-కేంద్ర మాజీ మంత్రి Dr.CHINTA MOHAN
కాపు, బలిజలకు రాజ్యాధికారం తీసుకొస్తాం. 2024లో రాజ్ భవన్ లో ముఖ్యమంత్రి గా ప్రమాణం చేయబోయేది కాపు, బలిజ వ్యక్తే. కాపు ముఖ్యమంత్రి కి శాలువా కప్పే వరకు నా ప్రయత్నం ఆగదు. రాష్ట్రంలో 5 కోట్ల జనాభా ఉంటే, కోటి మంది కాపు, బలిజలు ఉన్నారు. వీరు ఒక్క రోజు కూడా అధికారం చూడలేదు. చంద్రబాబు, జగన్ బాబుల కంటే, కాపు, బలిజలలో అందగాళ్లు, తెలివైన వాళ్ళు లేరా??
చంద్రబాబు నాయుడూ..14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసింది చాలు… ఇక సర్దుకో..!! 3 శాతం ఉన్న సామాజిక వర్గం 25ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించింది. 3 శాతం ఉన్న మరో సామాజిక వర్గం 45 ఏళ్లు అధికారం అనుభవించింది. మళ్ళీ సీయంగా చంద్రబాబు, జగన్ బాబు ఇద్దరూ వొద్ధు. కాపు, బలిజలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. అధికారంతో ఆర్థికంగా ఎదగలరు. మంచి పరిపాలనా దక్షుడు, ప్రజామోదం కలిగిన కాపు, బలిజ వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావలసిన అవసరం ఉంది.
అమరావతి విషయంలో చంద్రబాబుది తొందరపాటు. క్రెడిట్ అంతా తనకే దక్కాలనే దురాలోచనతో, ఆనాడు ప్రధానిచే భూమి పూజ చేయించారు. చంద్రబాబు వల్లే, అమరావతి రైతులు నేడు కష్టాలు, ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడనో, పల్నాడు ఏరియానో రాజధానిగా చేసి ఉంటే బాగుండేది. తన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతి రైతులను చలిలో తిప్పుతున్న చంద్రబాబు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు తిరుపతికి, మన రాష్ట్రానికి చేసిందేమిటి??
తిరుపతి మహిళలకు వచ్చిన 7008 రెండు బెడ్ రూం ఇండ్లు, దుగరాజపట్టణం ఓడరేవును ఆపిన చంద్రబాబు, ఈ ప్రాంత ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి. నిరుద్యోగం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆకలి కేకలు ఎక్కువగా వినిపిన్నాయి. వర్షాలు, వరదలు వల్ల పంటలు కొట్టుకుపోయాయి. రైతులు నష్టపోయారు. వారిని ఆదుకోవాలి. 80లక్షల మంది SC, ST, OBC, మైనారిటీ విద్యార్థులు రెండు సంవత్సరాల గా వారికి రావాల్సిన వేల కోట్లు స్కాలర్షిప్లు రాక, కన్నీటితో ఉన్నారు. విద్యార్థులు, వారి తల్లీదండ్రులు బాధతో, భయంతో రోజులు గడుపుతున్నారు.
మన దేశ తొలి ప్రధాని నెహ్రూ గారు తెచ్చిన సోషల్ వెల్ఫేర్ స్కాలర్షిప్లు, హాస్టల్స్ రాష్ట్ర ప్రభుత్వం ఆపింది. వేల కోట్లు రూపాయలు సొంత ప్రయోజనాలు కొరుకు, ఆయన తన పేరు పెంచుకునేదాని కొరుకు జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరు ముద్ద అమలు చేస్తున్నారు. Taxpayers డబ్బును తన పేరు పెంచుకునేదాని కొరుకు ప్రయత్నం చేయడం తప్పు.2022 నుంచి జగనన్న పేరుతో అమలు చేస్తున్న పథకాలకు తిరిగి పాత పేర్లే కొనసాగించి, అమలు చేయాలి. కేంద్ర బిజెపి ప్రభుత్వ పనితీరు చాలా అధ్వానంగా ఉంది.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నిఘా, హోం శాఖలు ఘోరంగా వైఫల్యం చెందాయి.భారత్ లో జరిగే Smuggling గురించి అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించాయి. కేంద్ర ఆర్థిక శాఖ GST పేరుతో వసూలు చేసే డబ్బు ఎక్కడికి పోతుంది?? ఇడ్లీ పై పన్ను, బట్టలు ఉతకడంపై పన్ను, హేర్ కట్టింగ్ పై పన్ను మోపడం దుర్మార్గపు చర్య. వివిధ రకాలుగా సెజ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నులు, ఖర్చులపై ప్రజలకు సమాధానం చెప్పాలి.