– జగన్ రెడ్డి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై రైతు కోసం తెలుగుదేశం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 13 నుంచి 17 వరకు 5 రోజుల పాటు నిరసనలు
– జగన్ రెడ్డి రైతులకు చేస్తున్న అన్యాయం, మోసాన్ని ప్రజల్లో ఎండగట్టాలి
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
వైసీపీ పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో పడిందని, జగన్ రెడ్డి రైతులకు చేస్తున్న మోసం, అన్యాయాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు తెలుగుదేశం పార్టీ రైతు కోసం తెలుగుదేశం పేరుతో ఈనెల 13వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష్యులు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. శనివారం నాడు 25 పార్లమెంటరీల టీడీపీ అధ్యక్షులు, 175 నియోజకవర్గాల టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్ చార్జులతో అచ్చెన్నాయుడు టెలికాన్పరెన్స్ నిర్వహించారు.
ఈ టెలికాన్పరెన్స్ లో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ….. జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు, రైతుల పట్ల నిర్లక్ష్య తీరుకు నిరసనగా రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం పేరుతో ఈనెల 13 వ తేదీ నుంచి 17 వరకు తేదీ వరకు జోన్ల వారీగా రాష్ర్టంలోని 5 జోన్లలో రోజుకొక జోన్ లో నిరసనలు తెలపాలని పార్టీ అదిష్టానం నిర్ణయించింది. ఈ నిరసన కార్యక్రమాల్లో 25 పార్లమెంటరీ పార్టీ అద్యక్ష్యులు, 175 నియోజకవర్గాల ఇన్ చార్జులు, ఎమ్మెల్యేలు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అచ్చెన్నాయుడు కోరారు.
రైతు కోసం తెలుగుదేశం నిరసన కార్యక్రమాల వివరాలు
13 .09.2021 జోన్ – 1
అరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంట్లలోని 35 నియోజవకర్గాల్లో నిరసనలు
14.09.2021 – జోన్ – 5
నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందూపురం, కడప పార్లమెంట్లలోని 35 నియోజకవర్గాల్లో నిరసనలు
15.09.2021 – జోన్ – 2
కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు పార్లమెంట్ లలోని 35 నియోజకవర్గాల్లో నిరసనలు
16.09.2021 – జోన్ – 4
ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, రాజంపేట, చిత్తూరు పార్లమెంట్ లలోని 35 నియోజకవర్గాల్లో నిరసనలు
17.09.2021 – జోన్ -3
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నర్సరావు పేట, బాపట్ల పార్లమెంట్ లలోని 35 నియోజకవర్గాల్లో నిరసనలు