జగన్ పాలనలో అడుగడుగునా మహిళలకు భయం పట్టుకుంది

– వయోబేధం లేకుండా నిత్యం మహిళలపై అఘాయిత్యాలు
-తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు తారా స్థాయికి చేరాయి జగన్ వచ్చాక నిత్యకృత్యంగా మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుతున్నాయి. మహిళల్ని చైతన్యం చేయడం కోసం ఏర్పాటు చేసిన నారీ సంకల్ప దీక్షకు పిలుపునివ్వడం మంచి పరిణామం.శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు వయోబేధం లేకుండా నిత్యం దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే సమాజంలో జగన్ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. కుటుంబాలను పోషించడంలో మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జగన్ పాలనలో అడుగడుగునా మహిళల్లో భయం పట్టుకుంటోంది. మహిళలపై దారుణాలు జరుగుతున్నా జగన్ కు చీమకుట్టినట్లు కూడా లేదు. ప్రభుత్వ దమనకాండను తగ్గించేందుకు మహిళలు ఇంకా చైతన్యం కావాలి. జగన్ డబ్బుకు ఆశపడి తల్లి, చెల్లిని రోడ్డున పడేశాడు. కొడాలి నాని ఆధ్వర్యంలో అర్థనగ్న ప్రదర్శనలు, డ్యాన్సులను జగన్ వేయిస్తున్నారు. ప్రభుత్వం సృష్టిస్తున్న ఆటంకాలను మహిళలు చేధించారు. అన్ని కుటుంబాల్లో నేటి నారీ సంకల్ప దీక్షపై చర్చ జరుగుతోంది. మహిళల పాత్ర, కృషి సమాజానికి చాలా అవసరం.

Leave a Reply