Home » జగన్ ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీలకు అడుగడుగునా అన్యాయమేనా?

జగన్ ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీలకు అడుగడుగునా అన్యాయమేనా?

– కర్నూల్లో అక్బర్ బాషా భూమిని స్థానిక వైసీపీ నేత తిరుపాల్ రెడ్డి ఆక్రమిస్తే, సీఐ కొండారెడ్డి, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కలిసి తిరిగి బాషానే బెదిరిస్తారా?
– ఇదేనా జగన్ ప్రభుత్వంలో మైనారిటీలకు జరుగుతున్న న్యాయం?
• జగన్మోహన్ రెడ్డికి చెప్పుకున్నా నీకున్యాయంజరగదని బాషాని సీఐ బెదిరించాడు.
• అబ్దుల్ సలాం, అబ్దుల్ సత్తార్.. దాచేపల్లిలో అలీషాల ఉదంతాలు మరువకముందే, బాషా ఆవేదన, ఆయనకుజరిగిన అన్యాయాన్ని చూస్తున్నాం.
* టీడీపీ అధికారప్రతినిధి నాగుల్ మీరా
రాష్ట్రంలో మైనారిటీ ముస్లింలు జగన్మోహన్ రెడ్డికి ఏం ద్రోహం, అన్యాయం చేశారో ఆయనే సమాధానంచెప్పాలని, మైనార్టీలపై వరుసగా జరుగు తున్న దాడులపై ఆవర్గానికిచెందిన వ్యక్తిగా తాను తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నానని, ఇలాంటి పరిస్థితి రావడానికి ఈ ముఖ్యమంత్రి కారకుడు కాడా అని టీడీపీ అధికారప్రతినిధి నాగుల్ మీరా గద్గదస్వరంతో ప్రశ్నించారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాల యంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
కర్నూలు జిల్లా నంద్యాలలో గతంలో దారుణాతిదారుణమైన ఘటనజరిగింది. ఆ ఘటన యావత్ సమాజాన్ని తీవ్రంగా కలచివేసింది. అబ్దుల్ సలాం అనేఅతనిపై దొంగతనం నేరంమోపడంతో, తనభార్యాపిల్లలతో సహా రైలుపట్టాలపై పడుకొని ఆత్మహత్యకు పాల్పడ్డా డు. అబ్దుల్ సలాం బలవన్మరణం ఘటన మరువకముందే, అక్బర్ బాషా ఆవేదన బయటకువచ్చింది. బాషాకు ఎకరంన్నర పొలం ఉంది. 30ఏళ్లనుంచి ఆ భూమి, అతని కుటుంబం స్వాధీనంలోనే ఉంది. దాన్ని అతడే సాగుచేసుకుంటున్నాడు. 2009లో సదరు భూమి రిజిస్ట్రేషన్ కూడా అయింది. సదరు భూమిపై వైసీపీ మండలస్థాయి నాయకుడి కన్ను పడింది. దాంతో అతను దౌర్జన్యంగా బాషా పొలంలో వరినాటు వేయించడానికి సిద్ధమయ్యాడు.
దాంతో బాషాకు దిక్కుతోచక కర్నూలు జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు. బాషా ఫిర్యాదును జిల్లా ఎస్పీగారు, మైదుకూరు సీఐకి పంపారు. బాషా మైదుకూరు సీఐని కలిసి న్యాయం చేయమని వేడుకున్నాడు.
బాషా ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన సీఐ, న్యాయం నీవైపే ఉంది.. తప్పకుండా నీసమస్య పరిష్కారమవు తుందని బాషాతో నమ్మబలికాడు. కానీ స్థానిక ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సీఐతో మాట్లాడటంతో, న్యాయం జరగాల్సిన అక్బర్ బాషా కుటుంబానికి అన్యాయం జరగడం మొదలైంది. దాంతో ఏంచేయాలో పాలుపోని బాషా చివరకు “తాను వైసీపీ కార్యకర్తనేనని, తనకున్యాయం చేయాలని” వెళ్లి ఎమ్మెల్యేను కలిసి ప్రాధేయపడ్డాడు. బాషా ఎంతలా ఎమ్మెల్యేను ప్రాధేప డినా, అతని కాళ్లావేళ్లా పడ్డా రఘురామిరెడ్డి మనసుకరగలేదు.
“బాషా నీకు నేను న్యాయంచేయలేను.. నీ పొలంవిషయంలో తిరుపాల్ రెడ్డి అనే వ్యక్త జోక్యం చేసుకున్నాడు” అని స్వయంగా ఎమ్మెల్యేనే సిగ్గు లేకుండా అక్బర్ బాషాకి చెప్పాడు. ఎమ్మెల్యేనే తనకున్యాయం చేయక పోతే, ఇంకెవరు చేస్తారని, తనకు, తనభార్యాపిల్లలకు దిక్కెవరని బాషా బోరునవిలపించినా ఉపయోగంలేకుండా పోయింది. మైదుకూరు సీఐ కొండారెడ్డి, ఎమ్మెల్యేని కలిసిన బాషాని పట్టుకొని, అకారణంగా దుర్భాష లాడి, గొడ్డుని బాదినట్టు చావబాదాడు. “నువ్వు ఎవరిని కలిసినా ఉపయోగం ఉండదని, తాను చెప్పిందే జరుగుతుంది” అని సీఐ కొండారెడ్డి బాషాని బెదిరించడంజరిగింది.
బాషా భార్య ఇదేమి ఘోరమని సీఐని అడిగితే, ఆమెనుకూడా జుట్టుపట్టుకొని స్టేషన్ నుంచి ఈడ్చు కొచ్చి బయటపడేశారు. ఆడబిడ్డనే కనికరం లేకుండా సీఐ కొండారెడ్డి బాషాని, అతని భార్యని అనరాని మాటలని, దారుణంగా చిత్రహింసలకు గురిచేసి ఈడ్చిపారేయడంజరిగింది. అక్బర్ బాషా విషయంలో జరిగిన దారుణం చూశాక, అతనిభార్యని పోలీసులు చిత్రహింసలకు గురిచేసి, జుట్టుపట్టి ఈడ్చిబయటపడేశాక ఈ రాష్ట్రంలో న్యాయమనేది ఉందా అని టీడీపీ అధికారప్రతినిధిగా తాను ప్రశ్నిస్తున్నాను. సీఐ కొండారెడ్డి బాషాని పట్టుకొని “నా కొడకా నిన్ను ఎన్ కౌంటర్ చేస్తాను.. నీ పొలం కాదుకదా.. జాగా భూమికూడా నీకు దక్కదు… నువ్వు సీఎంని కలిసినా , నిన్ను కాపాడేవారు లేరు” అని అనరాని మాటలని బూటు కాళ్లతోతన్నాడు. దాంతో ఏంచేయాలో పాలుపోని బాషా తన ఆవేదనని వీడియోరూపంలో బాహ్యప్రపంచానికి, మరీముఖ్యంగా ముఖ్యమంత్రికి తెలిసేలా బహిర్గతపరిచాడు.
ఆ వీడియోలో బాషా మాట్లాడిన మాటలపై ప్రతి మైనార్టీ సోదరుడు ఆలోచించాలని వేడుకుంటన్నా. ఆ వీడియోలో బాషా ఏమన్నాడంటే “అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరొస్తే మాకేదో చేస్తారని ఆశపడ్డాం. నేను, నావాళ్లందరం వైసీపీకే ఓట్లువేశాం. నాకున్న కొద్దిపాటిభూమిని తిరుపాల్ రెడ్డి ఆక్రమించుకుంటే నేనెలా బతకాలి, తిరుపాల్ రెడ్డిని నిలువరించకుండా, ఎమ్మెల్యేకూడా ఆయనకు వత్తాసపలికితే, తాను, తనభార్యాబిడ్డలు ఎలా బతకాలి? తాను, తన కుటుంబం ఈభూమ్మీద బతకాలంటే నిత్యం సీఐ కొండారెడ్డి మమ్మల్ని తిట్టిన తిట్లే గుర్తుకొస్తున్నాయి. నన్ను, నా భార్యాపిల్లలను చంపేసి, మా నలుగురి శవాలను ముఖ్యమంత్రికే కానుకగా పంపిస్తానని అంటుంటే, ఇక మాకు దిక్కెవరు? మా బతుకులకురక్షణేది?” అని దు:ఖిస్తూ వేడుకున్నాడు.
అక్బర్ బాషా వీడియో చూశాక ఏ వైసీపీ నాయకుడుగానీ, కార్యకర్త గానీ స్పందించలేదు. ఎవరూ అయ్యో ఇదేమిటని అనలేదు. టీడీపీ నేతలు స్పందించారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, పుట్టాసుధాకర్ యాదవ్ లు స్పందించారు. అక్బర్ బాషా ఇంటికి తమవారిని పంపించి, బాషాకు ధైర్యం చెప్పారు. “బాషా నువ్వు అధైర్యపడకు, నీకకు అండగా మేమున్నాము.. నువ్వు తొందరపడి, భార్యాపిల్లలతో ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దు” అని ధైర్యం చెప్పారు. ఆ వీడియోలో బాషా మాటలు వింటుంటే, జగన్ ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీలకు ఇంకా ఇలాంటి దారుణాలు ఎన్నిజరగాలి, ఇంకెందరు జగన్మోహన్ రెడ్డి, ఆయనపార్టీ వారి దాష్టీకాలు, దౌర్జన్యాలకు బలికావాలని తాను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా.
అబ్దుల్ సత్తార్ కుటుంబం మాదిరే, అక్బర్ బాషా కూడా తనకుటుంబంతో బలికావాలన్నదే జగన్మోహన్ రెడ్డి, ఆయనపార్టీ ఎమ్మెల్యే రఘరామిరెడ్డి కోరుకుంటున్నారా? ముస్లిం మైనారిటీలు ఆర్థికంగా బలంగా లేకపోయినా, మానసికంగా వారు ఆత్మబలంతో బతుకుతున్నారనే వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి, ఆయనపార్టీ నేతలు తెలుసుకుంటే మంచిదని మీడియాముఖంగా హెచ్చరిస్తున్నాం. బాషాది ఏపార్టీ అయినప్పటికీ కూడా మైనార్టీలను వేధించి, వారి భూములు, ఆస్తులు లాక్కొనిచివరకు వారిచావులకు ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, వైసీపీనేతలు కారకులు అవుతుంటే టీడీపీ చూస్తూఊరుకోదని స్పష్టంచేస్తున్నాం.
అక్బర్ బాషా ఆవేదనపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు గారు తక్షణమేస్పందించారు. బాషాకి న్యాయంజరిగేలా చూద్దామని ఆయన తమతోచెప్పారు. బాషా కుటుంబానికి అవసరమైన సాయాన్ని అందించి, అతనికి చేదోడువాదో డుగా ఉండాలని ఇప్పటికే చంద్రబాబుగారు, కర్నూలుజిల్లా నేతలకు చెప్పడం జరిగింది. బాషా వైసీపీకార్యకర్త అయినా చంద్రబాబు స్పందించారు..కానీ వైసీపీనెతలెవరూ కనీసం అతనితో మాట్లాడను కూడా లేదు. ఇదేనా ఈప్రభుత్వంలో మైనారిటీలకు జరుగుతున్న న్యాయం, మంచి అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా.
రాష్ట్ర జనాభాలో 12శాతం ఉన్న ముస్లిం మైనారిటీలకు ప్రభుత్వాలను ఏర్పాటుచేయగలిగే బలం లేకపోయినా, వాటిని గద్దె దింపగల సత్తా , సామర్థ్యం ఉన్నాయి. ఈ వాస్తవాన్ని రాష్ట్రంలోని మైనారిటీలు ఎందుకు గ్రహించరు? అక్బర్ బాషా ఆవేదనను, రోదనను ఆయన వీడియోను ఇప్పటికే 10లక్షలమంది చూశారు. తనభార్యాపిల్లలతో కలిసి, అతను చెబుతున్నది వింటే మనసున్న ఎవరి హృదయమైనా ద్రవించాల్సిందే. కానీ జగన్మోహన్ రెడ్డి మనసుమాత్రం కరగడంలేదు. మైనార్టీలపై పని గట్టుకొని వైసీపీఎమ్మెల్యేలు, కార్యకర్తలు, గ్రామ, మండలస్థాయి నేతలు వేధిస్తున్నా, వారి ఆస్తులను కబళిస్తూ, వారికుటుంబాలను చెరబడుతు న్నా.. జగన్మోహన్ రెడ్డి ఎందుకు పట్టించుకోవడంలేదు?
రాజమహేంద్ర వరంలోని బొమ్మూరులో అబ్దుల్ సత్తార్ భార్యపై వైసీపీవారు గతంలో అఘాయిత్యానికి పాల్పడ్డారు. తనభార్యకు జరిగిన అవమానానికి, పోలీసులు చేసిన హేళనకు కుంగిపోయిన సత్తార్, అవమానభారంతో కుంగిపోయి పురుగులమందు తాగి కుటుంబంతోసహా బలవన్మరణానికి పాల్పడ్డాడు. సత్తార్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన తనతో, ఆయన భార్య తనకుజరిగిన ఘోరాన్నిచెప్పుకొని బావురుమంది. అంత దారుణం జరిగితే సత్తార్ కు, ఆయనకుటుంబానికి జగన్మోహన్ రెడ్డిగానీ, ఆయనప్రభుత్వం గానీ ఎలాంటి న్యాయం చేయలేదు. సత్తార్ భార్య మాటలు విన్న నామనస్సు కరిగిపోయింది.
కన్నీరు ఆగలేదు. కర్నూల్లో అబ్దుల్ సలాం.. రాజమహేంద్రవరంలో అబ్దుల్ సత్తార్ ఉదంతాలు మరువకముందే మొన్నటికి మొన్న దాచేపల్లిలో అలీషా అనే టీడీపీకార్యకర్తలను ఎక్సైజ్ పోలీసులు దారుణంగా హింసించారు. అతనేదో అక్రమ మద్యం అమ్ముతున్నాడంటూ, అతనికాళ్లపై , చేతులపై పుంచి ద్విచక్రవాహనాలు నడిపారు. దారుణంగా చిత్రహింసలకు గురిచేశారు. చివరకు అతన్ని బలితీసుకున్నారు. ఏ ఒక్క వైసీపీ నేతగానీ, కార్యకర్తగానీ అలీషా కుటుంబాన్నిపరామర్శించలేదు. అలీషా ఘటనపై కూడా ప్రభుత్వం స్పందించలేదు. అభం, శుభం తెలియని ఇద్దరుచిన్నారులు అలీషాకు ఉన్నారు. వారికి దిక్కెవరని ప్రశ్నిస్తున్నాం. సత్తైన పల్లిలో కరోనా సమయంలో మందులు కొనుగోలు చేయడానికి వెళ్లిన మైనారిటీ యువకుడిని పోలీసులు దారుణంగా కొడితే, అతనుచనిపోయాడు. ఆ యువకుడి కుటుంబానికి ఇంతవరకు ఈ ముఖ్యమంత్రి, ప్రభుత్వం న్యాయంచేయలేదు.
మస్లిం మైనారిటీలకు జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న అవమానాలు, వేధింపులు, హింసపై ప్రతి ముస్లిం సోదరుడు ఆలోచించాలి. ఈ దారుణాలపై ప్రతి మసీదులో చర్చజరగాలి. ఈ రోజు అక్బర్ బాషా ..రేపు మరో మైనారిటీ . ఈ దారుణాలు జగన్ ప్రభుత్వంలో ఎల్లకాలం సాగుతూనే ఉంటాయి. ఏంజరిగినా, తనపార్టీ వారు, తనకులం వారు ఎంతదారుణాలకు తెగబడుతున్నా, జగన్మోహన్ రెడ్డి స్పందించడు. జగన్మోహన్ రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని ఏంచేయాలనే దానిపై ముస్లిం మైనారిటీలే స్పందించాలి.
ఈ విధంగా వరుసగా జరుగుతున్న దారుణాలపై మానవత్వంతో, బాధతో టీడీపీ స్పందిస్తే, రాజకీయాలు అంటున్నారు. మొన్నటికి మొన్న లోకేశ్ గారుఆడబిడ్డ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తే, ఆయన్ని అడ్డుకోవడానికి దాదాపు 4వేలమంది పోలీసులను పెట్టింది ఈ ప్రభుత్వం ? లోకేశ్ చేసిన నేరమేంటి? ఆయనేమైనా ముఖ్యమంత్రిఇంటి ముట్టడికి బయలుదేరారా? లోకేశ్ అనూష కుటుంబాన్ని పరామర్శించ డానికి నరసరావుపేట వెళ్లకూడదా? దళితులు, మైనారిటీలు, బీసీలకు ఈ ప్రభుత్వంలో అన్యాయంజరిగితే చంద్రబాబునాయుడు, లోకేశ్ లు స్పందించకూడదా? వారు బయటకు రాకూడదా?
పోలీసులు మొన్న లోకేశ్ ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించి, టీడీపీ కార్యకర్తల దెబ్బతో దారుణంగా విఫలమయ్యారు. పోలీసుల ఉంది రాష్ట్రంలో దారుణలు, హత్యలు, అత్యాచారాలు జరగకుండా చూడటానికి, అంతేగానీ ప్రజలకు అన్యాయం చేయడానికి కాదు. కొంతమంది పోలీసులు తాము ఖాకీలమ నే విషయం మర్చిపోయి, పూర్తిగా వైసీపీకి తొత్తులుగా మారారు. డీజీపీ ఏంచేస్తున్నాడో ఆయనకే తెలియడం లేదు. ఈ రోజు మీది కావచ్చు.. రేపు మీదికాదని జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, ఆయన పార్టీ వారు, వారికి వంతపాడుతున్న పోలీసులు గ్రహించాలి.
చంద్రబాబునాయుడిని ఎంతలా జగన్మోహన్ రెడ్డిని దూషించినా ఆయన విజ్ఞతతో, నిబద్ధతతో వ్యవహరించాడు. అదే చంద్రబాబు తలుచుకొని ఉంటే, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రపేరుతో బయట తిరగగలిగేవాడా? కర్నూల్లో అక్బర్ బాషా కు న్యాయం జరగకపోతే, టీడీపీ వదిలిపెట్టదని హెచ్చరిస్తున్నాం. బాషా పొలం అతనికి అప్పగించకపోతే, అతని కుటుంబానికి న్యాయంచేయక పోతే, తాము, తమపార్టీ ఎట్టిపరిస్థితుల్లోనూ వైసీపీప్రభుత్వాన్ని వదిలిపెట్టదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను.

Leave a Reply