– మంత్రి సవిత
పెనుకొండ: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ఎన్డీయే కూటమి ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజవర్గం పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని 12, 13వ వార్డుల్లో మంగళవారం జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫించన్ దారులతో మంత్రి సవిత మాట్లాడారు. చంద్రన్న ప్రభుత్వం ఎలా ఉంది? ఫింఛన్ ఎంత వస్తోంది? సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని, ఇచ్చిన మాటలన్నీ తప్పి జగన్ మాట, మడమ తిప్పేశారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవగానే ఇచ్చిన మాట ప్రకారం ఫించన్ పెంచారని తెలిపారు.
పెనుకొండ టౌన్ లో అమృత్ స్కీం ద్వారా 87 కోట్ల తో ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకులు, పైప్ లైన్ ఇంటింటికీ కొలాయి ద్వారా నీటి మంచినీటి అందజేస్తామని, అదేవిధంగా సెంటర్ లైటింగ్ కి 10 లక్షల రూపాయలతో ప్రతిపాదనలు కూడా పంపామని, డివైడర్స్ కు మధ్యలో ప్లాంటేషన్ కోసం లక్ష రూపాయలు కేటాయించామని, కాలువల మరమ్మతుకు, కాలువల్లోని వ్యర్థాలు తొలగించేందుకు 11 లక్షల రూపాయలతో నిధులు కేటాయించామని వెల్లడించారు. అలాగే, అదేవిధంగా రైల్వే స్టేషన్ రోడ్డు, కోనాపురం రోడ్డుకి ప్రతిపాదనలు పంపామని, టీటీడీ కల్యాణ మండపం కోసం ఆరు కోట్లతో మూడు అంతస్తుల నిర్మించడానికి టీటీడీ వారు ఆమోదించారని చెప్పారు.