నారీ సంకల్ప దీక్షలో కొమ్మారెడ్డి పట్టాభిరాం

వంగపూడి అనిత అధ్యక్షతన జరుతున్న నారీ సంకల్ప దీక్షకు సంఘీభావం తెలిపిన పట్టాబిరాం. చంద్రబాబు నాయుడు డ్వాక్రా ద్వారా మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయాలని కృషిచేశారు. కానీ, నేడు జగన్ రెడ్డి ఒక కాల్ మనీ వ్యాపారిగా మారిపోయారు. రేషన్ షాపుల్లోనే ధరలు పెంచిన ఘనుడు జగన్ రెడ్డి. తెలుగుదేశం ప్రవేశపెట్టిన అన్ని కానుకల పథకాలను రద్దు చేశారు. దేశం మొత్తం పెట్రోల్ ధరలు తగ్గిస్తే జగన్ రెడ్డి తగ్గించలేదు. స్కూలు పిల్లల చిక్కీని సైతంను వదలకుండా మింగుతున్నాడు జగన్ రెడ్డి. అన్నీ వర్గాల ప్రజలపై బాదుడు కార్యక్రమం మొదలుపెట్టి బాదుడు ముఖ్యమంత్రిగా మారిపోయారు జగన్ రెడ్డి. రాబోయే ఎన్నికల్లో తెలుగు మహిళలు జగన్ రెడ్డిని గద్దెదించే వరకు పోరాటం చేయాలి.

Leave a Reply