Suryaa.co.in

Andhra Pradesh

అర్చకుడు పై దాడి చేసిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలి

అమరావతి: తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో పనిచేస్తున్న వంశపారంపర్య అర్చకుడు బాపేశ్వర శర్మను స్థానికంగా ఉండే కొండవీటి వెంకయ్య పై భౌతిక దాడి చేసిన సందర్భంలో అర్చక బ్రాహ్మణ సంఘాల సూచనలతో స్థానిక తాడికొండ పోలీస్ స్టేషన్లో నిన్న కేసు నమోదు చేశారు. అయినప్పటికీ నిందితుడిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు.

అయితే నేటి సాయంత్రం ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛత సేవా సంఘం ప్రధాన కార్యదర్శి జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి, బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో దాడికి గురైన అర్చకున్ని పరామర్శించి,దాడి జరిగిన దేవాలయం ముందు దాడి చేసిన నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేయాలని ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా అర్చక బ్రాహ్మణ సంఘ నేతలు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దేవాలయ అర్చకులపై దాడులు 40 సంఘటనలు జరిగాయని అప్పుడు కూడా అర్చక, బ్రాహ్మణ సంఘాలు వీటిపైన పోరాటాలు చేశారని, దేవాలయాల్లో అర్చకులకు రక్షణ లేకుండా పోయిందని, అర్చక వ్యవస్థ లేకపోతే దేవాలయాలు మనుగడు సాధించడం కష్టమని,దీనిపైన గ్రామాల్లో స్థానిక పెద్దలే నిర్ణయాలు తీసుకోవాలని, ఈ రకంగా భౌతిక దాడులు నిర్వహిస్తే భవిష్యత్తులో అర్చక వ్యవస్థ కనుమరుగు కాక తప్పదని హెచ్చరించారు.

సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత గ్రామస్తులలో ప్రతి ఒక్కరికి ఉందని తెలియజేశారు. స్థానిక తాడికొండ ఎస్ హెచ్ ఓ కు తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన ఉద్యమం చేపడతామని నాయకుల హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అర్చక,బ్రాహ్మణ సంఘం నాయకులు యనమదల ఆంజనేయులు, జిల్లా ఆదిశైవ సంఘ అధ్యక్షుడు కొలకలూరు శ్రీనివాస్ శర్మ, ఐలూరి శ్రీనివాస్ శర్మ, ప్రత్తిపాటి మాధవ శర్మ, తాడికొండ పవన్ శర్మ, పోగుల మురళీకృష్ణ, కొడవటి గంటి నాగ పార్వతీశ్వర శర్మ, కొల్లిపర నాగ కోటేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE