో అడుగుపెట్టాడు. ఎవరెవరు వస్తారు అంటే 4500 మంది ఉద్యోగులు వస్తామన్నారు.
సెటప్ సరిపోదు. బెంగుళూరులో విమానం ఎక్కుతూ.. తను పుట్టిన వైజాగులో 10,000 ఉద్యోగులను తమ కాగ్నిజెంట్లో పెట్టాలనుకున్నాడు. దిగాక 20 వేలు చేసుకో అన్నారు. చివరికి 25000 మందికి ఇవ్వండి అంటే ఆ టార్గెట్ ను బాధ్యతగా తీసుకున్నారు.
ఎందుకు?
ఇటీవల తరచూ.. మనం పుట్టిపెరిగిన ప్రాంతానికి మనం తిరిగి ఇవ్వాలి అని చెబుతున్నాడు మన నాయకుడు చంద్రబాబు. రవికుమార్ అమెరికా వెళ్లి సీఈఓ కాక ముందు హైదరాబాద్ లో పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రా సీఈఓ అని ప్రకటించుకొని పనిచేసి, దాన్ని మార్చేసిన దార్శనికుడిని చూశాడు, ఆయన మాటలు ఈయన మీద ప్రభావం చూపాయి.
ఆయనే కాదు ఇంకో ఫ్లూయెంట్ గ్రిడ్ సీఈవో మురళి కుమార్ కూడా వైజాగ్ వాసే.
తమ ప్రాంతాలల్లో కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతున్నారు. అన్ని సందేహాలను తీర్చాడు లోకేశ్. రాత్రీ పగలు కష్టపడ్డారు అందరూ. నిన్న నవ శంకుస్థాపనలు సాకారం అయ్యాయి. ఎవరు ఊహించారు ప్రస్తుత ప్రపంచ పరిస్థితులలో మన రాష్ట్రానికి ఇలా వస్తారని? ఇన్ని వస్తాయని. గూగుల్ కూడా వస్తుందని. కలకూడా కనలేదు.
ఈ స్పీడ్, ఈ కంపెనీలు, గూగుల్ మన రాష్ట్ర షోకేస్ లో దావోస్లో మరిన్ని పెట్టుబడులును ఆకర్షిస్తాయి. నమ్మకం కలిగిస్తాయి. ఒక యుద్ధమే చేశారు. అత్యవసరం కూడా.
ఒక నమ్మకంతో ఉత్తరాంధ్రాను టెక్ ఆంధ్రాగా మార్చే మొదటి బ్యాచ్. ఇలాంటి సమయంలో సెల్యూట్ చేసి గర్వంగా ఫీల్ అవుతూ.. యువతలో ఆత్మస్థైర్యం నింపాల్సిన సమయం.
సోషల్ మీడియా ఉంది కదా అని పునాది నుండి పీక్కుంటున్నారు, రాజకీయంగా క్యాడర్ అసంతృప్తిగా ఉన్నారు, భజన అంటూ విమర్శలు.
పండగ సమయంలో ఆనందించాలి. మన ప్రాంతంలో కాదు అనే బాధ, అసూయ మనసులో ఉంటే రాష్ట్రం కోసం ఊరుకోవాలి. ఆ ప్రాంతంలో వారి ఆశల మీద, నమ్మకాల మీద నీరు చల్లుతూ.. పెట్టుబడులు వచ్చినా లాభం లేదు అని ఓటి కుండ కబుర్లు చెప్పకూడదు. పండుగవేళ అశుద్దం మనుషులు ఎవరూ చల్లరు. పార్టీ కార్యకర్త కాదు అని పదే పదే చెబుతూ.. పార్టీ కార్యకర్తల చిన్న చిన్న బాధలను ఈ పండగ సమయంలో కెలికే మనస్తత్వాన్ని ఏమనుకోవాలి? ఇంత పెద్ద పార్టీలో అలకల నుండి అన్నీ ఉంటాయి. ఏ రాజకీయ పార్టీలో వుండదు.
అది చాలదన్నట్లుగా అమరావతిలో ఇరవై వేల ఎకరాలు మిగులుతాయి ప్రభుత్వం దగ్గర అనే మరో విష ప్రచారం. రాష్ట్రంలో నేను వ్యాపారం చెయ్యడం లేదు, పొరుగున చేస్తాను అనేది వ్యక్తిగత నిర్ణయం. ఎవరూ తప్పు పట్టరు. మీరూ నమ్మాలి అని ఎవరూ చెప్పడం లేదు.
సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. సమాజంలో బాధ్యత కూడా ఉండాలి. అప్పుడే గౌరవిస్తారు. ఆ విలువను పోగొట్టుకోకూడదు, చేజేతులా.
అలాగే కోట్లాది ప్రజల ఆకాంక్షలతో.. మనోభావాలతో అర్థం పర్థం లేకుండా అభిమానం ముసుగులో ఆడుకోకండి. ఒక పనికిమాలిన, సచ్చిన విష సర్పాన్ని చూపి, భయపడడం మానుకోండి. గడప దగ్గర వాడో కమెడియన్ ఇప్పుడు. మీరూ కాకండి. 4 దశాబ్దాలలో వాడు తొలి, చివర కాదు. వాడు కాకపోతే ఇంకోడు. మరో 4 దశాబ్దాలలో కూడా పార్టీ చెక్కు చెదరదు.
గమనిక : ఎవరో చెబితే వ్రాయాల్సిన అవసరం నాకు లేదు. నాకు అలా ఎప్పుడూ చెప్పలేదు కూడా. రామారావు తొలి 9 నెలల్లో.. నా నాలుగో క్లాసులో మండలం మొత్తం స్లోగన్లు చెప్పడానికి స్కూలు నుండి వెళ్లి వ్యాన్ ఎక్కాను. అప్పటి నుండి పార్టీని చూస్తున్నా.. గమనిస్తున్న.. ప్రయాణిస్తున్నా. వ్రాయడం మాత్రమే కాదు బూతు వద్ద కూడా పనిచేస్తా. సమాజ బాధ్యతగా భావించి వ్రాశాను. మనోభావాలు దెబ్బతింటే క్షమించండి.
– చాకిరేవు