దళిత మహిళను తెలుగు మహిళా అధ్యక్షురాలుగా చేసిన ఘనత టీడీపీదే

-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

మహిళా సంకల్ప దీక్షతో జగన్ ఉలిక్కిపడుతున్నారు, దళిత మహిళ అనిత ఆధ్వర్యంలో మ్రోగించిన నారి భేరీ జగన్ రెడ్డి పతనానికి నాంది. వినోద్ జైన్ వెల్లంపల్లి శిష్యుడు కాదా? వైసీపీ టిక్కెట్టు ఇవ్వకపోతే టీడీపీ వాళ్ల కాళ్ల మీద పడ్డాడు , వినోద్ జైన్ ని తీవ్రం శిక్షించాలి. తూ.గో జిల్లాలో దళిత మహిళను 4 రోజుల పాటు సామూహిక అత్యాచారం చేస్తే హోం మంత్రి ఎందుకు మాట్లాడలేదు?. పులివెందులలో దళిత మహిళ నాగమ్మను అత్యాచారం చేస్తే ఎందుకు మాట్లాడలేదు?. నాగమ్మ కుటుంబానికి న్యాయం చేయమని కోరేందుకు వెళ్లిన అనిత, ఎం.ఎస్ రాజులపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు.

దుర్వోధనుని ‎అహం జగన్ లో మూర్తీభవించింది. దళిత మహిళపై అత్యాచారాలు జరిగినపుడు, దళిత యువకుడికి శిరోముండనం చేసినపుడు, మాస్కు పెట్టుకోలేదని దళిత యువకుడు కిరణ్ ని పోలీసులు కొట్టి చంపినపుడు హోంమంత్రి నోరు ఎందుకు పెగలలేదు?. మద్యం రేట్లపై ప్రశ్నించిన దళిత యువకుడు అనుమాస్పదంగా చనిపోతే ఎందుకు మాట్లాడలేదు?. ఎక్కడో మహిళల్ని గౌరవిస్తారో, అక్కడ అంతా సస్యశ్యామలంగా ఉంటుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ దీక్ష ఎందుకు చేస్తున్నారో తాడేపల్లిలో కపట నిద్ర నటిస్తున్న ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. గుడివాడలో క్యాసినో నిర్వహించటం వల్ల మహిళల పుస్తెలు తెంచుకుని వచ్చి మరీ వారి భర్తలు జూదం ఆడారు.మాదిగలంతా టీడీపీ వైపు మళ్లాల్సిన చారిత్రక అవసరం ఉంది, టీడీపీ బడుగు, బలహీన వర్గాల పార్టీ. వైసీపీ ముద్దాయిల, నేరస్తుల, దొంగల పార్టీ అని ప్రజలకు అర్దమైపోయింది, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం. ఒక్కొక్క మహిళ ఒక సత్యభామ, ఒక మాంచాన లాగా ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగి నరకాసురుడైన జగన్ రెడ్డిని రాజకీయంగా అంతం చేయాలి.

Leave a Reply